1933
1933 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1930 1931 1932 - 1933 - 1934 1935 1936 |
దశాబ్దాలు: | 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- ఫిబ్రవరి 27: హిట్లరు నియంతృత్వ పాలనకు దారితీసిన జర్మనీ పార్లమెంటు భవన దహనం జరిగింది.
- డిసెంబర్ 15: భారత్ తరఫున టెస్ట్ క్రికెట్లో లాలా అమర్నాథ్ తొలి శతకం సాధించాడు.
జననాలు
మార్చు- ఫిబ్రవరి 1: వెల్చేరు నారాయణరావు, తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు.
- మార్చి 6: కృష్ణకుమారి, తెలుగు సినిమా కథానాయిక. (మ.2018)
- మార్చి 25: వసంత్ గోవారికర్, భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. (మ.2015)
- మార్చి 31:నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (మ.2011)
- ఏప్రిల్ 1: బాపూ నాదకర్ణి, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- మే 9: దోమాడ చిట్టబ్బాయి, నాదస్వర విద్వాంసులు. (మ.2002)
- మే 20: జె. వి. రమణమూర్తి, రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు. (మ.2016)
- మే 24 : పి.జె.శర్మ, డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.2014)
- జూన్ 27: రమేష్ నాయుడు, తెలుగు సినీ సంగీత దర్శకుడు. (మ.1987)
- జూలై 1: దరియా హుస్సేన్ షేక్, అనంతపురం రాయలకళాగోష్ఠి కార్యదర్శి
- జూలై 4: కొణిజేటి రోశయ్య, రాజకీయ నాయకుడు ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర గవర్నరు.
- జూలై 12: గడ్డం గంగారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (మ.2017)
- జూలై 20: రొద్దం నరసింహ, భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత.
- ఆగష్టు 6: ఎ.జీ. కృపాల్ సింగ్, భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు. (మ.1987)
- ఆగష్టు 10: తుర్లపాటి కుటుంబరావు, పాత్రికేయుడు, రచయిత, వక్త. (మ. 2021)
- ఆగష్టు 14: అక్కినేని అన్నపూర్ణ, తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య. (మ.2011)
- ఆగష్టు 22: గోపీకృష్ణ, భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు. (మ.1994)
- ఆగష్టు 27: నాన్సీ ఫ్రైడే, స్త్రీ లైంగిక తత్వం, స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి.
- సెప్టెంబర్ 27: నగేష్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు, రంగస్థల నటుడు (మ.2009).
- అక్టోబర్ 6: ముకర్రం జా, నిజాం వారసుడు (మ. 2023)
- అక్టోబర్ 10: సదాశివ పాటిల్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- అక్టోబర్ 24: చామర్తి కనకయ్య కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (మ.2010)
- నవంబర్ 3: అమర్త్య సేన్, భారత ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి విజేత.
- నవంబర్ 22: నీరుకొండ హనుమంతరావు, ఖమ్మం జిల్లాకు చెందిన కవి. (మ.2016)
- డిసెంబర్ 15: బాపు, చిత్రకారుడు, సినీ దర్శకుడు. (మ.2014)
- డిసెంబర్ 15: వాసిరెడ్డి సీతాదేవి, రచయిత్రి. (మ.2007)
- : ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి, మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడు. (మ.2013)
- : మండే సత్యనారాయణ, విప్లవ కవి, పీపుల్స్‌వార్ ఉద్యమ నేపథ్యంలో వందకు పైగా విప్లవగీతాలను రచించారు. (మ.2013)
మరణాలు
మార్చు- మార్చి 28: గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1860)
- ఏప్రిల్ 2: రంజిత్సిన్హ్జీ, క్రికెట్ ఆటగాడు మహారాజా .
- సెప్టెంబర్ 20: అనీ బిసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (జ.1847)
- డిసెంబర్ 27: కాకర్ల శ్రీరాములు, మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి.