టి. అరుణ తార

కామారెడ్డి జిల్లా మహిళా రాజకీయ నాయకులు

టి. అరుణ తార, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1999 నుండి 2004 వరకు జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది.[1] అరుణతార ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా ఉంది.[2]

టి. అరుణ తార

మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1999 నుండి 2004
నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1973
జుక్కల్, కామారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం పార్టీ
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యం

మార్చు

అరుణతార 1973లో తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, జుక్కల్ లో జన్మించింది. ఆమె హైదరాబాద్‌లోని వనిత మహా విద్యాలయ నుండి 1998లో ఎం.కామ్ పూర్తి చేసి, ఉస్మానియా లా కళాశాల నుండి 2000లో ఎల్.ఎల్.ఎం పూర్తి చేసింది.[3][4][5]

రాజకీయ జీవితం

మార్చు

అరుణతార తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సౌదాగర్ గంగారాం పై 10154 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైంది. అరుణతార 2004లో టికెట్ దక్కలేదు, ఆమె 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పి.ఆర్.పి అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచింది.

అరుణతార 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచింది. ఆమె ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరింది. అరుణతార 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించింది, టికెట్ దక్కకపోవడంతో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది.[6]

మూలాలు

మార్చు
  1. Sakshi (3 November 2018). "నిజామాబాద్‌ నియోజకవర్గా ఎన్నికల రివ్యూ". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  2. The Hans India (23 September 2020). "Kamareddy: Aruna Tara, new district BJP chief" (in ఇంగ్లీష్). Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 22 అక్టోబరు 2020 suggested (help)
  3. Sakshi (22 November 2018). "బరిలో ఇంజినీర్లు". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  4. V6 Velugu (24 September 2023). "లక్షల ఆదాయం వదులుకొని : పాలిటిక్స్​లోకి ప్రొఫెషనల్స్". Archived from the original on 24 September 2023. Retrieved 24 September 2023. {{cite news}}: zero width space character in |title= at position 35 (help)CS1 maint: numeric names: authors list (link)
  5. Eenadu (14 November 2023). "మన అభ్యర్థులవి పెద్ద చదువులే". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  6. Eenadu (24 October 2023). "కమల దళం సిద్ధం". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.

బయటి లింకులు

మార్చు