సోమంచి శ్రీదేవి
సోమంచి శ్రీదేవి (సాహితి గా సుపరిచితురాలు) తెలుగు రచయిత్రి.[1]
జీవిత విశేషాలు
మార్చుసోమంచి శ్రీదేవి పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో జన్మించింది. వరంగల్లు లో తపాలా శాఖలో ఉద్యోగంలో చేరి హెడ్ పోస్టు మాస్టరుగా చేసి స్వచ్ఛంద పదవీవిరమణ చేసింది. ఆమె మొదటి కథ "అనగనగా' 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చయింది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి[2], గుండెలోతు[3] అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనేనవలలకి ఆంధ్రభూమి ద్వితీయ 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005కి గాను వచ్చింది. ఎంతెంతదూరం?[4] అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి. కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.[5]
మూలాలు
మార్చు- ↑ "సోమంచి శ్రీదేవి - కథానిలయం". kathanilayam.com. Retrieved 2024-10-20.
- ↑ "సింధూరి_ఎస్ శ్రీదేవి_ఆంధ్రభూమి (వారం)_20031106_040490_కథానిలయం.pdf". Google Docs. Retrieved 2024-10-20.
- ↑ "గుండెలోతు_ఎస్ శ్రీదేవి_పుస్తకం (ప్రత్యేకం)_20160124_091591_కథానిలయం.pdf". Google Docs. Retrieved 2024-10-20.
- ↑ "ఎంతెంత దూరం_సోమంచి శ్రీదేవి_ఆంధ్రప్రభ (ఆదివారం)_19931003_044147_కథానిలయం.pdf". Google Docs. Retrieved 2024-10-20.
- ↑ "somanchi sridevi - మయూఖ" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-20.
బాహ్య లంకెలు
మార్చు- సోమంచి శ్రీదేవి రాసిన కథలు - కథానిలయం లో