స్వేచ్ఛ (సంస్థ)

స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ సంస్థ

స్వేచ్ఛ, లాభాపేక్షలేని సంస్థ. ఇది ఫ్రీ సాఫ్ట్‌వేర్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (FSMI)లో భాగం.[2] గతంలో ఇది ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ (FSF-AP) అనే పేరుతో ఉండేది. ఈ సంస్థ స్వేచ్ఛా సాఫ్ట్‌వేరుపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, సామాన్యులకు విజ్ఞానాన్ని అందించడానికి కృషి చేస్తున్న ఒక సామాజిక ఉద్యమం. ఇది 2005 సంవత్సరంలో తెలుగు ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేసింది.

స్వేచ్ఛ[1]
స్వేచ్ఛ
అవతరణ2005
రకంలాభాపేక్ష రహిత సంస్థ
కేంద్రస్థానంహైదరాబాదు
సేవలందించే ప్రాంతంఆంధ్రప్రదేశ్ & తెలంగాణ
అధికార భాషతెలుగు
ప్రధాన విభాగంExecutive Committee
అనుబంధ సంస్థలుభారత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ఉద్యమం
Formerly calledఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్

స్వేచ్ఛ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్క్‌షాపులు, సెమినార్‌లను నిర్వహిస్తుంది.[3] ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, హైదరాబాద్, చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, [4] [5] సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజ్, శ్రీదేవి ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, SCIENT ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్, జ్యోతిష్మతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, [6] MVGR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, KL యూనివర్సిటీ, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ వంటి అనేక ఇంజనీరింగ్ కళాశాలల్లో స్వేచ్ఛకు చెందిన GLUG (GNU/Linux యూజర్ గ్రూప్) చురుకుగా ఉంది.

లక్ష్యాలు

మార్చు

సంస్థ ప్రధాన లక్ష్యాలు ఇవి:

  • స్వేచ్ఛా సాఫ్ట్‌వేరును దాని సైద్ధాంతిక ప్రభావాలనూ, అభివృద్ధి చెందిన రంగాల నుండి వెనుకబడిన వారి వరకు భారతదేశంలోని అన్ని మూలలకూ తీసుకెళ్లడం.
  • స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ వాడుకపై కంప్యూటర్ వినియోగదారులకు అవగాహన కల్పించడం.
  • శాస్త్రాలు, పరిశోధనలకు చెందిన అన్ని రంగాల్లో స్వేచ్ఛా సాఫ్ట్‌వేరును వాడేలా కృషి చేయడం.
  • పాఠశాల విద్యలోను, ఉన్నత విద్యలోనూ స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ వినియోగాన్ని ముందుకు తీసుకెళ్లడం.
  • స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఇ-అక్షరాస్యతను పెంచి, డిజిటల్ అంతరాలను తగ్గించడం, వెనుకబడిన వారిని ప్రోత్సహించడం.
  • సామాజిక, జాతీయ అవసరాలను తీర్చే పరిష్కారాలపై డెవలపర్‌లతో కలసి పని చేయడం.
  • ప్రజాజీవితం లోని అన్ని రంగాలలో ఉచిత సాఫ్ట్‌వేర్‌కు అనుకూలంగా, ప్రభుత్వ విధానాల్లో మార్పు కోసం పని చేయడం.

ప్రాజెక్టులు

మార్చు

లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను తెలుగులోకి స్థానికీకరించి స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మోడల్‌తో స్థానిక ప్రజలకు ప్రపంచ స్థాయి సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను అందించడం లక్ష్యంగా స్వేచ్ఛ సంస్థ పెట్టుకుంది.[7] స్వేచ్ఛ OS ప్రధాన లక్ష్యం తెలుగు మాత్రమే అర్థం చేసుకోగల ప్రజలకు పూర్తి కంప్యూటింగ్ పరిష్కారాన్ని అందించడం. డిజిటల్ అగాధానానికి ఆవల ఉన్న సమాజమే డిస్ట్రో అనే ఈ లినక్స్‌ రూపానికి వినియోగదారులు. డిజిటల్ విభజనను నిర్మూలించి, డిజిటల్ ఐక్యతను సాధించడంలో ఇది ఒక అడుగు, ఈ ప్రాజెక్టు.


ఇవి కూడా చూడండి

మార్చు
  • ఉచిత సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్
  • ఉచిత సాఫ్ట్‌వేర్ ఉద్యమం
  • ఉచిత సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ తమిళనాడు
  • కర్ణాటక ఉచిత సాఫ్ట్‌వేర్ ఉద్యమం
  • పబ్లిక్ పేటెంట్ ఫౌండేషన్
  • సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్
  • Guifi.net

మూలాలు

మార్చు
  1. "About". Swecha. Retrieved 15 August 2014.
  2. "National Free Software coalition formed". The Hindu. 22 March 2010. Retrieved 27 February 2012.
  3. "Run up to NCAR 2010: Women In Research workshop held". Women in Research - the FOSS paradigm. Archived from the original on 26 December 2010. Retrieved 26 November 2010.
  4. "Workshop on free software". The Hindu. 20 June 2011. Retrieved 27 June 2011.
  5. "15 Day's Software Industry Oriented Training Camp". 15 Days Camp at CBIT. 18 March 2011. Retrieved 22 September 2013.
  6. "Free software movement spreads in universities". Jits Karimnagar. 18 June 2013. Archived from the original on 25 September 2013. Retrieved 22 September 2013.
  7. "A Telugu Os". Deccan Chronicle. 24 September 2013. Archived from the original on 22 February 2015. Retrieved 12 March 2014.