సైఫాబాద్ ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సైఫాబాద్ లో ఉన్న భవనం. లండన్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌ మాదిరిగా నిర్మించబడిన ఈ సైఫాబాద్ ప్యాలెస్, నిజాంకు ఖాజానాగా ఉపయోగపడి, ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలోని జి-బ్లాకుగా ఉపయోగించబడుతుంది.[1][2]

సైఫాబాద్ ప్యాలెస్
Saifabad Palace.jpg
సాధారణ సమాచారం
రకంరాజభవనం
నిర్మాణ శైలియూరోపియన్
ప్రదేశంసైఫాబాద్, హైదరాబాదు, తెలంగాణ
భౌగోళికాంశాలు17°24′36″N 78°28′08″E / 17.4099°N 78.4690°E / 17.4099; 78.4690Coordinates: 17°24′36″N 78°28′08″E / 17.4099°N 78.4690°E / 17.4099; 78.4690
పూర్తి చేయబడినది1888
ప్రారంభం1940
క్లయింట్హైదరాబాదు రాష్ట్ర నిజాం రాజులు

నిర్మాణంసవరించు

ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ తన నివాసంకోసం 1887లో లండన్ నగరంలోని బకింగ్‌హామ్ ప్యాలెస్ నమూనాలో ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. డంగ్‌ సున్నం, పలు ప్రాంతాల నుంచి తెచ్చిన ప్రత్యేకమైన రాళ్లతో పెద్ద గోడలు, ఎత్తైన గేట్లతో 1888లో యూరోపియన్‌ శైలిలో రెండంతస్తుల్లో సైఫాబాద్ ప్యాలెస్ నిర్మించబడింది.[3] కానీ ఆలీఖాన్ ఒక్కరోజు కూడా ఈ భవనంలో గడపలేదు.

చరిత్రసవరించు

మహబూబ్ అలీ ఖాన్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు, హుస్సేన్‌ సాగర్‌ సమీపంలోని ప్రశాంత వాతావరణంలో సేద తీరితే ఆరోగ్యం మెరుగవుతుందని ఆస్థాన వైద్యులు (హకీంలు) సూచించారు. 1987లో సైఫాబాద్ ప్యాలెస్ నిర్మాణం జరుగుతుండగా, ఒక రోజు తన ఆస్థాన ప్రధాన మంత్రి మహారాజ కిషన్ ప్రసాద్‌తో కలసి ప్యాలెస్‌ను చూడడానికి ఏనుగు అంబారీపై అలీ ఖాన్ బయల్దేరాడు. ప్యాలెస్ సమీపంలోకి రాగానే ఒక అశుభ సూచకం ఎదురొచ్చింది. అది చూసిన జ్యోతిషులు పురానా హవేలీని వదలడం మంచిది కాదని నిజాంకు జోస్యం చెప్పడంతో సైఫాబాద్ ప్యాలెస్ కు వచ్చే ఆలోచనను మానుకున్నాడు. దాంతో నిజాం ఆర్థికమంత్రి సర్ అక్బర్ హైద్రీ, ప్రధానమంత్రి కార్యాలయాల కోసం ఈ ప్యాలస్ కేటాయించబడింది.

స్వాతంత్య్రం తరువాతసవరించు

స్వాతంత్ర్యం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డిన తరువాత బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, భవనం వెంకట్రామ్, టి. అంజయ్య, నేదురుమల్లి జనార్ధనరెడ్డి తదితర ముఖ్యమంత్రులు జి బ్లాక్‌ నుంచి పరిపాలన వ్యవహారాలు కొనసాగించారు. 1978లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి సచివాలయంలో కొత్తగా కొన్ని భవనాలను నిర్మించి ముఖ్యమంత్రి కార్యాలయాలను వాటిల్లోకి మార్చాడు. చివరగా నందమూరి తారక రామారావు ఈ ప్యాలెస్‌లోని మొదటి అంతస్తులోనే తన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకున్నారు.[4]

పరిరక్షణసవరించు

130 ఏళ్లు పైబడిన వారసత్వ కట్టడమైన ఈ ప్యాలెస్ ను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది.

మూలాలుసవరించు

  1. సాక్షి, ఫీచర్స్ (5 October 2014). "సైఫాబాద్ ప్యాలెస్". మూలం నుండి 3 March 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 3 March 2019. Cite news requires |newspaper= (help)
  2. "The 'unlucky' building spooking an Indian minister". BBC News (ఆంగ్లం లో). 2016-11-07. Retrieved 3 March 2019.
  3. ఆంధ్రజ్యోతి, ముఖ్యాంశాలు (8 February 2015). "అరవయ్యేళ్ల పాలన కేంద్రం". మూలం నుండి 3 March 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 3 March 2019. Cite news requires |newspaper= (help)
  4. ఆంధ్రజ్యోతి, ముఖ్యాంశాలు (19 May 2017). "హైదరాబాద్ లో సచివాలయం..ఇక చరిత్రే". మూలం నుండి 3 March 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 3 March 2019. Cite news requires |newspaper= (help)