స్టాక్‌హోమ్

(స్టాక్‌హోం నుండి దారిమార్పు చెందింది)

స్టాక్‌హోమ్ స్వీడన్ దేశపు రాజధాని నగరం, అతిపెద్ద నగరం. స్వీడన్ లోని జనాభాలో అత్యధికంగా 22 శాతం ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. స్వీడన్ కు ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లుతోంది. అద్భుతమైన భవన సముదాయాలతో, విస్తారమైన జల నిల్వలతో, అనేక ఉద్యానవనాలతో విలసిల్లే అందమైన నగరంగా పేరు గాంచింది. ఇది అనేక దీవుల సముదాయం.

స్టాక్‌హోమ్
స్టాక్హోమ్ సిటీ హాల్, హొటొర్గెట్ భవనాలు, ఎరిక్సన్ గ్లోబ్, స్టాక్ హోమ్ పాలెస్
స్టాక్హోమ్ సిటీ హాల్, హొటొర్గెట్ భవనాలు, ఎరిక్సన్ గ్లోబ్, స్టాక్ హోమ్ పాలెస్
స్టాక్హోమ్ సిటీ హాల్, హొటొర్గెట్ భవనాలు, ఎరిక్సన్ గ్లోబ్, స్టాక్ హోమ్ పాలెస్
అక్షాంశరేఖాంశాలు: 59°19′46″N 18°4′7″E / 59.32944°N 18.06861°E / 59.32944; 18.06861
జనాభా (2012)
 - మొత్తం 881,235
 - సాంద్రత 4,700/km2 (12,000/sq mi)/km2 (సమాసంలో(Expression) లోపం: గుర్తించలేని పదం "km"/sq mi)
కాలాంశం సి ఈ టి (UTCసి ఈ టి)
 - Summer (DST) సి ఈ టి (UTC)
పిన్ కోడ్ 100 00-200 00
Area code(s) +46-8
ఎస్.టి.డి కోడ్ +46-8
వెబ్‌సైటు: www.stockholm.se

1252 నుంచే ఇది ఒక పట్టణంగా విలసిల్లింది. ఇందులో చాలా భాగం వరకు బిర్జర్ జార్ల్ నిర్మించినట్లు తెలుస్తోంది.ఆ తరువాత జర్మన్ నగరమైన లుబెక్ తో ఏర్పాటు చేసుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల వేగంగా అభివృద్ధి చెందింది.ఈ ఒప్పందం ప్రకారం జర్మన్ వర్తకులు ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు.1436 లో ఈ నగరం అధికారికంగా స్వీడన్ రాజధానిగా ప్రకటించబడింది.

మూలాలు

మార్చు