స్వప్న వాసవదత్తం అనేది భాసుడు రచించిన సంస్కృత నాటకం.లో నాయకుడు ఉదయనుడు. నాయిక వాసవదత్త. వాసవదత్తకూ ఉదయనునికీ వివాహమయినా కొన్ని రాజకీయకారణాలవల్ల ఉదయనునికి మరొ రాకుమారితో వివాహం అవసరమవుతుంది. మంత్రి యుగంధరుని ప్రణాళిక మేరకు వాసవదత్త అగ్ని ప్రమాదంలో మరణించినట్టుగ నటించి ఉదయనుని అంత:పురంలోనే ఉదయనునికి కూడా తెలియకుండా అగ్న్యాతంగా ఉంటుంది. ఒకనాడు వాసవదత్త విరహంతో బాధ పడుతున్న ఉదయనుడు ఉద్యానవనంలో నిద్రిస్తూ వాసవదత్త వచ్చినట్టు కలగంటూ ఉంటాడు. ఆ సమయంలో నిజంగానే వాసవదత్త అక్కడికి వస్తుంది. నిదరలో పలవరిస్తున్న ఉదయనుడు వాసవదత్త చెయ్యి పట్టుకుంటాడు.

స్వప్న వాసవదత్తం
కృతికర్త: భాసుడు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం(కళా ప్రక్రియ): నాటకం
ప్రచురణ:
విడుదల:

ఇటువంటి నాటకీయమయిన పరిణామాలతో ఎంతో ఉత్కంఠతో సాగి చివరకు సుఖాంతమవుతుంది. కలలో కనిపించిన వాసవదత్త చివరికి నిజంగానే ప్రత్యక్షం కావడమే కథాంశం కనుక ఈ నాటకానికి స్వప్న వాసవదత్తం అని పేరు వచ్చింది.

పాత్రలుసవరించు

  • ఉదయనుడు - కథానాయకుడు, వత్సదేశానికి రాజు
  • వాసవదత్త - ఉదయనుడి భార్య, కథానాయకి
    • అవంతిక - వాసవదత్త, మరణించినట్టు నటిస్తూ పద్మావతికి ఈ పేరుమీద పరిచారిక అవుతుంది
  • యౌగంధరాయణుడు - ఉదయనుడి మంత్రి
  • ఆరుణి - శత్రురాజు, ఈయన చేతిలో ఒకసారి ఉదయనుడు రాజ్యం కోల్పోతాడు
  • పద్మావతి - మగధ యువరాణి, ఉదయనుడి రెండవ భార్య, పద్మావతి వద్ద అవంతిక పరిచారికగా ఉంటుంది

కథసవరించు

వత్సదేశాన్ని కౌశాంబి రాజధానిగా ఉదయనుడు పరిపాలిస్తూండేవాడు. ఆయనకు ఎంతగానో ప్రేమించే భార్య వాసవదత్త, నమ్మకస్తుడైన మంత్రి యౌగంధరాయణుడు ఉంటారు. వత్సరాజు అంత:పురంలోనే ఎల్లప్పుడూ వాసవదత్తను విడవకుండా రాజ్యనిర్వహణ అలక్ష్యం చేయడంతో శత్రురాజైన ఆరుణి చేతిలో రాజ్యాన్ని కోల్పోతాడు. వాసవదత్త మోహం వల్లనే రాజ్యాన్ని కోల్పోయాడని, తిరిగి రాజ్యం పొందాలంటే వాసవదత్తకు దూరంగా ఉండాలని భావించి యౌగంధరాయణుడు ఓ పథకం పన్నుతాడు. దాని ప్రకారం వాసవదత్త అగ్ని ప్రమాదంలో మరణించినట్టు అందరినీ నమ్మిస్తారు, శక్తిమంతమైన మగధ రాజ్యం యొక్క యువరాణి పద్మావతితో ఉదయనుడు వివాహం చేసుకోవాలి.
అజ్ఞాతంగా వాసవదత్తను అవంతిక అన్న మారుపేరుతో మగధ యువరాణి పద్మావతి పర్యవేక్షణలో ఉంచుతాడు మంత్రి. పద్మావతి, అవంతిక అనే పేరుతో ఉన్న వాసవదత్త సన్నిహితులవుతారు. అవంతిక భర్త విరహంతో దిగులు పడుతూంటుంది. మరోపక్క ఉదయనుడూ వాసవదత్తను మర్చిపోలేకపోతుంటాడు. ఉదయనుని గుణగణాలు విని, మగధ రాజు దర్శకుడు అతనికి పద్మావతినిచ్చి వివాహం చేయడానికి అంగీకరిస్తాడు. ఉదయనుడు ఈ వివాహానికి ఎలానో అంగీకరిస్తాడు, దాంతో వివాహం జరుగుతుంది. ఆ తర్వాత ఉదయనునికి అతని మొదటి భార్య వాసవదత్తపై ప్రేమ తగ్గలేదని పద్మావతికి తెలుస్తుంది. ఆ కలవరం వల్ల ఆమెకు తీవ్రమైన తలనొప్పి వస్తుంది.

కాలంసవరించు

ఈ భాస కవి గుప్తుల కాలంకు సంబందించినవాడు

మూలాలుసవరించు