స్మిత హరికృష్ణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ర్ మాజీ క్రీడాకారిణి. ఆమె 1973 నవంబరు 6 న కర్ణాటక, బెంగళూరులో జన్మించింది.

స్మిత హరికృష్ణ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
స్మిత హరికృష్ణ
పుట్టిన తేదీ (1973-11-06) 1973 నవంబరు 6 (వయసు 50)
బెంగుళూరు,భారతదేశము
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 44)1995 ఫిబ్రవరి 12 - న్యూజిలాండ్ తో
చివరి వన్‌డే2000 డిసెంబరు 20 - న్యూజిలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ ఒకరోజు అంతర్జాతీయ
మహిళా క్రికెట్ -WODI
మ్యాచ్‌లు 22
చేసిన పరుగులు 231
బ్యాటింగు సగటు 17.76
100లు/50లు -/-
అత్యుత్తమ స్కోరు 34
వేసిన బంతులు 528
వికెట్లు 8
బౌలింగు సగటు 29.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/10
క్యాచ్‌లు/స్టంపింగులు 3/–
మూలం: CricketArchive, 2020 మే 9

జీవిత విశేషాలు

మార్చు

స్మిత చిన్ననాటినుండే ఆటలు ఆడుతుండేది. వ్యాయామ క్రీడలు (అథ్లెటిక్స్), టేబుల్ టెన్నిస్ కూడా ఆడుతుండేది. అయితే చాలామంది క్రీడాకారులుండడముతో ఈ ఆటలలో వ్యక్తిగత పోటీలకు చాలా వరకు వేచి ఉండాల్సివచ్చేది. తక్కువ అవకాశాలు ఉండేవి. తమ సందులో గల్లీ క్రికెట్ ఆడుతుండేది. సెలవులలో నిర్వహించే క్రికెట్ శిక్షణా శిబిరాలలో కూడా అమ్మాయిలు లేరు. 1989 లో క్రికెట్ క్రీడాకారిణి శాంతా రంగస్వామి నిర్వహించిన క్రికెట్ క్యాంపులో చేరి శిక్షణ పొందింది. ఆమె మొదటి సంవత్సరంలోనే, కర్ణాటక సబ్-జూనియర్ (U-15) జట్టులో ప్రవేశించింది, అక్కడ కెప్టెన్‌ కూడా. U-19 జట్టుకు కూడా ఆడింది. మొదటి సౌత్ జోన్ టోర్నమెంట్ కేరళలో జరిగింది. శాంతా రంగస్వామి మద్దత్తు వలన చాలా మ్యాచ్‌లు సీనియర్ రాష్ట్ర జట్టులో కూడా ఆడే అవకాశం వచ్చింది. క్రికెట్ క్రీడాకారులు కపిల్ దేవ్, శాంతా రంగస్వామి ఆమెకు స్ఫూర్తి. ప్రమీలా భట్ కూడా ఆమెకు మార్గదర్శకురాలిగా ఉంది. 1997 ప్రపంచ కప్ తరువాత ఎయిర్ ఇండియా జట్టుతో ఇంగ్లాండ్ సిరీస్ ఆడుతున్నప్పుడు అనారోగ్య కారణం వలన క్రికెట్ నుండి విరమించుకుని ఉద్యోగం చేయాలని అనుకుని ఎం.బి.ఏ. చేసింది.[1]

క్రికెట్ విశేషాలు

మార్చు

స్మిత తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ 1995 ఫిబ్రవరి 12న న్యూజిలాండ్ తో ఆడింది. చివరగా కూడా 2000 డిసెంబరులో న్యూజిలాండ్ తో ఆడింది. ఆమె కుడి చేతి బ్యాట్స్మెన్, కుడి చేతి మీడియం, పేస్ బౌలింగ్ చేస్తుంది.[2] ఆమె భారత్ తరఫున 22 ఒక రోజు పోటీలు ఆడి, 231 పరుగులు చేసి 8 వికెట్లు తీసింది.[3] స్మిత తన రాష్ట్రం, దేశం తరపున జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడింది.[4]

  • ఒకరోజు అంతర్జాతీయ మహిళా క్రికెట్: 1994/95-2000/01
  • కర్ణాటక రాష్ట్రం తరపున మొదటి తరగతి క్రికెట్: 1991/92-1992/93
  • ఎయిర్ ఇండియా తరపున మహిళా క్రీడాకారుల జాబితా A: 1993/94-2000/01
  • ఎయిర్ ఇండియా తరపున మహిళల మొదటి తరగతి క్రికెట్: 1994/95-1999/00

2007 జూలైలో, స్మిత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళల జాతీయ జట్టుకు దాని తొలి అంతర్జాతీయ టోర్నమెంట్ - 2007 ఎసిసి ఉమెన్స్ టోర్నమెంట్లో శిక్షణ ఇచ్చారు. కానీ జట్టు తన మూడు మ్యాచ్ లు ఓడిపోయింది.[5]

సూచనలు

మార్చు
  1. "Smitha Harikrishna: Flamboyant All-Rounder who played Women's World Cup in 1997 and 2000". Female Cricket. October 10, 2020. Retrieved 8 August 2023.
  2. "S Harikrishna". CricketArchive. Retrieved 2009-11-02.
  3. "S Harikrishna". Cricinfo. Retrieved 2009-11-02.
  4. "Smitha Harikrishna". Association of Cricket Statisticians and Historians. Retrieved 8 August 2023.
  5. "Natasha to lead UAE women's team". gulfnews.com (in ఇంగ్లీష్). 2007-07-03. Retrieved 2023-08-08.