హరిదాసుల సంక్రాంతి విన్యాసాలు

తెలుగు ప్రజలకు అన్ని పండగల కంటే మకర సంక్రాంతి చాల పెద్ద పండుగ . అది నెల రోజుల పండుగ, సంవత్సరమంతా కష్టించు కున్న పంట లక్ష్మిని ఇంటికి తెచ్చుకున్న కష్ట జీవులైన రైతులందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పెద్ద పండగ.

హరిదాసు

సంక్రాంతి శోభలు మార్చు

ధనుర్మాసం నెలరోజులూ గ్రామాలన్నీ శోభాయమానంగా వుంటాయి. ప్రతి ఇంటిని అలికి సున్నాలు కొట్టి సుందరంగా అలంకరిస్తారు. నెల రోజులూ ఇళ్ళముందు రంగు రంగుల రంగ వల్లులను తీర్చి దిద్దుతారు. యువకులందరూ ఎడ్ల పందేలు,కోడి పందాల సరదాతో కోడి పుంజులను సిద్ధం చేస్తారు...

సంక్రాంతి సంకేతం, హరి దాసులు మార్చు

ముఖ్యంగా సంవత్సర కాలంలో ఎప్పుడూ కనిపించని హరి దాసులు ధనుర్మాసం లొనే కనిపిస్తారు. వీరు ధనుర్మాసం నెలరోజులూ వారి భక్తి పాటలతో ప్రతి ఇంటినీ పావనం చేస్తారు. తెల్ల వారి ఆరుగంటలకే స్నానం చేసి కాషాయ వస్త్రాలనుధరించి ముఖానికి నామాలు దిద్దుకుని మెడలో పూల దండలను రుద్రాక్ష మాలలను ధరించి నెత్తిమీద నామాలతో అలంకరించిన అక్షయ పాత్రను నెత్తిమీద పెట్టుకుని, భుజంమీద తంబురాను మీటుకుంటూ ఒక చేతితో చిడతలతో తాళం వేస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతూ గజ్జెలు కట్టిన కాళ్ళతో, పాటకు తగిన నృత్యం చేస్తూ హరిలో రంగ హరి అంటూ బయలు దేరి ప్రతి ఇంటి ముందూ పాట పాడుతూ నృత్యం చేస్తూ వుంటే, ఇంటి ఇల్లాలు గాని, పిల్లలు గాని, ఫల పుష్పాదులతో దోసెడు బియ్యాన్ని తీసుకువస్తే, హరిదాసు వినంమ్రతో మోకాటి మీద కూర్చుని అక్షయ పాత్రలో వేహించు కుంటూ వారిని పుత్ర పౌత్రాభి వృద్ధిగా దీవించి మరో ఇంటికి సాగి పోయి, ఇలా వూరంతా పూర్తి చేస్తారు.

తన్మయత్వంతో పాడే పాటలు మార్చు

ఇలా ఇంటింటికీ తిరుగుతూ తన్మయత్వంతో పాడే పాటల్లో ఎక్కువగా రామదాసు పాటలనే ఇలా పాడేవారు.

అదిగో భద్రాద్రీ, గౌతమి అదిగో చూడండి
ముదముతో సీతా రామ ముదిత లక్ష్మణూల
కలిసి కొలువగా రఘుపతి యుండెడి...................||అదిగో||

అలాగే......

ఏ తీరుగ నను దయ చూచెదవో
యినవంశోత్తమ రామా, నాతరమా
భవ సాగర మీదను నళీన దళేక్షణ రామా................:ఏ:
వాలు పాఠ్యం
అలాగే.....

ఏమీరా రామా, నావల్ల నేరమేమీరా రామా
ఏమీరా రామ య్లాగు కష్టము
నీ మహిమో నా ప్రారబ్ధమో
కుండలిశయన వేదండ రక్ష
శాఖండ తేజ నాయకుండవే...........................||ఏమీరా||

అలాగే.............

పలుకే బంగారామాయెనా
కోడండ పాణి పలుకే బంగారామాయెనా
పలుకే బంగారమాయె పిలిచిన పలుక వేమి
కలలో నీ నామ స్మరణ, మరువ చక్కని తండ్రి............||పలుకే||


ఇలా భక్తి తన్మయత్వంతో పాటలు పాడుతూ గ్రామ పౌరలను పరవశుల్ని చేస్తారు.

ఎందరో హరి దాసులు మార్చు

ఇలా ఒక్కరు కాదు. ఇద్దరు ముగ్గురు హరి దాసులు కూడా కోలాహలంగా పూరంతా వారి గానంతో ముంచెత్తుతారు. ఇలా వచ్చిన ప్రతి హరి దాసుకూ, బిక్షను అందచేస్తారు............ ఇలా నెల రోజులుగా తిరిగి సంవత్సరానికి సరి పడ గ్రాసాన్ని సంపాదించు కుంటారు. వీరంతా బయట వూరినుంచే వస్తారు. వార్షికంగా ప్రతి వూరికీ ఎవరెవరు వస్తారో వారు తప్పా ఇతరులు రారు. ముఖ్యంగా ఇలా వచ్చే వారిలో విష్ణు భక్తులైన సాతానులు........దాసరులు, రాజులు మొదలైన వారు ఇలా జీవిస్తూ వుంటారు.

గ్రామ వీధుల్లో హరి దాసు లిలా హరి భజన చేయడం కోలాహలంగా వుంటుంది. హరి దాసుని అక్షయ పాత్రలో బియ్యం వేయటానికి......... బాలబాలికలు పోటీలు పడతారు. హరిదాసు లిలా ప్రతి ఇంటి ముందూ కూర్చుని లేవటం చాల కష్టమైన పని, అయినా భక్తిభావంలో అదంతా మరిచిపోతారు.

హరిదాసులతో పాటు, సంక్రాంతి పర్వ దినాలలో, గంగి రెద్దుల వారు, బుడబుక్కలవారు, పగటి వేషధారులు, గారడీ వాళ్ళు, ఎందరెందరో జానపద కళాకారులతో, కన్నుల పండువుగా సంక్రాంతి పర్వ దినాలు ముగుస్తాయి. పంటను ఇంటికి తెచ్చుకుని కళకళ లాడే రైతు కుంటుంబాలు సంక్రాంతి పర్వదినాలు ముగుస్తాయి. పంటను ఇంటికి తెచ్చుకుని కళకళ లాడే రైతు కుంటుంబాలు సంక్రాంతి సంతోషంలో అందస్ర్నీ ఆదరిస్తారు.

కోన సీమ కోల సంబరం మార్చు

తిరుపతి తీర్థ యాత్రలకు వెళ్ళి వచ్చిన వారు సంతోషంగా దీపారాధన జరిపి కొందరు వేంకటేశ్వర ప్రసాదాన్నిచ్చి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. మరి కొందరు ఈ కోల సంబరం కథను ఏర్పాటు చేస్తారు.

తెలుగు కళా రూపాల్లో ఒక ప్రాంతంలో ప్రచారంలో వున్న కళారూపం మరో ప్రాంతంలో లేదు. ఒకో కళారూపం ఒక జిల్లాకే పరిమితమైన కళారూపాలు కూడా ఉన్నాయి. అలా చూసు కున్నప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో ఈ కోల సంబరం ప్రచారంలో ఉంది. తిరుపతి వెళ్ళి వచ్చిన వారు దీపారాధన రోజున రాత్రి పూట ఈ కథను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనానికి కొబ్బరాకుల పందిరిని ఏర్పాటు చేస్తారు. కథకులు ఇద్దరుంటారు. నుదురు మీదా, లభుజాల మీదా, రొమ్ము మీదా, చేతుల మీదా, పెద్ద పెద్ద నామాలను ధరించి, నూనె గుడ్డలు చుట్టబడిన రెండు కోలలను వెలిగించి, రెండు కోలలనూ త్రిప్పుతూ, ఓరోరి వెంకన్న, ఓరి వెంకన్న అని పాడుతూ వుంటే వీరికి వంతలుగా పెద్ద ధ్వని నిచ్చే పెద్ద తాళాలను వాయిస్తూ వంత పాట పాడుతూ వుంటే, ఒక వ్వక్తి వీరి మధ్యలో ఒకరు ఒక చేతిలో పేము బెత్తాన్ని, రెండవ చేతిలో నెమలి ఈకల కట్ట పట్టుకుని, రంగ స్థలంలో, పెనక్కూ ముందుకూ నడుస్తూ, అంగ విన్యాసం చేస్తూ... జనరంజకంగా కథను సాఅగిస్తారు. రంగ స్థలంలో మామూలు లైట్లున్నా, వెలిగించిన కోలల కాంతి కూడామంచి వెలుగురు నిస్తుంది. చెప్పే కథ తిరుపతి వెంకన్నకు సంబంధించిన కథ. ఇది మామూలుగా పురాణాల్లో వున్న వెంకటేశ్వరుకి కథ కాదు. అలిమేలు మంగమ్మ, బీబీ నాంచారమ్మ, వెంకన్న బాబుల ప్రణయానికి సంబంధించింది. విరహంతో కూడిన భిన్నమైన జానపద కథ అని పడాల రామ కృష్ణారెడ్డి గారు ఉదహరించారు. తెలుగు ప్రజలు ఇదే నిజమైన కథ అని నమ్మి ఎంతో ఆసక్తితో విని ముగ్ధులౌతారు. ఈ కథను కేవలం కథగానే చెప్పటం కాక, మధ్య మధ్యలో సునిశితమైన హాస్యాన్ని ప్రవేశ పెడతారు. కోలను త్రిప్పే అతను మధ్య మధ్య కథను ఆపి విచిత్రమైన ప్రశ్నలు వేసి వాటికి తగిన సమాధానలను రెండవ వానితో చెప్పిస్తాడు. ఈ ప్రశ్నలు సమాజ జీవితానికి సంబంధించి వుంటాయి. ఇవి ఒక ప్రక్క నవ్వులతో ప్రేక్షకులను రంజింప చేయడంతో పాటు విజ్ఞాన పరుస్తూ సామాజిక బాధ్యతలను తెలియ చేస్తాయి. దానితో పాటు భక్తి తత్వాన్ని ప్రబోదిస్తూ వుంటాయి. ఈ కోల సంబరం కథలు ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కువగా ప్రదర్శిస్తారు.

మానాటి గొల్లల కథ మార్చు

కోల సంబరం అనే జానపద కథా రూపం ప్రాచీనమైనది. ఇది మానాటి గొల్లలచే ప్రారంభించ బడింది. ఆ కులంలో జన్మించిన గొల్ల అచ్చమ్మ అనే స్త్రీ ఈ కథను గానం చేసేది. తూర్పు గోదావరి జిల్లా పెని కేరు దగ్గరలో వున్న కీలక చర్ల ఈమె స్వగ్రామంనేటికి సుమారు రెండు వందల ఏబై సంవత్సరాల క్రిందట ఈవిడ ఈ కథను గానం చేసేది. అచ్చెమ్మ గారు చనిపోయిన తరువాత........ఆమె దగ్గర కథ నేర్చుకున్న వెల్లగ్రామ నివాసి అయిన చిక్కాల కోటయ్య కాపు నేర్చుకుని వెల్ల గ్రామానికి తీసుకు వచ్చాడు. కోటయ్య ద్వారా ఆయన కుమారులులు పట్టాభి రామన్న, జానకి రామయ్యలు నేర్చుకున్నారు. వీరి ద్వారా మిగిలన వారు ఈ కథాగానాల్ని నేర్చుకున్నారు.

కథకురాలు అచ్చమ్మ మార్చు

పూర్వం గొల్ల అచ్చమ్మ గారు తిరుపతి క్షేత్రం నడచి వెళ్ళేటప్పుడు ఈ కథను స్వంతంగా అల్లుకుని పాడుకుంటూ వెళ్ళేది. ఒక సారి ఆమెతో కూడా చిక్కాల కోటయ్య కూడా వెళ్ళడం జరిగింది కోటయ్యతో పాటు, పెద్దాపురం వాస్తవ్యులైన పెనుమాళ్ళ గోవిందు, గోడి సెట్టి నరసన్న మొదలైన వారు కలిసి వెళుతూ కథను ఆకళింపు చేసుకున్నారు. తిరిగి వచ్చిన కొంత కాలం తరువాత గొల్ల అచ్చెమ్మగారి ఆవసాన దశలో చిక్కాల కోటన్ను పిలిచి సఆంబరానికి సంబంధించిన కోలలు నెమలి కుచ్చు బెత్తము, తాళాలు మొదలైన సామానులిచ్చి, ఈ కథను ప్రచారం చేయవలసిందిగా కోరింది. నాటినుంచి ఈనాటి వరకూ ఈ కథను గానం చేస్తున్నారు. వీరి ద్వారా వెల్ల గ్రామంలో చాల మంది ఈ కథను నేర్చుకుని కథా గానాన్ని చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు.

కోల సంబరం పేరెందుకొచ్చింది మార్చు

కోల సంబరం అనే వేకటేశ్వర స్వామి కథ చాల వ్వాప్తి చెందింది. కోలలు వెలిగించి చెప్పేటటువంటి కథ కాబట్టి, దీనికి కోల సంబరం అని పేరు వచ్చింది. ఈ కోల సంబరం అనే ఈ కథా బృందంలో ఆయిదుగురుంటారు. పైగక్వ ఒక మనిషి కూడా వుంటాడు. ముందు భాగంలో ఇద్దరు కోలలు పట్టుకుంటారు. వెనుక నిలబడిన ఇద్దరూ కథకుడు పాడిన పాటకు వంత పాడుతూ వుంటారు. వెనుక వంత దారులు తాళాలు వాయిస్తూ వుంటారు. ముందు కోలలు పట్టుకున్న వారికి, వెనుక వంగ్త పాడే వారికి మధ్య కథకుడు కథను చెపుతూ వుంటాడు. ఈ కథకుని గురువు అని పిలుస్తారు. ముందు భాగంలో నిలబడిన ఇరువురూ, హాస్య చెపుతూ వుంటారు.

ఏడుగురు అన్నదమ్ములు మార్చు

వెంకటేశ్వరుని అన్నదమ్ములు ఏడుగురు. వేంకటేశ్వరుడు చిన్న వాడు. శ్రీవాసులు అని కూడా పిలుస్తూ వుండేవారట. శ్రీనివాసులు తిమ్మరాజు పేరిందేవిల ఏడవ మగ బిడ్డ. శ్రీనివాసుని యొక్క సోదరుల పేర్లు:.. 1.గోవిందరాజులు, 2.పెన్నాడ వెంకన్న శ్రీకాకుళం జిల్లా, 3. ఉప్పాల వెంకన్న ... పిఠపురం తాలూకా, 4. బెండపూడి వెంకన్న, 5. యానాం వెంకన్న, 6. వాడపల్లి వెంకన్న, 7. అఖరివాడుగా శ్రినివాసుడు జన్మించాడట. కాని ఈ ఏడుగురు అన్నదమ్ముల కంటే ముందు విజయవాడలో వేంచేసి యున్న కనకదుర్గ, తిమ్మరాజు, పేరిందేవిల మొదటి సంతానమనీ ఈ కథను చెప్పే కొంత మంది గురువుల చెపుతూ వుంటారు.

తిరుపతి వెంకన్న మార్చు

అందరిలోకి చిన్నవాడైన వేంకటేశ్వరుడు, తల్లి దండ్రులను విడిచి పెట్టి తిరుపతి కొండకు చేరి ఆ కొండ మీదే దేవాలయాలు కట్టించుకున్నాడని, పద్మావతిని, బీబీ నాంచారిని వివాహం చేసుకుని, తిరుపతి కొండ మేదే నివాసం ఏర్పరుచుకుని శిలా విగ్రహాలుగా మారి పోయారని కథను పూర్తి చేస్తారు.

బృందాల సంబరాలు మార్చు

చిక్కాల కోటయ్య సంబరాలు చేసే రోజుల్లో ఆబోతుని సంబరంలోనికి తీసుకు వచ్చే వారు. కోటయ్య చనిపోయి ఇప్పటికి సుమారు నూరు సంవత్సరాలైంది. ఈ నాడు కథలు చెప్పే బృందాలు నెలకు ఆరు కథలకు తక్కువ కాకుండా చెపుతారు. ఒక్కొక్క గురువుకూ నెలకు సరాసరి ఆరు వందల రూపాయలు ఆదాయం వస్తుంది. వెల్ల గ్రామంలో సుమారు ఏబై బృందాల వరకూ ఉన్నాయి. వెల్ల గ్రామం తూర్పు గోదావరి జిల్లా రామ చంద్ర పురం తాలూకాలో ఉంది.

సూచికలు మార్చు