స్వామినారాయణ అక్షరధామం (ఉత్తర అమెరికా)
స్వామినారాయణం అక్షరధామం, న్యూజెర్సీ రాబిన్స్‌విల్లేలోని హిందూ దేవాలయం. 2014 ఆగస్టు 10న ప్రారంభించబడింది.[1][2][3][4] ఈ దేవాలయ సముదాయంలో అక్షరధామ్ మహామందిరం, సందర్శకుల కేంద్రం ఉన్నాయి.[5][6]
స్వామినారాయణ అక్షరధామం (ఉత్తర అమెరికా) | |
---|---|
స్థానం | |
దేశం: | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం: | న్యూజెర్సీ |
ప్రదేశం: | రాబిన్స్‌విల్లే |
నిర్మాణశైలి, సంస్కృతి | |
నిర్మాణ శైలి: | వాస్తు శాస్త్రం, పంచరాత్ర శాస్త్రం |
శాసనాలు: | ఆధ్యాత్మిక-సాంస్కృతిక సముదాయం |
చరిత్ర | |
నిర్మాత: | ప్రముఖ స్వామి మహారాజ్ & మహంత్ స్వామి మహారాజ్ |
ప్రారంభం
మార్చుసెంట్రల్ న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలోని స్వామినారాయణ దేవాలయం ప్రముఖ్ స్వామి మహారాజ్ చేత ప్రతిష్టించబడి, స్వామినారాయణ సంస్థచే నిర్మించబడింది. చేతితో చెక్కబడిన ఇటాలియన్ కర్రారా పాలరాయి, రాయి, సున్నపురాయితో చతుర్వేదాలలో వివరించిన మార్గదర్శకాల ప్రకారం ఈ దేవాలయం నిర్మించబడింది. పూజలు, ఇతర భక్తి కార్యక్రమాల కోసం ప్రతిరోజూ ఇది తెరిచి ఉంటుంది. దేవాలయంతోపాటు, ఈ ప్రాంగణంలో సమావేశ మందిరం కూడా ఉంది.[6]
ప్రముఖ్ స్వామి మహారాజ్, ఇతర స్వామీల సమక్షంలో దేవతామూర్తులు ప్రతిష్ఠించబడిన తర్వాత, 2014 ఆగస్టు 10న అధికారికంగా ప్రజలకోసం ఈ దేవాలయం తెరవబడింది.[7] ప్రారంభ వేడుకలకు న్యూజెర్సీ సెనేటర్ కోరీ బుకర్, మేరీల్యాండ్ ప్రతినిధి స్టెనీ హోయర్, పెన్సిల్వేనియా ప్రతినిధి మైక్ ఫిట్జ్‌పాట్రిక్, న్యూజెర్సీ ప్రతినిధి ఫ్రాంక్ పల్లోన్, న్యూజెర్సీ అటార్నీ జనరల్ జాన్ జే హాఫ్‌మన్, భారత కాన్సుల్ జనరల్ జ్ఞానేశ్వర్ ములే తదితరులు హాజరయ్యారు.[7] మూడు రోజుల వేడుకలో భాగంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రపంచ శాంతి కోసం ఒక గొప్ప యజ్ఞం, సర్వమత సామరస్యంపై దృష్టి సారించే మహిళల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.[8] 20,000 మంది సందర్శకులు పాల్గొన్నారు.[9]
నిర్మాణం
మార్చు1997లో ప్రముఖ్ స్వామి మహారాజ్ తొలిసారిగా ఈ దేవాలయ నిర్మాణాన్ని ప్రతిపాదించాడు. [10] 2010లో నిర్మాణం ప్రారంభమైంది. 68,000 క్యూబిక్ అడుగుల ఇటాలియన్ కర్రారా పాలరాయిని ఉపయోగించి నాగరడి శైలిలో దీనిని నిర్మించారు. ఐరోపాలోని క్వారీల నుండి భారతదేశంలోని రాజస్థాన్‌కు పాలరాయి రవాణా చేయబడి, అక్కడ వందలాదిమంది కళాకారుల చేతితో నగీషీలుగా చెక్కబడ్డాయి. పూర్తయిన నగీషీలు రాబిన్స్‌విల్లేకు రవాణా చేయబడ్డాయి. దేవాలయ నిర్మాణం సులభంగా చేయడానికి అన్ని నగీషీలకు నంబర్లు వేశారు.[10]
షికార్బద్ధ మందిరంగా భావించబడుతున్న ఈ దేవాలయం, శిల్ప శాస్త్రాలలో నిర్దేశించబడిన సూత్రాల ప్రకారం నిర్మించబడింది.[11] దేవాలయం లోపల, దేవతామూర్తులు ప్రతిష్టించబడ్డాయి. మధ్యనున్న దానిలో స్వామినారాయణ, గుణతీతానంద స్వామి విగ్రహాలు ఉన్నాయి.[12]
దేవాలయం ముందుభాగంలో 87 అడుగుల వెడల్పు, 133 అడుగుల పొడవు, 42 అడుగుల ఎత్తుతో మండపం నిర్మించబడింది.[9] మయూరి ద్వారం అని పిలువబడే మండపానికి ప్రవేశ ద్వారం, నెమళ్ళు, ఏనుగులు, గత యుగాల హిందూ భక్తులను వర్ణించే శిల్పాలు ఉన్నాయి.
కళాకారులు, స్వచ్ఛంద సేవకులు 4.7 మిలియన్ల గంటలపాటు కృషిచేసి దీనిని నిర్మించారు.[10] వాలంటీర్లు నిర్మాణ ప్రక్రియలో డిజైన్ & ఇంజనీరింగ్, కార్వింగ్ కోఆర్డినేషన్ & స్టోన్ షిప్పింగ్, సైట్ ప్రిపరేషన్, లైటింగ్ & ఎలక్ట్రికల్ వైరింగ్, పాలిషింగ్, పాలరాయిని శుభ్రపరచడం, టెంట్-బిల్డింగ్, భోజనం తయారీ, వైద్య సేవలను అందించడం వంటి వివిధ పనులలో నిమగ్నమై ఉన్నారు.[9]
చిత్రమాలిక
మార్చు-
దేవాలయ వెలుపలి భాగం
-
దేవాలయ వెలుపలి భాగం
-
దేవాలయ లోపలిభాగం
-
దేవాలయ నగీషీలు
-
దేవాలయ చెక్కిన గ్రిల్
-
దేవాలయ నగీషీలు
-
దేవాలయ నగీషీలు
-
దేవాలయ నగీషీలు
-
దేవాలయ వెలుపలి భాగం
-
దేవాలయ నగీషీలు - స్వామినారాయణ
-
దేవాలయ నగీషీలు
-
దేవాలయ నగీషీలు
-
దేవాలయ నగీషీలు
-
దేవాలయ లోపలి గోపురం
-
దేవాలయ లోపలి గోపురం
-
దేవాలయ లోపలి గోపురం
-
దేవాలయ ఇంటీరియర్
-
భగవాన్ స్వామినారాయణ్, గుణతీతానంద స్వామి
-
ప్రముఖ్ స్వామి మహారాజ్
మూలాలు
మార్చు- ↑ Frances Kai-Hwa Wang. "World's Largest Hindu Temple Being Built in New Jersey". NBC News. Retrieved 21 January 2022.
- ↑ "New Jersey Welcomes BAPS Hindu Temple - One Of The Only Traditional Stone Mandirs In North America". HuffingtonPost. 23 August 2014. Retrieved 21 January 2022.
- ↑ "Stunning Hindu temple in New Jersey is one of the largest in America". Daily News. Retrieved 21 January 2022.
- ↑ "Thousands celebrate dedication of traditional Hindu temple in Robbinsville". NJ. Retrieved 21 January 2022.
- ↑ "BAPS Shri Swaminarayan Mandir - Robbinsville - Mandir Information". BAPS Swaminarayan Sanstha. Retrieved 21 January 2022.
- ↑ 6.0 6.1 Mangalnidhidas, Sadhu (2019). Sacred architecture and experience: BAPS Shri Swaminarayan Mandir, Robbinsville, New Jersey. Swaminarayan Aksharpith. ISBN 978-19-4746-101-7.
- ↑ 7.0 7.1 Blumberg, Antonia; Post, The Huffington (2014-08-23). "A Look At The New, Massive Hindu Temple Gracing New Jersey". The Huffington Post. Retrieved 21 January 2022.
- ↑ "Mandir Mahotsav 2014, BAPS Shri Swaminarayan Mandir". BAPS (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 21 January 2022.
- ↑ 9.0 9.1 9.2 Academy, Himalayan (January 2015). "Temples: Fully Enclosed Ornate Marble Temple Opens in New Jersey - Magazine Web Edition > January/February/March 2015 - Publications - Hinduism Today Magazine". www.hinduismtoday.com. Retrieved 21 January 2022.
- ↑ 10.0 10.1 10.2 Project, Sadguru Pujya Ishwarcharan Swami Head of Akshardham. "Making of historic BAPS Robbinsville Mandir - Person of year". www.thesouthasiantimes.info. Archived from the original on 16 జూలై 2018. Retrieved 21 January 2022. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Das, Mukundcharan (2005). Hindu Rites and Rituals. Aksharpith. p. 7. ISBN 81-7526-356-3.
- ↑ Kim, Hanna (2001). "Being Swaminarayan: The Ontology and Significance of Belief in the Construction of a Gujarati Diaspora". Columbia University Press. 347–349.
బయటి లింకులు
మార్చు- స్వామినారాయణ సంస్థ – అక్షరధామం ఏర్పాటకు బాధ్యత వహించే సంస్థ