స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా భారతీయ స్టేట్ బ్యాంకుకు చెందిన ఒక అనుబంధ బ్యాంకు, భారతదేశములోని షెడ్యుల్డ్ బ్యాంకులలో ఒకటి. ప్రారంభంలో హైదరాబాదు నిజాంచే ఈ బ్యాంకు స్థాపించబడింది. స్వాతంత్ర్యం అనంతరం ఇతర బ్యాంకులతో పాటు సంస్థానంలోని ఈ బ్యాంకును కూడా 1959 బ్యాంకుల అనుబంధ చట్టం ప్రకారం పేరు మార్చబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుబంధ బ్యాంకుగా చేయబడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, భారతీయ స్టేట్ బ్యాంకుకు మొట్టమొదటి అనుబంధ బ్యాంకు. దీని ప్రధాన కేంద్రం హైదరాబాదు నగరంలో ఉంది.
రకం | Public Sector |
---|---|
పరిశ్రమ | Banking Insurance Capital Markets and allied industries |
స్థాపన | King Mir Osman Ali Khan, Hyderabad State Bank Hyderabad, 8 August 1941 |
క్రియా శూన్యత | 31 మార్చి 2017 |
ప్రధాన కార్యాలయం | Gunfoundry, Abids Hyderabad India |
సేవ చేసే ప్రాంతము | Pan-India. |
కీలక వ్యక్తులు | Arundhati Bhattacharya (Chairman), Santanu Mukherjee (Managing Director) |
ఉత్పత్తులు | Personal Banking Schemes, Corportate Banking, SME Banking Schemes, FOREX, Mobile Banking, Internet Banking, Credit Cards, Insurance |
యజమాని | Government of India |
మాతృ సంస్థ | State Bank of India (100% owned) |
చరిత్ర
మార్చుహైదరాబాదు సంస్థానాన్ని పరిపాలించిన చివరి నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో 1941లో నిజాం రాజ్యపు కేంద్ర బ్యాంకుగా దీనిని స్థాపించారు. బ్రిటీష్ పరిపాలన కాలంలో నిజాం రాజ్యంలో ప్రత్యేకంగా చెలామణి అవుతున్న ఉస్మానియా సిక్కా కరెన్సీని కూడా ఈ బ్యాంకు నిర్వహించేది.
ఇవి కూడా చూడండి
మార్చు
బయటి లింకులు
మార్చు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు అధికారిక వెబ్ సైటు Archived 2007-12-06 at the Wayback Machine