స్వర్గం నరకం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
అసలీ స్వర్గం నరకం అంటే ఏంటండీ ..??
ప్రతి మనిషికి ఆలోచనలు ఉంటాయి, మనిషి అన్నాక ఆలోచన, ఆశ లేనిదే ఎవరుంటారు చెప్పండి. అలా నా ఆలోచనలలో మెదిలిన question నే ఈ స్వర్గం - నరకం.
స్వర్గం - నరకం వ్యతిరేక పదాలుగా తెలుసు. కానీ ఎలా ఉంటాయి? మన సినిమా డైరెక్ట్ ల పుణ్యవని ఈ స్వర్గ నరకాల concept మనం చాలానే ఉంటాం.. ఇంద్రుడు, అప్సరసలు, వింతలూ ఉంటే స్వర్గమని. యముడు, చిత్రగుప్తుడు, శిక్షలు ఉంటే నరకం అని మనం చాల సినిమాలో చూసాం. మన అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే కథలో విన్నాం. వీటి గురించి ఆలోచన వచినప్పుడు స్వర్గ సుఖాలని ఊహిస్తం, నరకంలోని బాధల్ని తలచుకొని భయపడుతాం. అన్ని మత గ్రంథాలలోను స్వర్గనరక ప్రస్తావన ఉంది. నిజ జీవితంలో లేని ఆనందాలు స్వర్గంలో ఉంటాయని, ఊహకు అందని చిత్ర హింసలు నరకంలో ఉంటాయని, తప్పు చేస్తే నరకంలో శిక్షలు ఉంటాయి, పుణ్యం చేస్తే స్వర్గానికిలో సర్వసుఖాలు ఉంటాయని విన్నాం కదా. ఇవ్వన్ని నిజమేనా? ఒకవేళ ఊహ అయితే మరి మన పూరణలో ఉండే ఇంద్రుడు వజ్రాయుధం, కల్పవృక్షం, ఐరావతం, యముడు శిక్షలు ఇవ్వని అబద్దాలా?
అన్ని సుఖాలు వదులుకొని ఘోర తప్పసు చేసిన ఋషులు స్వర్గానికి వెళ్లి అక్కడ సకల సుఖాలని అనుభవించి ముక్తి పొందుతారని అంటారు. అసలు జీవన మాధుర్యం గురించి అణువంత కూడా అవగాహనా లేని సన్యాసులు స్వర్గసుఖాలు రుచి ఎట్లా తెలుసుకుంటారో నాకు అంతుపట్టడం లేదు. ఇక నరకం విషయానికి వస్తే నిప్పులో కాల్చడం, పెనంలో వేయించడం లాంటివి చేస్తారు కదా! మనిషి చనిపోయకనే కదా నరకానికి వెళ్ళడం జరుగుతుంది, శరీరం ఇక్కడే నశించిపోయినపుడు ఇక ఆత్మకి ఎం శిక్షలు వేస్తారు? ఇన్ని ఆలోచనాలు వస్తుంటే తెలుస్తుంది కదా! సుఖదుఖ:లను వేరు చేయడం వల్ల మంచి చెడులను సరిహద్దులుగా గియ్యడం వల్ల వచ్చిన వ్యవహారమిదంతా ..
ఒక శిష్యుడు తన గురువుగారిని ప్రతి రోజు స్వర్గమంటే ఏంటి? నరకం అంటే ఏంటి? అని వేధించేవాడు. ఆ శిష్యుడు స్వచ్ఛమైన మనస్సు కలిగినవాడు.అతన్ని సందేహాన్ని తీర్చడానికి గురువు ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. పుస్తకాల్లో చదివిన విషయాలను వివరించాడు కానీ వాటితో ఆ శిష్యుడు తృప్తి పడలేదు. గురువు మంచి చెడుల గురించి చెప్పి పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్తారని, పాపాత్ములు నరకానికి వెళ్తారని అన్నాడు. శిష్యుడు అయితే నాకు స్వర్గం నరకం ఎలా ఉంటుందో చూపించమని వెంటబడుతాడు అవి మన అనంతరం కలిగ్గే అనుభవాలు అని గురువు చెప్పిన, మీ శక్తీ సామర్ధ్యాలతో వాటిని నాకు అనుభవానికి వచ్చేల చేయవచ్చు కదా! అన్నాడు. ఇక లాభం లేదని గురువు ఒక చీకటి గదిని చూపించి నువ్వు అందులోకి వెళ్ళు, నేను తలుపులు మూస్తాను. బయట నుండి నేను ఎలా చెబితే అలా చేయి అన్నాడు. తనకు స్వర్గ్గా నరకాల గురించి తెలియబోతుంది కదా అని శిష్యుడు ఉచ్చాహంగా ఆ చీకటి గదిలోకి వెళ్ళాడు, గురువు తలుపులు మూసాడు. సిష్యుడున్ని కళ్ళు ముసుకోమన్నాడు, పది నిముషాలు తరువాత ఇప్పుడు నువ్వు నరకంలోకి వెళ్తునావ్ అరగంట పాటుగా నరకం అంతా తిరుగు అన్ని చూడు తరువాత ఎం చెయ్యాలో చెబుతాను అన్నాడు. అరగంట గడిచింది అప్పుడు గురువు ఇప్పుడు నువ్వు స్వర్గంలోకి వెళ్ళు అక్కడ అరగంట పాటు నీకిష్టం వచ్చిన ప్రదేశాలు విహరించు తిరిగి వచ్చాక ఆ తరువాత విషయం చెబుతాను అన్నాడు. ఆ శిష్యుడు గురువు చెప్పినట్లే చేసాడు. అరగంట గడిచింది గురువు తలుపులు తీసి శిష్యుడ్ని బయటకు రమ్మనాడు. "నువ్వు మొదట నరకంలోకి వెళ్ళవు కదా అక్కడ ఏం చూసావ్? అని అడిగాడు". శిష్యుడు "మీరు నరకం లో మంటలు వగైరా ఉంటాయి అని అన్నారు కదా. అక్కడ నాకు అవేమి కనిపించలేదు అన్నాడు". మరి స్వర్గం సంగతి ఏంటి? " స్వర్గంలో కూడా అంటే మీరు చెప్పిన కామధేనువు, కల్పవృక్షం ఏవి అక్కడ నాకు కనిపించలేదు" అని అన్నాడు. గురువు "దీన్ని బట్టి స్వర్గ నరకాలంటే ఏమిటో నీకు తెలిసింది కదా.. నువ్వు నరకం ఏమి చూడలనుకుటున్నావో ఆ చిత్ర హింసల్ని నీ మనసులో మోసుకేలితే అవి నీకు అక్కడ కనిపిస్తాయి, నీకు స్వర్గం లో ఏమి కావాలో అవి నువ్వు మోసుకేలితే అవి అక్కడ కనిపిస్తాయి. కాని నీ దగ్గర అవేవి లేవు. నువ్వు అద్దం లాంటి స్వచ్చమైన లాంటి వాడివి. తెల్లకాగితంలా ఏ కల్మషం లేని వాడివి అందుకే నీకు ఏమి కనిపించలేదు. స్వర్గనరకాలు మనసు సృష్టించేవి. మనం సృష్టించిన వాటిని ఎక్కడికి వెళ్ళిన మోసుకొని వెళ్తాం. అవి మనతో బాటుగానే ఉంటాయి." అని శిష్యుడికి అర్ధం అయ్యేలా చెప్తాడు. ఇప్పుడు మీకు అర్ధం అయింది కదా అన్నిటికి మన మనసే కారణం.
తొండంలో ముల్లు గుచ్చుకుంటే ఎంతటి బలిష్టమైన ఏనుగు నైనా గజ గజలాడించ గలదు. మన మనసుకు తగిలే ముల్లు కుడా మనిషిని తికమక పెడుతుంది. అందరు ఏదో ఒక దిశలో ఇటువంటి అనుభూతిని చవి చూసి ఉంటారు. జీవితం పూల బాట మాత్రమే కాదుగా, పూలతో కూడిన ముల్లు కుడా ఉంటాయి.దుఖంలో ఉండటం అంటే నరకం, సుఖం ఆస్వాదించడం అంటే స్వర్గం. మనకున్న స్వభావం చేత దుఖాన్ని అధిగమించి బయటకు రావడం కష్టం. కాని దుఖంలో మునిగి ఉండటం కన్నా, ఆ స్థితిలో ఉన్నామని గుర్తించి బయటకు రావాలని నిర్ణయించుకొని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు కష్టం కలిగించినా వాటిని అధిగమించి బయటకు వస్తే సుఖాన్ని ఉంటుంది.. బాధ, నిరుస్త్సాహం, ఆవేదన, ఇవన్ని దుఖానికి దారి తీస్తుంది. బాధల్ని దిగమింగి, నిరుస్త్సాహన్ని తరిమేసి, ఆవేదనలను లెక్క చేయకుంటే సుఖాన్ని పొందవచ్చు అని నా అభిప్రాయం. కోరికలు నెరవేరక పోతే వాటిని నెరవేర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు దుఖాన్ని మిగిల్చినా, చేసే ఆ ప్రయత్నాలను ఆస్వాదిస్తూ ముందుకు పోతే కోరికలు నేరవేరడమే కాకుండా, ఆ కోరికలు కోసం మనం చేసే ప్రయత్నాలు కూడా సుఖాని ఇస్తాయి. ఈ "సుఖ దుఖ:"లా సారంశమే "స్వర్గ నరకాలు". అన్నిటికి మన మనసే కారణం. అలాంటి మనసుని మన అదుపులో పెట్టుకొని సమాజానికి ఉపయోగ పడేలా మంచిని పెంచుకోగలిగి అందరితో మంచిగా మెలిగి మనం మంచిగా ఉండగలిగితే అదే "స్వర్గం".