హరద్వార్ దూబే
హరద్వార్ దూబే (1 జులై 1949 – 26 జూన్ 2023) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండు సార్లు ఆగ్రా కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు. హరద్వార్ దూబే 26 నవంబర్ 2020న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
హరద్వార్ దూబే | |||
పదవీ కాలం 26 నవంబర్ 2020 – 26 జూన్ 2023 | |||
ముందు | చంద్రపాల్ సింగ్ యాదవ్ | ||
---|---|---|---|
తరువాత | దినేశ్ శర్మ | ||
నియోజకవర్గం | ఉత్తర్ ప్రదేశ్ | ||
ఆర్ధిక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 24 జూన్ 1991 – 6 డిసెంబర్ 1992 | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1989 – 1993 | |||
ముందు | కృష్ణ వీర్ సింగ్ కౌశల్ | ||
తరువాత | రమేష్ కాంత్ ములవాని | ||
నియోజకవర్గం | ఆగ్రా కంటోన్మెంట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హుసైనాబాద్, బాలియా, | 1949 జూలై 1||
మరణం | 2023 జూన్ 26 ఢిల్లీ, భారతదేశం | (వయసు 73)||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | డా. కమల పాండే (m. 1978) | ||
సంతానం | ప్రన్షు దూబే & కృత్యా దూబే | ||
పూర్వ విద్యార్థి | ఆగ్రా యూనివర్సిటీ |
హరద్వార్ దూబే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పని చేసి, 2020లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
మార్చుహరద్వార్ దూబే 1969లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంస్థాగత మంత్రిగా చేసి ఆ తర్వాత స్థానిక రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఆయన 1983లో మెట్రోపాలిటన్ యూనిట్ మంత్రిగా తదనంతరం మెట్రోపాలిటన్ అధ్యక్షుడిగా భాద్యతలు నిర్వహించాడు. హరద్వార్ దూబే 1989 & 1991లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆగ్రా కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పని చేసి, 2005లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖేరాఘర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.
హరద్వార్ దూబే 2011లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేసి, 2013లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. ఆయన 26 నవంబర్ 2020న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మరణం
మార్చుహరద్వార్ దూబే అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో జూన్ 12న చేరి చికిత్స పొందుతూ 2023 జూన్ 26న మరణించాడు.[1][2]
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (26 June 2023). "గుండెపోటుతో బీజేపీ ఎంపీ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Hindu (26 June 2023). "BJP Rajya Sabha MP Hardwar Dubey Passes Away" (in Indian English). Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.