స్వాతీ సోమనాధ్

(స్వాతీ సోమనాధ్‌ నుండి దారిమార్పు చెందింది)

స్వాతీ సోమనాధ్‌ శ్రీకాకుళం జిల్లాకు చెందిన నృత్యకళాకారిణి.

స్వాతి సోమనాధ్‌
స్వాతి సోమనాధ్‌
జననంస్వాతి సోమనాధ్‌
ఇతర పేర్లుస్వాతి సోమనాధ్‌

జీవిత విశేషాలు మార్చు

ఈమె శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం దూసి గ్రామంలో జన్మించారు. ఈమె అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ప్రముఖ నృత్య కళాకారిణి .తెలుగు సాంప్రదాయ నృత్యం 'కూచిపూడి'ని ఎన్నో సంగీత రూపకాలలో సుమారు 46 దేశాలలో ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా చిక్కోలు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఏకైక మహిళ ఆమె. ఇంటాక్‌ సంస్థ ఇచ్చే 'ఉత్తమ కళాకారిణి' అవార్డు తీసుకునేందుకు శ్రీకాకుళం వచ్చారు .

ఈమె "ఈ కాలంలో శాస్త్రీయ నృత్యానికి భవిష్యత్తు లేదని, శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం ద్వారా సమయం వృధా అనే భావనలో ఎక్కువమంది తల్లిదండ్రులో ఉందనీ, మంచి నృత్యకళాకారిణిగా కంటే ఇంజనీర్‌గానో, వైద్యుని గానో తమ పిల్లలు స్థిరపడాలనే తల్లిదండ్రులు కోరుకుంటున్నారనీ, వ్యాపారధోరణి కూడా బాగా పెరిగిపోయిందనీ,నేర్చుకోవడం మొదలుపెట్టిన రెండు మూడేళ్లకే లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చేసి ప్రముఖ కళాకారిణులు అయిపోవాలనే తపన ఎక్కువైందనీ" తెలిపారు.

కూచిపూడి నృత్యం అభివృద్ధికి, విస్తరణకు తాను ఇప్పటివరకు ఆరువేల మందికి పైగా విద్యార్థులను తీర్చిదిద్దగలిగారు. చివరికి పరిస్థితులు చూసి హైదరాబాద్‌లో నృత్యం నేర్పడం వృధా అనుకునే స్థాయికి చేరుకున్నారు. ఒక కూచిపూడి నృత్య కళాకారిణిగా ఆమె తరమే చివరిది అనే అనుకుంటున్నారు. దూసి గ్రామంలో ఇప్పటికే రెండు ఎకరాల స్థలం కొనుగోలు చేయడం జరిగింది. త్వరలో కేంద్రం నెలకొల్పి జిల్లావాసులకు శిక్షణ ఇద్దామనుకున్తున్నారు.

సెన్సార్‌బోర్డు అధికారాలు నామమాత్రం అయిపోవడం వలన అనుకున్న స్థాయిలో సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్న ఆమె చెడు సినిమాలను ఎంతవరకు నియంత్రించలేక పోతున్నారు. బోర్డు చేసిన కటింగ్‌లు మళ్లీ సినిమాల్లో ప్రత్యక్షమవుతున్నా ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో కొనసాగుతున్నారని ఆమె తెలిపారు. సభ్యులందరూ కచ్చితంగా పనిచేస్తే సినిమాలలో పేర్లు తప్ప దృశ్యాలు మిగలవని ఆమె తెలిపారు.


మూలాలు మార్చు