స్లీప్‌లెస్ నైట్ (2011 సినిమా)

స్లీప్‌లెస్ నైట్ 2011 లో విడుదలైన ఒక ఫ్రెంచి సినిమా. దీనికి ఫ్రెడిరిక్ జార్డిన్ దర్శకత్వం వహించారు. ఇది టొరాంటొ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడి, విమర్శాకుల ప్రశంసలు సంపాదించింది. దీని ఆధారంగానే చీకటి రాజ్యం (2015) సినిమా నిర్మించబడినది.

స్లీప్‌లెస్ నైట్
Sleepless Night
దర్శకత్వంఫ్రెడిరిక్ జార్డిన్
రచనఫ్రెడిరిక్ జార్డిన్
Nicolas Saada[1]
నిర్మాతLauranne Bourachot
Marco Cherqui[1]
తారాగణంDominique Bettenfeld
Adel Bencherif
Julien Boisselier[1]
ఛాయాగ్రహణంటామ్‌ స్టెర్న్[1]
కూర్పుChristophe Pinel[1]
సంగీతంనికొలాస్ ఎర్రెరా[2]
నిర్మాణ
సంస్థలు
Chic Films
Motion Investment Group
Saga Film[1]
పంపిణీదార్లుTribeca Films
విడుదల తేదీ
2011 నవంబరు 16 (2011-11-16)(France)
సినిమా నిడివి
89 నిమిషాలు[1]
దేశాలుఫ్రాన్స్
బెల్జియం
Luxembourg[1][2]
భాషఫ్రెంచి[2]

కథా సారాంశం మార్చు

పోలీస్ డిపార్టుమెంటు లో డిటెక్టివ్ గా పనిచేసే టోమర్ , అతని సహోద్యోగి లారెంట్ తో కలిసి కొకయిన్ తీసుకెళ్తున్న రాయబారుల మీద దాడి చేసి ఆ డ్రగ్స్ ని దొంగతనం చేసి దాచిపెడతారు. ఆ క్రమంలో అతనికి చిన్న గాయం కూడా అవుతుంది. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టు ఆఫీస్ కి వెళ్తారు. అయితే ఆ డ్రగ్స్ తాలూకు డీలర్ సెర్జి, నైట్ క్లబ్ యజమాని కి అది వీళ్ళ పనే అని తెలిసి, అతని కొడుకు సామీని కిడ్నాప్ చేసి తన నైట్ క్లబ్ లో దాచిపెట్టి, అతనికి ఫోన్ చేసి ఆ డ్రగ్స్ తిరిగి ఇవ్వమని బెదిరిస్తాడు. కాని ఆ డ్రగ్స్ తీసుకెళ్ళటానికి వీల్లేదని సహోద్యోగి గొడవ పడతాడు. వినకపోవడంతో అతనికి తెలియకుండా, ఆ సహోద్యోగి మరో పోలీస్ జూలియెన్ తో డీల్ మాట్లాడుకొని ఆ డ్రగ్స్ చేజిక్కించుకొమ్మంటాడు. ఆ మరో పోలీస్, ఇంకో నిజాయితీ పరురాలైన ఆడ పోలీస్ లిజ్జీ తో ఆ నైట్ క్లబ్ లో ప్రవేశిస్తాడు. కొడుకు కోసం అతను డ్రగ్స్ తీసుకెల్లినప్పటికీ, ఆ నైట్ క్లబ్ లో అవి దాచుంచిన ప్రదేశం నుంచి ఆడ పోలీస్ తో మాయం చేయిస్తాడు మరో పోలీస్. ఆ డ్రగ్స్ అనుకున్న సమయానికి డెలివరీ చేయకపోతే ఆ డ్రగ్ డీలర్ ని చంపేస్తానని కూర్చుంటాడు జోయ్ స్టార్. కొడుకు ఫోన్ ఎత్తట్లేదు, కొడుకు ఎక్కడున్నాడు అంటూ తన గర్భిణి భార్య కటాలినా నుంచి మాటి మాటికి ఫోన్ వస్తుంటే అతనేం చెప్పాడు? చివరికి ఆ డ్రగ్స్ ఏమయ్యాయి? గాయంతో భాధపడుతున్న అతను తన కొడుకుని విడిపించుకు వెళ్ళాడా? లేదా? ఆ రాత్రంతా ఆ నైట్ క్లబ్ లో ఏం జరిగింది? అనేది మిగితా కథ.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "Sleepless Night (2011)". Allmovie. Retrieved October 15, 2012.
  2. 2.0 2.1 2.2 Nelson, Rob (September 30, 2011). "Sleepless Night". Variety. Retrieved October 15, 2012.