స్వాతంత్ర్యోద్యమంలో ఖిలాషాహపురం

తెలంగాణా విమోచనోద్యమం, నైజాం వ్యతిరేక పోరాటం, తెలంగాణా సాయుధ పోరాటం ఇలా పేరేదైనా 1945నుంచి మొదలై భారత యూనియన్లో నైజాం విలీనం వరకూ, కొందరు ఆపైన కొద్ది సంవత్సరాల వరకూ, సాగిన పోరాటం ప్రపంచాన్నే అబ్బురపరిచింది. నిజాం నిరంకుశ పాలన, రెవెన్యూ వ్యవహారాల్లో పటేల్-పట్వారీల అన్యాయాలు, దొరల దారుణకృత్యాలకు ఖాసీం రజ్వీ ఆధ్వర్యంలోని ప్రైవేటు సైన్యం అకృత్యాలు వెరసి ఓ మహా సంగ్రామానికి నేపథ్యంగా నిలిచాయి. ఈ క్రమంలో గ్రామాలకు గ్రామాలే విముక్తి పొందాయి. ప్రాణాలు, మానాలకు భంగం వాటిల్లింది, ప్రజల్లో కొందరు భయపడి చుట్టుపక్కల యూనియన్ ప్రాంతాలకు తరలిపోగా మరికొందరు వీరోచితంగా పోరాడారు. ఈ క్రమంలో ఖిలాషాహపురం అనే గ్రామస్థులు చేసిన పోరాటాన్ని, తన అనుభవాలతో కలిపి పెర్మాండ్ల యాదగిరి ఈ గ్రంథం రచించారు.

ఖిలాషాహపురం కోట - సర్వాయి పాపన్న తన పరిపాలనను కొనసాగించిన ప్రాంతం

మూలాలు మార్చు