స్నాతకోత్సవం (ఆంగ్లం: Convocation) విశ్వవిద్యాలయంలో చదువు ముగిసిన తరువాత విద్యార్ధులకు డిగ్రీని అందచేయడానికి జరుపే ఉత్సవాన్ని స్నాతకోత్సవం అంటారు. ప్రతి విశ్వవిద్యాలయం దాని అనుబంధ కళాశాల విద్యార్ధులకు స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టాను అందజేస్తారు. ఈ ఉత్సవంలో ఉత్తమ విద్యార్థులను తగిన పారితోషకంతో కూడా సత్కరిస్తుంటారు.

స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టాను అందుకోబోతున్న విద్యార్థులు
స్నాతకోత్సవ బ్యానర్

పేరు వెనుక కథ

మార్చు

సాంగోపాంగంగా వేదాభ్యాసం పూర్తయ్యాక స్నానం చేయించి సమావర్తన హోమం చేయిస్తారు. ఆ తతంగానికి స్నాతకం అని పేరు. ఆ తరువాత "చదువైపోయింది కనుక ఇహ బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచిపెట్టి చక్కని సుశీలవతి అయిన కన్యను వివాహమాడి గృహస్థాశ్రమంలో ప్రవేశించవలసినది" గా గురువు శిష్యుడికి ఆదేశిస్తాడు. కొన్నిసార్లు ఆయనే స్వయంగా అమ్మాయిని వెతికి శిష్యుడికోసం సిద్ధంగా ఉంచుతాడు. ఆయన ఎవరిని చేసుకోమంటే వారిని పెళ్ళి చేసుకోవలసిందే. లేదా నైష్ఠిక బ్రహ్మచర్య దీక్ష తీసుకోదల్చిన శిష్యుడు వివాహ సంస్కారాన్ని మానుకొని జీవితాంతం అగ్నిని ఉపాసిస్తూ గురువుగారి సేవలోను, ఆయన చనిపోయాక గురుపత్నిగారి సేవలోను గడుపుతారు. ఇహ ఇంటికి వెళ్ళరు. ఈ విధంగా ఈ పదానికి ప్రాచీనకాలంలో మతపరమైన అర్థం ఉన్నప్పటికీ, ఇప్పుడు అన్ని విశ్వవిద్యాలయాల్లోను దీన్ని కాన్వకేషన్ అనే ఆంగ్లపదానికి సమార్థకంగా వాడుతున్నారు. అలాగే పిజీ కోర్సులను కూడా స్నాతకోత్తర కోర్సులు (స్నాతకం అయిపోయాక చదివే కోర్సులు) అంటున్నారు.

విశ్వవిద్యాలయాలలో

మార్చు

కొన్ని విశ్వవిద్యాలయాలలో, "కాన్వకేషన్" అనే పదం ప్రత్యేకంగా కళాశాల యొక్క పూర్వ విద్యార్థుల సంస్థను సూచిస్తుంది, ఇది విశ్వవిద్యాలయపు ప్రతినిధి సంస్థలలో ఒకటిగా పనిచేస్తుంది. కాన్వకేషన్ ఒక స్టాండింగ్ కమిటీని ఎన్నుకుంటుంది, ఆ కమిటీ పూర్వ విద్యార్థుల అభిప్రాయాలకు సంబంధించి విశ్వవిద్యాలయ పరిపాలనకు ప్రాతినిధ్యం వహించే బాధ్యత వహిస్తుంది. విశ్వవిద్యాలయ పరిపాలనకు సంబంధించి పూర్వ విద్యార్థుల అభిప్రాయాలను సూచించడం, పూర్వ విద్యార్థుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా విరాళాలకు సంబంధించి, విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులను ఎన్నుకోవడం వంటి వాటికి ఇది సహకరిస్తుంది.[1][2][3]

డిగ్రీ విద్యలో

మార్చు

ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలలో (భారతదేశం, కెనడా, ఉక్రెయిన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలతో సహా) కాన్వకేషన్ అనేది విద్యార్థులకు, గౌరవ గ్రాడ్యుయేట్లకు డిగ్రీలను ప్రదానం చేసే విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్ వేడుకగా నిర్వహిస్తున్నారు.[4]

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "University Archives:A history of Congregation and Convocation, 5. The mid 20th century". ox.ac.uk. Archived from the original on 11 జూలై 2011. Retrieved 11 July 2020.
  2. "University Archives". ox.ac.uk. Archived from the original on 11 జూలై 2011. Retrieved 11 July 2020.
  3. "A History of the University in Europe: Volume 3, Universities in the ..." google.co.uk. Retrieved 11 July 2020.
  4. Convocation at Memorial University.