హరిద్ర లేక కుర్కుమా అనేది ఒక మొక్క జాతి పేరు. Zingiberaceae (అల్లం) కుటుంబానికి చెందిన ఈ రకపు మొక్కలలో 80 రకాలను గుర్తించి అంగీకరించారు.

హరిద్ర
Curcuma zedoaria
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Curcuma

Species

See text

హరిద్ర జాతి మొక్కలు పసువు, తులిప్ వంటి పూల మొక్కలను పోలి ఉంటాయి.

హరిద్రను ఇంగ్లీషులో కుర్కుమా అంటారు [1]. కుర్కుమా అరబిక్ పదం. అరబిక్ లో కుర్కుమా అనగా పసుపు అని అర్ధం.

చరిత్ర

మార్చు

Linnaeus 1753 నుంచి హరిద్ర మొక్కల జాతికి దగ్గర పోలికలున్న 130 రకాల మొక్కల గుంపు గురించి వివరంగా వర్ణించాడు. హరిద్ర మొక్క తేమతో కూడిన, లోతట్టు ఉష్ణమండల మొక్క, ఇది 900 మీటర్ల ఎత్తులో కనిపిస్తుంది,22 - 27 ° c పగటి ఉష్ణగ్రత పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఇది బాగా పెరుగుతుంది ]. 1,100 - 1,500 మిమీ పరిధిలో సగటు సంవత్సర వర్షపాతం లో కాని రుతుపవనాల అడవులలో 700 - 4,300 మిమీ , రుతుపవనాల అడవులలో మొక్కలు పెరుగుతాయి [2] వీటి పెరుగుదల కాలం అభివృద్ధి చెందడానికి 2 సంవత్సరాలు పడుతుంది. మొక్క చాలా కాలం పాటు ఉంటుంది. వీటి ఉపయోగము దృష్ఠి లో పెట్టుకొని ఉత్పత్తి , మార్కెటింగ్ సామర్థ్యం పెంచడానికి ఇంకా శాస్త్రవేతలు , ప్రభుత్వాలు పరిశీలన చేయాల్సిన అవసరం వుంది[3]

ఉపయోగములు హరిద్ర ను కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, అజీర్ణం, దోమల నివారణగా ఉపయోగిస్తారు.కొన్ని పరిశోధనలో యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందని చెప్పుతున్నారు. హరిద్ర మొక్కతో తో టీ తాగడం మొత్తం కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని , కొలెస్ట్రాల్ ఉన్న పురుషులలో అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ "మంచి" (హెచ్‌డిఎల్లే) కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని ప్రారంభ పరిశోధనలో తేలింది. మానసిక ఆందోళన,క్యాన్సర్ద,దగ్గు,అలసట,కాలేయం యొక్క వాపు (మంట) (హెపటైటిస్) వంటి వ్యాధుల నివారణ కు పనిచేస్తుందని చెపుతున్నారు. ఇది నిర్ధారించడానికి మరింత పరిశోధన అవసరం [4] .

రకాలు

మార్చు

పసుపు

నల్ల పసుపు

ఇవి కూడా చూడండి

మార్చు

తులిప్

గ్యాలరీ

మార్చు

మూలాలు

మార్చు
  1. "18వ శతాబ్దానికి చెందిన ఆయుర్వేద తాళపత్ర గ్రంథం లోని కొన్ని తెలుగు, సంస్కృత పదాలు – ఒక పరిచయం. డాక్టర్ బాలరాజు చంద్రమౌళి | Tejasvi Astitva Resarch Magazine" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-29.
  2. "Curcuma zedoaria - Useful Tropical Plants". tropical.theferns.info. Archived from the original on 2020-09-19. Retrieved 2020-08-03.
  3. "Curcuma zedoaria (PROSEA) - PlantUse English". uses.plantnet-project.org. Archived from the original on 2017-08-21. Retrieved 2020-08-03.
  4. "Zedoary: Uses, Side Effects, Interactions, Dosage, and Warning". www.webmd.com (in ఇంగ్లీష్). Retrieved 2020-10-27.
"https://te.wikipedia.org/w/index.php?title=హరిద్ర&oldid=3850322" నుండి వెలికితీశారు