సౌదాగర్ గంగారాం

సౌదాగర్ గంగారాం నిజామాబాదు జిల్లాకు చెందిన కాంగ్రేసు పార్టీ రాజకీయ నాయకుడు. 1978లో జుక్కల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యాడు. అప్పటి నుండి 2009లో తప్ప మిగిలిన అన్ని ఎన్నికలలో జుక్కల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేశాడు. 2009లో తన భార్య సావిత్రీబాయి జుక్కల్ నియోజకవర్గం నుండి పోటీచేసింది. మొత్తం ఎనిమిది సార్లు జుక్కల్ నుండి బరిలోకి దిగిన గంగారాం నాలుగు పర్యాయాలు శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు. గంగారాం నిజామాబాదు జిల్లా, పిట్లం మండలంలోని చిన్నకోడప్‌గల్ గ్రామంలో జన్మించాడు.

1999లో జుక్కల్ కాంగ్రేసు పార్టీ టికెట్ రాజేశ్వర్‌కు దక్కగా, గంగారాం తిరుగుబాటుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన టి. అరుణ తార విజయం సాధించింది. దీంతో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు గంగారాంను ఆరేళ్లపాటు కాంగ్రెస్ అధిష్టానం పార్టీ నుండి బహిష్కరించింది. తదనంతరం జరిగిన పరిణామాలతో తిరిగి కాంగ్రెస్ టికెట్ పైనే 2004లో పోటీ చేసి, గంగారాం టీడీపీ అభ్యర్థి హన్మంత్ సింధేపై గెలుపొందాడు. 2009లో ఆయన భార్య సావిత్రీబాయిని ఎన్నికల బరిలోకి దించగా ఓటమిపాలు కావడంతో ధర్మాన .శ్రీనివాస్‌తో సహా పలువురు కాంగ్రేస్ సీనియర్ నాయకులపై గంగారాం వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో మరోసారి ఆరేళ్ల పాటు పార్టీనుండి బహిష్కరణకు గురయ్యాడు.[1][2]

మూలాలు మార్చు

  1. వేటు.. వివాదం - సాక్షి పత్రిక April 18, 2014
  2. Sakshi (9 November 2018). "కాంగ్రెస్‌ దూకుడు". Retrieved 25 November 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)