స్వామి రంగనాథానంద

అసలు పేరు శంకరన్ కుట్టి. కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ గ్రామంలో 15 డిసెంబర్ 1908న జన్మించారు. 18 ఏళ్ళ వయసులోనే శంకరన్ రామకృష్ణ సంఘంలో చేరా రు. మొదటి మజిలీ మైసూరు. ఇక్కడ ఆయన అన్ని పనులూ చేసేవారు. పాత్రలు తోమటం, వంట చేయటం, బట్టలు ఉతకటం లాంటి పనులు చేసేవారు.లాంఛన ప్రాయమైన విద్య ఆయనకి 5,6 తరగతులతోనే ఆగిపోయింది. కానీ చదువులలో సారం అంతా కాచి వడపోసారు: ఉపనిషత్తు లు, గీత, ఇతిహాసాలు, భారతీయ సాంస్కృతిక చరిత్ర, సంస్కృత అధ్యయనం- ఇవే కాక శ్రీ రామకృష్ణ -వివేకానం దుల సాహిత్యాన్ని కూలంకషంగా అధ్యయనం చేశారు. ఈ దశలో శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులైన శ్రీ శివానందస్వామిజీ శంకరన్‌కి సన్యాస దీక్ష ఇచ్చారు. శంకరన్ రంగనాథస్వామి అయ్యారు. రంగూన్‌ లోని రామకృష్ణ ఆశ్రమానికి 1933 నుంచి 1942 దాకా కార్యదర్శిగా ఉన్నారు. అవి రెండవ ప్రపంచ యుద్ధపు రోజులు. దేశ విభజన రోజుల్లో రంగనాథానంద కరాచీలో ఉన్నారు (1942-48) తర్వాత రంగనాథానంద స్వామి ఢిల్లీ రామకృష్ణ మిషన్‌కి కార్యదర్శిగా ఉండి ఆ కేంద్రాన్ని అభివృద్ధి పరచారు. ఆ తర్వాత 1962 నుంచి 67 వరకు కలకత్తా లోని రామకృష్ణ మిషన్ సాంస్కృతి క అధ్యయనం కేంద్రం కార్యదర్శిగా వెళ్ళారు. 1998లో అధ్యక్షులుగా కలకత్తాలోని బేలూరు మఠానికి వెళ్ళారు. ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం (1986), గాంధీ శాంతి పురస్కారం (1999) పొందారు. స్వామీజీ ఆంగ్ల భాషలో ప్రతిభావంతుడు.

స్వామి రంగనాథానంద
జననంశంకరన్ కుట్టి
(1908-12-15)1908 డిసెంబరు 15
త్రిస్సూర్, కేరళ, భారతదేశం
నిర్యాణము2005 ఏప్రిల్ 25(2005-04-25) (వయస్సు 96)
బేలూరు మఠం, కోల్‌కత సమీపంలో
గురువుస్వామి శివానంద
తత్వంవేదాంత

మూలాలుసవరించు

ఆచార్య మ.శివరామకృష్ణ ఆంధ్రజ్యోతి 14.12.2008 లో రాసిన వ్యాససారం

బయటి లింకులుసవరించు

ఉపన్యాసాలు