సౌదామిని
సౌదామిని 1951లో విడుదలైన తెలుగు చిత్రం.
సౌదామిని (1951 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కడారు నాగభూషణం |
---|---|
నిర్మాణం | కడారు నాగభూషణం |
కథ | ఆరుద్ర |
తారాగణం | చిలకలపూడి సీతారామాంజనేయులు, కన్నాంబ, జి.వరలక్ష్మి, రజిని, కనకం, ఏ.వి.సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు, రేలంగి, సూరిబాబు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | రాజరాజేశ్వరీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
టెక్నీషియన్లు
మార్చుఅంశాలు | నిర్వహించేవారు. | |
---|---|---|
పాటలు మాటలు | సముద్రాల రాఘవాచార్య | |
సంగీత దర్శకుడు | ఎస్.వి.వెంకట్రామన్ | |
నాట్య దర్శకుడు | అనిల్ కుమార్, వెంపటి సత్యం | |
కళాదర్శకుడు | కె.ఆర్.శర్మ | |
సెట్టింగ్స్ | పి.కె.వేణు | |
మేకప్ | సహదేవరావు | |
ఫొటోగ్రఫీ | పి.ఎల్లప్ప | |
స్టిల్స్ | ఎల్.కె.రావు | |
సౌండ్ రికార్డింగ్ | పి.రంగారావు | |
రికార్డింగ్ యంత్రం | ఆర్.సి.ఎ | |
ఎడిటర్ | ఎన్.కె.గోపాల్ | |
ప్రాసెసింగ్ | వి.రామస్వామి | |
ప్రొడక్షన్ | పి.బుచ్చిబాబు, పి.సి.నంబియార్ | |
సహదర్శకులు | జి.రాధాకృష్ణన్, డబ్ల్యు.ఆర్.శ్రీనివాసన్ | |
స్టుడియో | జెమిని | |
నిర్మాత- దర్శకుడు | కె.బి.నాగభూషణం |
కథ
మార్చుమాళవ దేశపు రాజు విక్రమసేనుడూ, రాణి సౌదామినీ దేవి సంతానము కొరకు బోధాయన మహర్షిని ఆశ్రయించి ప్రసాదం పొందుతారు. కొంతకాలానికి రాజు విలాసవతి అనే నాట్యకత్తెకు వశుడై రాణినే కాకుండా రాజ్యాంగమును గూడా మరచిపోతాడు. మంత్రి మహామతి విలాసవతిని దేశ నుంచి వెడలగొట్టడం మంచిదని రాణికి సలహా యిస్తాడు. ఈ సంగతి తెలిసిన విలాసవతి, బోథాయన మహర్షి వరప్రసాదము వలన గర్భవతి అయిన రాణికి, మంత్రికి సంబంధము కల్పించి, దానిని రాజుతో చెప్పి, మంత్రికి ఉరిశిక్ష, రాణికి అడవిలో చిత్రవథ విధించేట్టు చేస్తుంది. కాని విథి బలంవలన సౌదామిని గోపాలుడనే సత్పురుషుని అండన ఉదయ సేనుడను బాలుని ప్రసవిస్తుంది. మాళవ నగరంలో విలాసవతీ ఆమె ప్రియుడూ సైన్యాధ్యక్షుడూ అయిన కామపాలుడూ రాజును తమ చేతిలోని కీలుబొమ్మగా చేసుకుని దృష్టి పోవునట్లుగా చేసే అధికారం చలాయిస్తున్నారు. ఈ వార్త తెలిసిన సౌదామిని తండ్రిని రక్షించడానికిగాను కుమారుని నియోగించి ఆశీర్వచనముకొరకు బోధాయన మహర్షి వద్దకు పంపుతుంది. బోధాయనుడున్న కుంతల దేశపు రాజకుమార్తి హేమవతీని వివాహమాడదలచి కామపాలుడు కబురు చేస్తాడు. కాని రాకుమారి స్వప్నములో చూచిన తన ప్రియని వివాహమాడ నిశ్చయించకుంటుంది.
రాజు దృష్టి నయముచేయటానికి బయలుదేరిన ఉదయసేనుడు బోధాయనుని చేరి కర్తవ్యము తెలుసుకుంటాడు. ఇంతలో హేమవతి ఉదయాసేనుని చూచి తన స్వప్నసుందరునిగా గుర్తించింది. వారి చర్యలు కనిపెట్టిన శూరసేనుడు వారిని ఖైదు చేస్తాడు. కానీ వారు తప్పించుకు పోయి అడవి చేరుతారు. ఐతే అక్కడ దైవఘటన వలన వారికి యెడబాటు కలుగుతుంది.
తప్పించుకుపోయిన ఉదయ సేన హేమవతుల కొరకు రాజు ప్రకటన గావించాడు. రాకుమారుని కొరకు వచ్చిన సౌదామిని విషయము తెలిసి మూర్చపోతుంది బంధించబడుతుంది. హేమవతీ కొరకు అక్కడికి వచ్చిన కామపాలుడు సౌదామినిని గుర్తించి ఆమెను చంపవలసినదని సలహా యిస్తాడు. కాని శూరసేనుడు ఉదయనుని రాబట్టడానికి గాను ఆమెను ఖైదు చేస్తాడు. అక్కడ అడవిలో హేమవతి ఒక దుష్టమాంత్రికుని చేతిలో పడుతుంది. హేమవతి నుండి విడిపోయిన ఉదయనుడు ఒక దేవకన్య ప్రభావంవలన తండ్రి దృష్టిని నయం చేయగల దేశమందాక పూలతో సహా ముందుగా హేయవతివద్దకువచ్చి ఆమెను తన తల్లి రక్షణకు పంపి తాను తండ్రి వద్దకు పోతాడు. ఆ ప్రయత్నంలో ఆతడికి ఉరిశిక్ష విధింపబడుతుంది.