చీకటి రాజ్యం
చీకటి రాజ్యం 2015 నవంబరు 10న విడుదలైన ద్విభాషా చిత్రం. ఈ చిత్ర తమిళ పేరు "తూంగా వనం" . ఇది స్లీప్‌లెస్ నైట్ (2011 సినిమా) అనే ఫ్రెంచి సినిమా ఆధారంగా తీయబడింది.
చీకటి రాజ్యం | |
---|---|
![]() | |
దర్శకత్వం | రాజేష్ ఎం. సెల్వా |
నిర్మాత | కమల్ హాసన్ ఎస్ చంద్రహాసన్ గొకులం గోపాలన్ వి.సి. ప్రవీణ్ బైజు గొపాలన్ |
రచన | సుకు (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | కమల్ హాసన్ |
నటులు | |
సంగీతం | ఎం గిబ్రాన్ |
ఛాయాగ్రహణం | సను జాన్ వర్గేస్ |
కూర్పు | షాన్ మహమద్ |
నిర్మాణ సంస్థ | రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్‌నేషనల్ గొకులం మూవీస్ |
విడుదల | నవంబరు 10, 2015[1][2] |
నిడివి | 127 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష |
కథసవరించు
నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోకు చెందిన పోలీస్ అధికారి సికె దివాకర్ (కమల్ హాసన్ ), మరో అధికారి మణి (యోగి సేతు)తో కలిసి భారీ మొత్తంలో మత్తు పదార్థాలు (డ్రగ్స్) పట్టుకుంటారు. అయితే ఇంత భారీ మొత్తంలో మత్తు పదార్ధాలను పట్టుకున్న ఆనందం, ఆ అధికార్లకు ఎక్కువ సేపు ఉండదు. ఈ ఇద్దరు అధికారులలో ఒకరైన దివాకర్ కొడుకును డ్రగ్ డీలర్ విఠల్ రావ్ (ప్రకాష్ రాజ్) కిడ్నాప్ చేస్తాడు. అప్పటికే వేరేవాళ్లకి ఆ మత్తు పదార్థాలు సరఫరా చేస్తానంటూ మాట ఇచ్చిన విఠల్ రావ్ ఆ మొత్తాన్ని పోలీసులు పట్టుకోవటంతో చేసేదేమి లేక దివాకర్ కొడుకు పట్టుకొని, మత్తు పదార్థాలు వెనక్కి ఇచ్చేయాలంటూ ఒత్తిడి చేస్తాడు. దివాకర్ మత్తు పదార్థాలు వెనక్కి ఇచ్చి, తన కొడుకును కాపాడుకోవాలని భావించినా, అప్పటికే అతని మీద నార్కొటిక్స్ బ్యూరో చెందిన మరో ఇద్దరు ఆఫీసర్లు మల్లిక (త్రిష), కిశోర్ ల నిఘా ఉంటుంది. ఇలా మంచి చెడు ఇద్దరితో ఒకేసారి యుద్ధం చేయాల్సి వచ్చిన దివాకర్ తన కొడుకును ఎలా కాపాడుకున్నాడు అన్నదే చీకటిరాజ్యం కథ.
నటవర్గంసవరించు
సాంకేతికవర్గంసవరించు
- దర్శకత్వం : రాజేష్ ఎం సెల్వ
- నిర్మాత : రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్ నేషనల్
- సంగీతం : జిబ్రన్
మూలాలుసవరించు
- ↑ "Thoongavanam Movie Database". tamilcinemainfo.com. Archived from the original on 17 నవంబర్ 2015. Retrieved 2 November 2015. Check date values in:
|archive-date=
(help) - ↑ [1][permanent dead link]