శాంతా రంగస్వామి
1954, జనవరి 1న మద్రాసు (చెన్నై) లో జన్మించిన శాంతా రంగస్వామి (Shantha Rangaswamy) భారతదేశపు మహిళా క్రికెట్ క్రీడాకారిణి. 1976 నుంచి 1991 మధ్యకాలంలో ఆమె భారత మహిళా క్రికెట్ జట్టు తరఫున 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. 1976-77 లో 8 టెస్టులకు, 1983-84 లో 4 టెస్టులకు ఆమె నాయకత్వం కూడా వహించింది. 1981-82 నుంచి 1986 మధ్యకాలంలో ఆమె 19 వన్డే మ్యాచ్‌లను ఆడింది. అందులో 16 వన్డేలకు నేతృత్వం వహించింది.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | Shantha Rangaswamy | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | Madras, తమిళనాడు, India | 1954 జనవరి 1|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | All Rounder | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు | 1976 అక్టోబరు 31 - వెస్టిండీస్ women తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1991 జనవరి 26 - ఆస్ట్రేలియా women తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే | 1982 జనవరి 10 - ఆస్ట్రేలియా women తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1987 జూలై 27 - ఇంగ్లాండ్ women తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2013 జనవరి 11 |
కుడిచేతితో బ్యాటింగ్ చేసే శాంతా రంగస్వామి టెస్టులలో 32.6 సగటుతో మొత్తం 750 పరుగులు సాధించింది. ఇందులో న్యూజీలాండ్ పై సాధించిన ఒక సెంచరీ కూడా ఉంది.[1]. ఆమె అత్యధిక స్కోరు 108 పరుగులు. బౌలింగ్ లో 16 వికెట్లు కూడా సాధించింది. బౌలింగ్లో ఆమె అత్యున్నత గణాంకము 42 పరుగులకు 4 వికెట్లు. ఇది ఇంగ్లాండు పై సాధించింది.
వన్డే క్రికెట్‌లో 19 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 15.1 సగటుతో 287 పరుగులు సాధించింది. బౌలింగ్‌లో 29.41 సగటుతో 12 వికెట్లు పడగొట్టింది. 1982లో న్యూజీలాండ్లో జరిగిన మహిళా ప్రపంచ కప్ క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆమె ప్రథమస్థానం పొందింది. ఇదే ప్రపంచ కప్ పోటీలలో న్యూజీలాండ్‌పై ఆమె వన్డేలలో ఏకైక అర్థ శతకం సాధించింది. ప్రస్తుతం శాంతా రంగస్వామి క్రికెట్ రచయిత్రిగా పనిచేస్తుంది.
అవార్డులు
మార్చుఆమె యొక్క ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం 1976లో భారత క్రీడారంగంలో అత్యున్నతమైన అర్జున అవార్డును ప్రధానం చేసింది.