ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్
ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనేది యునైటెడ్ స్టేట్స్లో ఉన్న ఒక జాతీయ ఉద్యానవనం. ఇది ప్రపంచంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనముగా గుర్తింపు పొందింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు యులెసీస్ యస్. గ్రాంట్ దీన్ని సృష్టించడానికి 1872 మార్చి 1 న చట్ట సంతకం చేయడంతో ఇది సృష్టించబడింది. ఈ ఉద్యానవనం గుండా ఎల్లోస్టోన్ నది ప్రవహిస్తుండటం వలన ఈ ఉద్యానవనానికి ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనే పేరు వచ్చింది. ఎల్లోస్టోన్ ను 1978 లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఇక్కడున్న వేడి నీటి బుగ్గల, హాట్ స్ప్రింగ్ ల వలన ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఉన్న వేడి నీటి బుగ్గలలో సగం ఈ పార్క్ కలిగి ఉంది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ గీజర్ అయిన ఓల్డ్ ఫెయిత్‌ఫుల్ గీజర్ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ లో ఉంది. ఈ పార్కు బూడిద రంగు ఎలుగుబంట్లు, తోడేళ్లు, అడవిదున్న, కణితలకు కూడా నిలయం. అనేక మంది పర్యాటకులు ఇక్కడున్న వేడినీటిబుగ్గలను, జంతువులను చూడటానికి ప్రతి సంవత్సరం వస్తుంటారు. ఈ పార్క్ గ్రేటర్ ఎల్లోస్టోన్ పర్యావరణ వ్యవస్థ యొక్క కేంద్రంగా ఉంది.
Yellowstone National Park | |
---|---|
IUCN category II (national park) | |
Grand Canyon of Yellowstone | |
Location of Yellowstone National Park | |
ప్రదేశం | Park County, Wyoming Teton County, Wyoming Gallatin County, Montana Park County, Montana Fremont County, Idaho |
భౌగోళికాంశాలు | 44°36′N 110°30′W / 44.600°N 110.500°W |
విస్తీర్ణం | 2,219,791 acres (3,468.423 sq mi; 898,318 ha; 8,983.18 km2)[1] |
స్థాపితం | 1872 మార్చి 1 |
సందర్శకులు | 3,394,326 (in 2012)[2] |
పాలకమండలి | U.S. National Park Service |
రకం | Natural |
క్రైటేరియా | vii, viii, ix, x |
గుర్తించిన తేదీ | 1978 (2nd session) |
రిఫరెన్సు సంఖ్య. | 28[3] |
Region | The Americas |
Endangered | 1995–2003 |

మూలాలు మార్చు
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;acres
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ మూస:NPS visitation
- ↑ "Yellowstone National Park". UNESCO World Heritage Centre. Retrieved 2012-03-24.