హత్య ఒక మనిషి మరొక మనిషిని ఉద్దేశపూర్వకంగా చంపడం. చట్టపరంగా ఇది ఘోరమైన నేరం. దీనికి అన్ని దేశాలలో, మతాలలో, న్యాయస్థానాలలో శిక్ష కూడా కఠినంగా ఉంటుంది.

Murder in the House by Jakub Schikaneder

ఆత్మరక్షణ కోసం చంపినా నేరం కాదు

మార్చు

ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంటే పిరికివాడిగా ఉండిపోవాల్సిన అవసరం లేదని ... ఆత్మరక్షణ కోసం అవసరమైతే కలహశీలిని చంపే హక్కూ పౌరుడికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా చంపడాన్ని చట్టం అనుమతిస్తుందని. దాన్ని హత్యతో పోల్చనవసరం లేదని సుప్రీం బెంచి ప్రకటించింది.

  • ప్రాణానికి ప్రమాదం పొంచి ఉన్నప్పుడే ఈ హక్కును వినియోగించుకోవాలి.
  • శత్రువు దాడి చేస్తాడన్న నిజమైన భయంతో పాటు దాని వల్ల తాను తీవ్రంగా గాయపడతానన్న సహేతుకమైన పరిస్థితులు ఉంటేనే ఈ హక్కు వర్తిస్తుంది.
  • ఆత్మరక్షణకు నిజంగా ప్రమాదం ఉందా అన్నది ఏ కేసుకు ఆ కేసు విడిగా పరిశీలించాలే తప్ప అన్నింటినీ ఒకే గాటన కట్టేలా ఫార్ములా ఏదీ రూపొందించలేం.
  • హక్కు తనను తాను రక్షించుకోవడానికే తప్పిస్తే పగ, ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు. (ఈనాడు 18.1.2010)

లాకప్ హత్యలు

మార్చు

పోలీసులే నిందితులను కొట్టిచంపటం,లేదా చిత్రహింసలకు గురిచేయటం వల్ల చనిపోయేలా చేయటం నేరం.

"https://te.wikipedia.org/w/index.php?title=హత్య&oldid=4268695" నుండి వెలికితీశారు