జన సాంద్రత
జనసాంద్రత (ఆంగ్లంలో Population density) ఒక, జనాభా కొలమాన విధానం. ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో నివసించే జనాభాను జనసాంద్రతగా పరిగణిస్తారు.[1]
2006, దేశాలవారీ జనసాంద్రత.
మానవ జనాభా సాంద్రతసవరించు
హాంకాంగ్ లోని ఒక వీధిలో జనాభా రద్దీ, ప్రపంచంలోని అత్యధిక జనసాంద్రతగల ప్రాంతాలలో ఒకటి.
మానవులలో, జనసాంద్రత, ఒక యూనిట్ (ఉదాహరణకు ఒక చదరపు కిలోమీటరు) తీసుకుని, దానిలో నివసించు జనాభాను తీసుకుని, సరాసరి గణిస్తారు. దీనిని, ప్రపంచం, ఖండం, దేశం, రాష్ట్రం, నగరం, ఇతర విభాగాల వారీగా గణిస్తారు.
- ప్రపంచ జనాభా 6.6 బిలియన్ ప్రజలు, భూమి వైశాల్యం 510 మిలియన్ చ. కి., (200 మిలియన్ చదరపు మైళ్ళు).
- ఈ రీతిలో, జనాభా / విస్తీర్ణం (వైశాల్యం); 6.6 బిలియన్లు / 510 చదరపు కి.మీ. = 13 మంది జనాభా ఒక చదరపు కి.మీ.నకు (ఒక చదరపు మైలుకు 33 మంది)
- లేదా భూమిపై గల భూభాగాన్ని లెక్కగట్టితే భూభాగం 150 మిలియన్ కి.మీ.² ఈ లెక్కన ఒక చదరపు కి.మీ.నకు 43 మంది జనాభా (ఒక చదరపు మైలుకు 112 మంది).
- జనాభా పెరుగుదలతో జనసాంద్రతకూడా పెరుగుతుంది.
ఇతర కొలమాన విధానాలుసవరించు
- జనాభా సాంద్రత కొలవడానికి, గణిత సాంద్రత విధానము సాధారణమైనది, కానీ కొన్ని ఇతర విధానాల ద్వారా కూడా, ఓ నిర్ణీత ప్రదేశంలో జనసాంద్రత కొలుస్తారు.
- గణిత సాంద్రత: మొత్తం ప్రజలు / ప్రాంత వైశాల్యం కి.మీ² లేదా మై.².
- భూమి మీద జనాభా సాంద్రత: మొత్తం జనాభా / లభ్యమవుతున్న భూమి.
- వ్యవసాయ సాంద్రత: మొత్తం గ్రామీణ జనాభా / మొత్తం వ్యవసాయ భూమి.
- నివాసాల సాంద్రత: పట్టణ ప్రాంతాలలో నివసించు జనాభా / నివాసయోగ్యమైన భూమి.
- పట్టణ సాంద్రత: పట్టణ ప్రాంతంలో నివసించు జనాభా / మొత్తం పట్టణ ప్రాంతం.
- ఉత్తమమైన పర్యావరణ: ప్రాంతీయ సహజవనరుల ఆధారంగా గల జనసాంద్రత.
ఇవీ చూడండిసవరించు
- ప్రపంచ జనాభాకు సంబంధించిన కొన్ని జాబితాలు
- దేశాల జాబితా – జనసంఖ్య క్రమంలో
- దేశాల జాబితా – 2005 జనసంఖ్య క్రమంలో
- దేశాల జాబితా – 1907 జనసంఖ్య క్రమంలో
- దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో
- దేశాల జాబితా – జననాల రేటు క్రమంలో
- దేశాల జాబితా – ఆంగ్లభాష మాట్లాడేవారి సంఖ్య క్రమంలో
- దేశాల జాబితా – అక్షరాస్యత క్రమంలో
- దేశాల జాబితా – పేదరికంలో ఉన్న జనసంఖ్య శాతం క్రమంలో
- దేశాల జాబితా – మానవ అభివృద్ధి సూచికలు
మూలాలుసవరించు
ఇతర లింకులుసవరించు
Look up జన సాంద్రత in Wiktionary, the free dictionary.
- City Ranks combines Google Maps and 2000 Census data to show the population densities of U.S. zip codes on an interactive map.
- Selected Current and Historic City, Ward & Neighborhood Densities
- Population density world-map Archived 2007-06-20 at the Wayback Machine