14 వ శతాబ్దంలో మేవారురాజ్యాన్ని (ప్రస్తుత భారతదేశ రాజస్థాను ప్రాంతం) రాణా హమ్మీరు (1314–78) పాలించాడు..[1] 13 వ శతాబ్దం ప్రారంభంలో ఢిల్లీ సుల్తానేటు దాడి తరువాత. పాలక గుహిలోటు రాజవంశం మేవారు నుండి స్థానభ్రంశం చెందింది. ఆ వంశంలోని పెద్దవాడైన హమ్మీరు సింగు ఈ ప్రాంతం మీద తిరిగి నియంత్రణ సాధించి తుగ్లకు రాజవంశాన్ని ఓడించి రాజవంశాన్ని తిరిగి స్థాపించాడు. ఆయన 'రాణా' అనే రాజ బిరుదును ఉపయోగించిన రాజవంశంలో మొదటి వ్యక్తి అయ్యాడు. హమ్మీరు గుహిలోటు నుండి ఉద్భవించిన శిశోడియా వంశానికి చెందిన(తరువాత వచ్చిన ప్రతిరాజు మేవారు మహారాణా పిలువబడ్డారు) వాడు. రాణా హమ్మీరుల పాలనలో మేవారు టర్కీ దండయాత్రలను తట్టుకున్న భారతీయ రాజ్యాలలో ఒకటి అయింది. జాన్ డార్విను అభిప్రాయం ఆధారంగా "మేవారు, విజయనగరు హిందూ రాజ్యాలు మాత్రమే ముస్లిం దాడులను తట్టుకుని నిలిచాయి ".[2]హమ్మీరు రాజస్థానులోని చిత్తూరు కోటలో అన్నపూర్ణ ఆలయం నిర్మించాడు.

హమ్మీరు సింగు
Rana
Rana of Mewar
Reign1326–1364
PredecessorAri Singh
SuccessorKshetra Singh
జననం1314
మరణం1378 (aged 63–64)
SpouseSongari
రాజవంశంSisodia
తండ్రిAri Singh
తల్లిUrmila

బార్డికు చరిత్ర కథనంలో మార్చు

ప్రస్తుత రాజస్థానులో మేవారు పాలకులలో పేరుకు ముందు రాణా అనే బిరుదును ఉపయోగించిన మొదటి (14 వ శతాబ్దపు) పాలకుడు రాణా హమ్మీరు (రణతంబోరుకు చెందిన హమ్మీరుతో కలవరపడకూడదు). ఆయన గుహిలోటు రాజవంశానికి చెందినవాడు. 13 వ శతాబ్దం ప్రారంభంలో ఢిల్లీ సుల్తానేటు దాడి తరువాత మేవారు నుండి పాలక గుహిలోటు రాజవంశం తొలగించబడింది. ఆ వంశంలో శిక్షణాతరగతికి చెందినవాడైన రాణా హమ్మీరు ఈ ప్రాంతం మీద తిరిగి నియంత్రణ సాధించి రాజవంశాన్ని తిరిగి స్థాపించాడు. గుహిలా రాజవంశంలో ఒక శాఖ అయిన శిశోడియా రాజవంశానికి ఇది పూర్వశాఖ అయ్యింది. మేవారు తరువాత వచ్చిన పాలకులు తమ పేరుకు ముందు మహారాణా చేర్చుకున్నారు.[ఆధారం చూపాలి]

ఢిల్లీ సుల్తాను అలావుద్దీను ఖిల్జీ మీద దండయాత్ర చేయడానికి రాణా రతను సింగు దూరపు బంధువు 'లక్ష' (లక్ష్మణ సింగు), రాణా రతను సింగు చేరారు. యుద్ధంలో ఆయన తన ఏడుగురు కుమారులులతో మరణపోరాటం (సాకా)చేసి వారితో ఆయన పాటు మరణించాడు. వారి మహిళలు జౌహరుకు (సతీసహగమనానికి) పాల్పడ్డారు (శత్రు బందీలుగా మారడానికి వ్యతిరేకంగా ఆత్మాహుతి చేసుకోవడం). లక్ష బప్పా రాణా శాఖకు చెందిన వాడు. అందువలన గెహ్లాటు (గుహిలోటు) వంశానికి చెందినవాడిగా భావించబడ్డాడు. లక్ష నాధ్ ద్వారా పట్టణానికి సమీపంలో ఉన్న శిశోడా గ్రామానికి చెందినవాడు. అందువలన ఆయన పిల్లలు 'శిశోడియా' అని పిలువబడ్డారు. లక్షకు తొమ్మిది (లేదా ఎనిమిది) మంది కుమారులు ఉన్నారు. వీరిలో పెద్దవాడు ఆరి సమీంలోని ఉన్నవ గ్రామానికి చెందిన ఉర్మిలా అనే అందమైన మహిళను వివాహం చేసుకున్నాడు. వీరు చందన వంశానికి చెందిన పేద రాజపుత్ర కుటుంబానికి చెందినవారు. ఈ జంటకు రానా హమ్మీరు ఏకైక సంతానంగా జన్మించాడు.[ఆధారం చూపాలి]


రాణా రతను సింగు నాయకత్వంలో చిత్తోరుకు మద్దతుగా లక్ష, ఆరి ఇద్దరూ మరణించారు. యువ హమ్మీరు వెనుక వదిలివేయబడ్డాడు. ఆయన దాదాపు పసివాడు అయినప్పటికీ ఆయన మామ అజయ్ (అదే యుద్ధంలో పోరాడినవాడు), రెండవ కుమారుడు మార్గదర్శకత్వంలో లక్ష పెరిగాడు. రాణా హమ్మీరు తన మామ ఎదుట తన ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. చిన్న వయస్సులో సమీప ప్రాంతంలో గందరగోళానికి కారణమవుతున్న ముంజా బాలేచా (బాలి రాష్ట్రానికి చెందిన చౌహాన్) అనే కాంతాలియా రాజును చంపాడు. ఈ సంఘటన తన మామను ఆకట్టుకుని ఆయన వెంటనే హమ్మీరును పాలకుడిని చేస్తానని వాగ్దానం చేసాడు.[3]

ఖిల్జీలు తామ కొత్తగా స్వాధీనం చేసుకున్న భూభాగాలను జలోరు పాలకుడు మాల్దేవుకు కేటాయించారు. వీరు యుద్ధకాలంలో వారితో సంబంధం కలిగి ఉన్నారు. తన పాలనకు పౌరులను స్థిరపరచి సహకరించడానికి మాల్దేవు తన వితంతువు కుమార్తె సోంగారిని రాణా హమ్మీరుకు ఇచ్చి వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశాడు. ఇది పూర్వపు పాలక రాజవంశంలో దిగువహోదా కలిగిన శాఖ వారసుడైన రానా హమ్మీరు సింగు 1326 లో మేవారు రాజ్యాన్ని పునఃస్థాపించడానికి సహకరించింది. తరువాత హమ్మీరు మామగారి మీద తిరుగుబాటు చేయడానికి ప్రణాళిక రూపొందించాడు. ఈ విధంగా హమ్మీరు స్థాపించిన రాజవంశం రానా హమ్మీరుకు చెందిన పర్వత గ్రామం శిశోడియా పేరుతో శిశోడియా అని పిలువబడింది.[ఆధారం చూపాలి].

తుగ్లకు రాజవంశంతో సంఘర్షణలు మార్చు

ఢిల్లీలోని ఖల్జీ రాజవంశం ముగిసిన తరువాత ఏర్పడిన గందరగోళం మధ్య హమ్మీరు సింగు మేవారు నియంత్రణ సాధించినట్లు నైన్సి (17 వ శతాబ్దం) వంటి రాజపుత్ర బార్డికు చరిత్రకారులు పేర్కొన్నారు. మాల్దేవు కుమారుడు జైజాను ఢిల్లీ సుల్తానేటు చౌహాను సామంతరాజులను మేవారు నుండి తొలగించాడు. ఢిల్లీ సుల్తాను ముహమ్మదు బిను తుగ్లకును హమ్మీరు సింగుకు వ్యతిరేకంగా దాడి చేయమని జైజా ఢిల్లీకి పారిపోయాడు. ముహ్నోతు నైన్సీ అభిప్రాయం ఆధారంగా హమ్మీరు సింగు సింగోలి గ్రామానికి సమీప ంలో తుగ్లకును ఓడించి సుల్తానును జైలులో పెట్టాడు. ఆయన మూడు నెలల తరువాత సుల్తానును విడుదల చేశాడు. విమోచన క్రయధనంగా సుల్తానేటు ఆయనకు అజ్మీరు, రాంతంబోరు, నాగౌరు, సూయసుపూరులను అప్పగించిన తరువాత; 5 మిలియను రూపాయలు, 100 ఏనుగులను చెల్లించింది. [4]

ఏదేమైనా నైన్సీ వాదన సరికాదు. వాస్తవానికి హమ్మీరు సింగు, ముహమ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడూ కలవలేదు.[5] రాజపుత్ర బార్డికు చారిత్రక కథనం, ఇతర ఆధారాల ద్వారా ధృవీకరించబడలేదు. హమ్మీరు విజయాల వాదనలు పూర్తిగా నిరాధారమైనవి కావు: 1438 జైన దేవాలయ శాసనం అతని దళాలు ముస్లిం సైన్యాన్ని ఓడించాయని ధృవీకరిస్తుంది; ఈ సైన్యానికి ముహమ్మదు బిను తుగ్లకు సైనికాధికారులు నేతృత్వం వహించి ఉండవచ్చు. తదనంతరం ముహమ్మదు బిను తుగ్లకు, ఆయన వారసులు ప్రస్తుత రాజస్థానులో తమ అధికారాన్ని పునరుద్ధరించలేదు. హమ్మీరు సింగు అధికారాన్ని ఇతర రాజపుత్ర ప్రముఖులు గుర్తించారు. మేవారు పాషా జహంగీరు నిబంధనలకు లోబడి రాణా అమరు సింగు (1615 వరకు) ఢిల్లీ సుల్తానేటు నుండి స్వతంత్రంగా ఉన్నారు.[4]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. pp. 116–117. ISBN 978-9-38060-734-4.
  2. After Tamerlane: The Rise and Fall of Global Empires, 1400-2000 By John Darwin
  3. The Rajputs of Rajputana: a glimpse of medieval Rajasthan by M. S. Naravane ISBN 81-7648-118-1
  4. 4.0 4.1 R. C. Majumdar, ed. (1960). The History and Culture of the Indian People: The Delhi Sultante (2nd ed.). Bharatiya Vidya Bhavan. p. 70.
  5. Carl W. Ernst. Eternal Garden: Mysticism, History, and Politics at a South Asian Sufi Center. SUNY Press. p. 103. ISBN 978-1-4384-0212-3.