స్వామినారాయణ దేవాలయం (హ్యూస్టన్)

టెక్సాస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో స్వామినారాయణ్ సంస్థచే నిర్మించబడిన సాంప్రదాయ హిందూ

స్వామినారాయణ దేవాలయం, టెక్సాస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో స్వామినారాయణ్ సంస్థచే నిర్మించబడిన సాంప్రదాయ హిందూ దేవాలయం.[1] మహంత్ స్వామి మహారాజ్ నేతృత్వంలోని స్వామినారాయణ్ సంస్థ, హిందూమతంలోని స్వామినారాయణ సంస్థకు చెందినది. ఇది 11,500 చదరపు అడుగుల (1,070 చదరపు మీటర్లు), 73-అడుగు (22 మీ.) ఎత్తైన దేవాలయం. చుట్టుపక్కల డెక్ 25,620 చ.అ. (2,380 చ.మీ.) ఉంది. 2004 జూలైలో దేవాలయాన్ని నిర్మించడానికి $7 మిలియన్లు ఖర్చు చేశారు. భారతదేశంలోని 3,000 మంది కళాకారులు ఇటాలియన్ పాలరాయి, టర్కిష్ సున్నపురాయితో దేవాలయానికి కావలసిన నగిషీలను చెక్కారు. నగిషీల ముక్కలు హ్యూస్టన్‌కు రవాణా చేయబడ్డాయి, 2002 మార్చిలో దేవాలయ నిర్మాణం ప్రారంభమైంది. కొంతమంది భారతీయలతోపాటు మొత్తం 175 మంది వాలంటీర్లు దేవాలయాన్ని నిర్మించడంలో సహాయం చేశారు.[2] 33,000 పాలరాయి, సున్నపురాయి నగిషీలతో 28 నెలల్లో దేవాలయం నిర్మాణం పూర్తయింది.

స్వామినారాయణ దేవాలయం (హ్యూస్టన్)
స్వామినారాయణ దేవాలయం
భౌగోళికం
దేశంయునైటెడ్ స్టేట్స్
రాష్ట్రంటెక్సాస్‌
ప్రదేశంఫోర్ట్ బెండ్ కౌంటీ
సంస్కృతి
దైవంస్వామి నారాయణ
రాధాకృష్ణ
సీత-రాముడు
శివుడు-పార్వతి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుశిల్పశాస్త్రం
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ2004 జూలై
సృష్టికర్తప్రముఖ్ స్వామి మహారాజ్
వెబ్‌సైట్houston.baps.org

ఈ దేవాలయం, పురాతన హిందూ గ్రంథాల ప్రకారం నిర్మించబడింది. 22 ఎకరాలలో దేవాలయ ప్రాంగణం విస్తరించి ఉంది. ఇక్కడ దేవాలయలంతోపాటు, హవేలీ, అండర్ స్టాండింగ్ హిందూయిజం ఎగ్జిబిషన్ ఉన్నాయి.[3] ఇక్కడ వారానికోసారి సభలు జరుగుతాయి. ప్రతిరోజూ ఆరాధనలు, సందర్శకుల కోసం ఈ దేవాలయం తెరిచే ఉంటుంది.

సంఘం ఏర్పాటు

మార్చు

1977 సంవత్సరంలో, ప్రముఖ్ స్వామి మహారాజ్ హ్యూస్టన్‌ను తొలిసారిగా సందర్శించిన తర్వాత, అక్కడివారు ఆధ్యాత్మిక సమావేశాలను నిర్వహించడానికి వారివారి ఇళ్ళలో కలుసుకునేవారు.[4] 1980 జూలైలో ప్రముఖ్ స్వామి సందర్శన సమయంలో అలీఫ్ హేస్టింగ్స్ ఉన్నత పాఠశాలలో 350 మంది భక్తులు సమావేశమయ్యారు.[5]

1985 నాటికి, సంఘం సభ్యులు పెరగడంతో కొత్త మందిరం కోసం ఫోర్ట్ బెండ్ కౌంటీలోని స్టాఫోర్డ్‌లో ఒక స్థలాన్ని ఎంపిక చేశారు. 1986లో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఐదు ఎకరాల స్థలంలో దేవాలయం నిర్మించారు, ఇందులో 8,000 చదరపు అడుగుల సెమినార్ హాల్ కూడా ఉంది.[5] 1988లో దేవాలయం ప్రారంభించబడింది.

1990వ దశకం చివరిలో, ప్రస్తుత మందిరం పక్కన కొత్త షికార్‌బద్ధ మందిరానికి ప్రణాళికలు వేశారు. 2000 సెప్టెంబరు నెలలో ప్రముఖ్ స్వామి దేవాలయానికి శంకుస్థాపన చేశాడు.[5]

నిర్మాణం, ప్రారంభోత్సవం

మార్చు

2002లో శంకుస్థాపన వేడుకతో దేవాలయ నిర్మాణం ప్రారంభమైంది. 2004, జూలై 25న ప్రముఖ్ స్వామి సన్నిధిలో అధికారికంగా ప్రారంభించబడింది.[2] భారతదేశంలో 2,400 మంది కళాకారులు చేతితో చెక్కిన 33,000 పాలరాయి, సున్నపురాయితో నగిషీలతో ఈ దేవాలయాన్ని నిర్మించారు.[4] 150 కంటైనర్లలో 33,000 పాలరాయి, సున్నపురాయితో నగిషీలు హ్యూస్టన్‌కు రవాణా చేయబడ్డాయి. ఆ ముక్కలను త్రీ-డైమెన్షనల్ జిగ్సా పజిల్ లాగా పద్ధతిలో అమర్చారు. 4-అడుగుల పునాదితో సహా దేవాలయ మొత్తం నిర్మాణంలో ఒక్క ఇనుప లేదా ఉక్కు ముక్క కూడా ఉపయోగించకుండా దీనిని నిర్మించారు.[6]

73 అడుగుల ఎత్తు, 125 అడుగుల పొడవు, 95 అడుగుల వెడల్పుతో ఈ దేవాలయం నిర్మించబడింది.[6] 11,500 చదరపు అడుగుల బేస్ చుట్టూ 25,620 చదరపు అడుగుల డెక్ కూడా నిర్మించబడింది. [4] స్తంభాలు, గోడలపై దేవతలు, నృత్యకారులు, సంగీతకారులు, ఏనుగులు, గుర్రాలు, పువ్వులు, రేఖాగణిత నమూనాలు కూడా చెక్కబడ్డాయి.[3]

2004 జూలై 20న ప్రముఖ్ స్వామి ఎనిమిదోసారి హ్యూస్టన్‌కు వచ్చాడు.[5] జులై 21న, దేవాలయం పైభాగంలో అమర్చే గోపురాలు, జెండాలకు పూజలు నిర్వహించాడు. ఇత్తడి, బంగారు ఆకులతో కూడిన గోపురాలు అమృతాన్ని సూచిస్తాయి, జెండాలు విజయం ప్రతీకగా నిలుస్తియ. జూలై 24న, హ్యూస్టన్ వీధుల గుండా ఏడు మైళ్ల మార్గంలో 1.3 మైళ్ల పొడవుతో అందరు మూర్తిల శోభా యాత్ర (రంగుల ఊరేగింపు) జరిగింది.[5]

2004, జూలై 25న దేవాలయం అధికారికంగా ప్రారంభించబడింది.

రెస్టారెంట్

మార్చు

ఈ దేవాలయంలో గుజరాతీ రెస్టారెంట్ షాయోనా కేఫ్ ఉంది.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "Home". BAPS Shri Swaminarayan Mandir, Houston, TX, USA. Retrieved 2019-11-07. BAPS Shri Swaminarayan Mandir 1150 Brand Lane Stafford, TX 77477 USA - Despite the "Stafford, TX" city name, it is outside of the Stafford city limits
  2. 2.0 2.1 Dooley, Tara. "New Hindu temple is dedicated in Stafford." Houston Chronicle. July 26, 2004. Retrieved on May 3, 2014.
  3. 3.0 3.1 "Houston Welcomes Lord Swaminaryan". Hinduism Today. 1 March 2005. Archived from the original on 12 November 2019. Retrieved 10 October 2013.
  4. 4.0 4.1 4.2 Martin, William (26 February 2006). "Shri Swaminarayan Mandir". TexasMonthly. Retrieved 5 October 2013.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 BAPS (2007). Samipya – A Step Closer To Divinity. BAPS. pp. blank.
  6. 6.0 6.1 Williams, Jack (9 April 2007). "Hindu Temple in Stafford is Hidden Treasure". kuhf.fm. Archived from the original on 24 మే 2014. Retrieved 10 October 2013.
  7. "BAPS Shri Swaminarayan Mandir - Houston - Media Galleries". BAPS. Retrieved 2022-02-01.
  8. "BAPS Shri Swaminarayan Mandir - Houston - Media Galleries". BAPS. Retrieved 2022-02-01.
  9. "BAPS Shri Swaminarayan Mandir - Houston - Media Galleries". BAPS. Retrieved 2022-02-01.
  10. "BAPS Shri Swaminarayan Mandir - Houston - Media Galleries". BAPS. Retrieved 2022-02-01.
  11. "BAPS Shri Swaminarayan Mandir - Houston - Media Galleries". BAPS. Retrieved 2022-02-01.
  12. "BAPS Shri Swaminarayan Mandir - Houston - Media Galleries". BAPS. Retrieved 2022-02-01.
  13. "BAPS Shri Swaminarayan Mandir - Houston - Media Galleries". BAPS. Retrieved 2022-02-01.
  14. "BAPS Shri Swaminarayan Mandir - Houston - Media Galleries". BAPS. Retrieved 2022-02-01.
  15. "BAPS Shri Swaminarayan Mandir - Houston - Media Galleries". BAPS. Retrieved 2022-02-01.
  16. "BAPS Shri Swaminarayan Mandir - Houston - Media Galleries". BAPS. Retrieved 2022-02-01.
  17. "BAPS Shri Swaminarayan Mandir - Houston - Media Galleries". BAPS. Retrieved 2022-02-01.
  18. "BAPS Shri Swaminarayan Mandir - Houston - Media Galleries". BAPS. Retrieved 2022-02-01.