హంపీక్షేత్రము (ఖండకావ్యం)

హంపీక్షేత్రము కొడాలి వెంకట సుబ్బారావు, కామరాజు గడ్డ శివయోగానందరావు రచించిన ఖండకావ్యము.

హంపీక్షేత్రము
కృతికర్త: కొడాలి వెంకట సుబ్బారావు
కామరాజుగడ్డ శివయోగానందరావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: ఖండ కావ్యం
ప్రచురణ: విశ్వనాథ సత్యనారాయణ
విడుదల: 1933

రచన నేపథ్యం మార్చు

హంపీక్షేత్రము ఖండకావ్యం 1933లో విశ్వనాథ సత్యనారాయణ ప్రభృతుల చొరవతో ప్రచురణ పొందింది. ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షరశాల (బెజవాడ)లో ముద్రితమైంది.

రచయితల గురించి మార్చు

కొడాలి సుబ్బారావు సుప్రసిద్ధుడైన కవి. హైస్కూళ్లలో మాస్టరుగా, అనంతరం కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా పనిచేశారు. తన మేనమామ కామరాజుగడ్డ శివయోగానందరావు, సుబ్బారావు కలిసి జంటగా కవిత్వం వ్రాసారు. సుబ్బారావు ఖండకావ్యాలను రచించి చిన్నతనంలోనే మరణించారు.

ఇతివృత్తం మార్చు

హంపీక్షేత్రము ఖండకావ్యంలో విజయనగర రాజ్య స్థాపన, ఒడిదుడుకులు, వైభవం, మసకబారుట తుదకు దారుణంగా నేలమట్టమవడం ఇతివృత్తంగా స్వీకరించారు. చారిత్రిక పరిణామాలను కావ్యంగా రచన చేశారు. చారిత్రిక వ్యక్తులే ఇందులో ముఖ్యపాత్రలుగా కనిపిస్తారు.

ఇతరుల మాటలు మార్చు

  • కథా వస్తువునకు సంబంధించని అనవసరమైన ఒక్క అక్షరము లేదు. కావ్యము వెదికి చూచినను ప్రత్యక్షరము, ప్రతి శబ్దము, ప్రతి వాక్యము, ప్రతి అలంకారము కావ్యరసోన్ముఖముగానే పరుగెత్తెను. ఇది మహా శిల్పము. మిక్కిలిగా మాట్లాడినచో ఇంతకన్న శిల్పము లేదు. -విశ్వనాథ సత్యనారాయణ, సుప్రతిష్ఠుడైన కవి, రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత.

మూలాలు మార్చు