భారత్ లోని సన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎయిర్ లైన్ సేవలందిస్తోన్న భారతీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్. ఇది దేశీయంగా చవక రేటుతో ఎక్కువ మంది ప్రయాణీకులను తీసుకెళ్లే రెండో అతిపెద్ద విమాన సంస్థ.[5] ప్రతిరోజు 49 కేంద్రాల నుంచి 340 కి పైగా విమానాలు నడుపుతోంది. వీటిలో 41 కేంద్రాలు భారత్ లో, 8 విదేశాల్లో ఉన్నాయి. బోయింగ్ 737, బార్డియర్ డాష్-8 క్యూ 400 కొత్తరకం విమానాలను కూడా నడుపుతోంది. ఈ ఏయిర్ లైన్ సేవలు మే 2005[6]లో ప్రారంభమయ్యాయి. దీని రిజిష్టర్డ్ కార్యాలయం తమిళనాడులోని చెన్నైలో, కార్పోరేట్ కార్యాలయం హర్యానాలోని గుర్గావ్ నగరంలో ఉంది.[7]

SpiceJet
దస్త్రం:SpiceJet logo.svg
IATA
SG
ICAO
SEJ
కాల్ సైన్
SPICEJET
స్థాపన2005
మొదలు18 మే 2005; 19 సంవత్సరాల క్రితం (2005-05-18)
Hub
  • Chennai International Airport (Chennai)
  • Indira Gandhi International Airport (Delhi)
  • Rajiv Gandhi International Airport (Hyderabad)[1]
Secondary hubs
  • Chhatrapati Shivaji International Airport (Mumbai)
  • Kempegowda International Airport (Bangalore)
  • Focus cities
    • Cochin International Airport (Kochi)
    • Netaji Subhas Chandra Bose International Airport (Kolkata)
    • Pune International Airport]] (Pune)
    • Sardar Vallabhbhai Patel International Airport (Ahmedabad)
    Frequent flyer programSpiceJet MAX[2]
    Fleet size38
    Destinations49[3]
    కంపెనీ నినాదంWhatever We Do, We Do It With All Our Heart
    ముఖ్య స్థావరంGurgaon, India[4]
    ప్రముఖులు
    Website: spiceJet.com

    చరిత్ర

    మార్చు

    2005-2013:ప్రారంభం-విస్తరణ

    మార్చు
     
    A Boeing 737-200 in a livery similar to that of Lufthansa.
     
    SpiceJet Boeing 737-900ER taking off from Sardar Vallabhbhai Patel International Airport in Ahmedabad

    అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్పైస్ జెట్ బోయింగ్ 737-900 ఇ.ఆర్. మొదటిసారి ఎగిరింది. 2004లో అతి తక్కువ ఖర్చు విధానంలో స్పైస్ జెట్ సేవలు పునః ప్రారంభమయ్యాయి.[8] మార్చి7, 2005లో స్పైస్ జెట్ 3 బోయింగ్ 737-800 విమానాలను అద్దెకు తీసుకుంది. అప్పటి పౌర విమానాయాన మంత్రి ప్రఫుల్ పటేల్ మొదటి విమానానికి జెండా ఊపారు. 2006 మే 24 నాడు మొదటి బోయింగ్ 737-800 విమానం న్యూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.

    2010లో భారతీయ మీడియా అధినేత కళానిధి మారన్ స్పైస్ జెట్ కు చెందిన 37.7% వాటాను కొనుగోలు చేశారు.[9][10] అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో 2012లో స్పైస్ జెట్ దాదాపు 390 మిలియన్ల (US$6.1 మిలియన్లు) నష్టాలను మూటగట్టుకుంది.[11] సంస్థ నష్టాలను పట్టించుకోకుండా 2012లో కళానిధి మారన్ స్పైస్ జెట్ లో మరో 1 బిలియన్ (US$16 మిలియన్లు) పెట్టుబడులు పెట్టి తన వాటాను మరింత పెంచుకున్నారు. ఆ ఏడాది చివరి నాటికి ఈ విమానయాన సంస్థ లాభాల బాట పట్టింది.

    2014- ప్రస్తుతం

    మార్చు

    పోటీని తట్టుకునేందుకు జూలై 2014లో స్పైస్ జెట్ సంస్థ టికెట్ల ధరపై 50 శాతం రాయితీ ప్రకటించింది. డిసెంబరు 2014లో స్పైస్జెట్ పలు దేశీయ విమానాలను రద్దు చేసింది.[12]

    గమ్యాలు

    మార్చు
    ఇయర్ ట్రాఫిక్
    2008 4397
    2009 4819
    2010 6807
    2011 8639
    2012 10322

    ఆధారం: స్పైస్ జెట్ వార్షిక నివేదికలు

    స్పైస్ జెట్ గమ్యాలు

    మార్చు

    స్పైస్ జెట్ తొలి అంతర్జాతీయ విమానాన్ని 2010 అక్టోబరు 7న ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ నుంచి ఖాట్మండ్, చెన్నై నుంచి కొలంబోకు విమానాలను ప్రారంభించింది. ఏప్రిల్ 2011లో కొత్త బాంబార్డియర్ క్యూ 400 విమానాన్ని పంపించేందుకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్థావరంగా ఎంచుకుంది. 2012 జనవరి 12 నాడు స్పైస్ జెట్ సంస్థ కొత్త రకం బోయింగ్ 737-800 విమానాన్ని ప్రవేశపెట్టింది.

    విమానాలు

    మార్చు

    జనవరి 2015 నుంచి స్పైస్ జెట్ ఎయిర్ లైన్ ఈక్రింది విమానాలను నడిపిస్తోంది:

    స్పైస్ జెట్ విమానాలు
    విమానం సేవలో ఆర్డర్స్ ప్రయాణికులు
    (సాధారణ)
    సూచనలు
    బోయింగ్ 737-800 21 189 అన్ని అద్దె ప్రాదికన
    బోయింగ్ 737 మాక్స్8 42
    బోయింగ్ 737-900ఇ.ఆర్. 2 212
    బాంబార్డియర్ డాష్ 8 క్యూ400 15 15 78 1 అద్దె
    మొత్తం 38 7

    ప్రస్తుత విమానాలు

    మార్చు

    స్పైస్ జెట్ ప్రస్తుతం బోయింగ్ 737-800/900 ఇ.ఆర్. రకానికి చెందిన 23 విమానాలను, బాంబార్డియర్ క్యూ 400 రకం 15 విమానాలు నడిపిస్తోంది.

    అవార్డులు-విజయాలు

    మార్చు
    • 2008, 2010, 2011, 2012 సంవత్సరాల్లో అవుట్ లుక్ ట్రావెలర్ చేత... చవక రేట్ల ఎయిర్ లైన్గా గుర్తింపు.
    • 2012లో ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేత...చవక రేట్ల విమాన సంస్థగా గుర్తింపు.
    • 2012లో ట్రావెల్ అండ్ హాస్పిటాలటీ చేత... భారతదేశపు అత్యన్నతమైన ఎయిర్ లైన్ ఎల్.సి.సి. డొమెస్టిక్ అవార్డు.
    • 2010, 2011, 2012లో సింగపూర్ లో జరిగిన “ ప్రపంచ చవకరేట్ల ఎయిర్ లైన్స్ ఆసియా పసిఫిక్ సదస్సు”లో ఉత్తమ ఎల్.సి.సి. వెబ్ సైట్ గా ప్రశంసలు.
    • 2007, 2008, 2009, 2011, 2012లలో వినియోగదారులను సంతృప్తి పరచడం, వ్యాపారాభివృద్ధి విభాగాల్లో భారత్ టాప్-100 సి.ఐ.ఒ అవార్డు.
    • డిసెంబరు 2009లో హిందుస్థాన్ టైమ్స్ ఆధ్వర్యంలోని MARs నిర్వహించిన సర్వేలో భారతదేశపు ఉత్తమ చవక రేట్లు గల ఎయిర్ లైన్ గా గుర్తింపు.
    • 2009లో ప్రపంచ ట్రావెల్ మార్కెట్ అవార్డు.[13]
    • 2009లో జాతీయ అత్యున్నత కాస్ట్ మేనేజ్ మెంట్ అవార్డు (ICWAI).

    బయటి లింకులు

    మార్చు

    మూలాలు

    మార్చు
    1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-10-11. Retrieved 2015-01-28.
    2. "Introducing SpiceJet Max". SpiceJet. Archived from the original on 19 జనవరి 2013. Retrieved 12 January 2013.
    3. "Now, SpiceJet offers Rs 499 fare on domestic network". Times of India. 1 September 2014. Retrieved 5 September 2014.
    4. "SpiceJet Contact Information | SpiceJet Airlines". Spicejet.com. Archived from the original on 23 ఏప్రిల్ 2013. Retrieved 14 September 2010.
    5. "SpiceJet edges past Jet Airways to be second largest passenger carrier for July". Business Standard. 20 August 2014. Retrieved 5 September 2014.
    6. Nair, Vipin V. (4 July 2008) (30 August 2010). "SpiceJet Rises in Mumbai on Report of Kingfisher Deal (Update2)". Bloomberg.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
    7. "Contact Us". SpiceJet. Archived from the original on 23 ఏప్రిల్ 2013. Retrieved 24 January 2013. Corporate Office : SpiceJet Ltd., 319, Udyog Vihar, Phase IV, Gurgaon – 122016 Haryana, India." and "Registered Office: Murasoli Maran Towers, 73, MRC Nagar Main Road, MRC Nagar, Chennai- 600028, Tamil Nadu.
    8. "Company History – SpiceJet". moneycontrol.com. Retrieved 30 December 2011.
    9. "Kalanithi Maran to buy 37% stake in SpiceJet". The Economic Times. 11 June 2010. Archived from the original on 12 ఆగస్టు 2011. Retrieved 30 August 2010.
    10. "Kalanidhi Maran buys 37.7 p.c. stake in SpiceJet". The Hindu. 13 June 2010. Retrieved 8 August 2010.
    11. "Fund infusion critical for SpiceJet". Business Standard. 15 February 2012.
    12. "Airport operators put SpiceJet on cash-and-carry". Economictimes Indiatimes. 9 Dec 2014. Archived from the original on 2015-01-09. Retrieved 2015-01-28.
    13. "Spicejet Airlines". Cleartrip.com.