పరిచయంసవరించు

నల్ల పసుపు
 
Scientific classification
Kingdom:
Division:
Class:
Subclass:
Order:
Family:
Genus:
Species:
సి. కేసియా
Binomial name
కర్క్యుమా కేసియా

నల్ల పసుపు (లాటిన్ Curcuma caesia)[1] తాంత్రిక, వశీకరణ చర్యల కోసం ఉపయోగించే అరుదుగా దొరికే ఒక విధమైన పసుపు. ఇది మధ్య ప్రదేశ్ లోని నర్మదా నదీ ప్రాంతంలోను, ఈశాన్య రాష్ట్రాలలోనూ, అరుదుగా తూర్పు కనుమలలోనూ, నేపాల్ లోను లభిస్తుంది.[2] బెంగాల్లో పండించే ఈ మొక్క యొక్క దుంపలను సౌందర్య వస్తువులు (కాస్మెటిక్స్) తయారీలో ఉపయోగిస్తారు.[3]

 
HarvestedRhyzome2

నల్ల పసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ట కేదార అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన నిషా, నిషి, రజిని, రాత్రి మొక్క నల్ల పసుపేనని భావిస్తారు.[4] దీని దుంప లోపలి భాగం ముదురు నీలం -నలుపు సమ్మేళనంతో ఉంటుంది., పువ్వు ముదురు పింక్ రంగులో ఉంటుంది. కాళీమాత పూజలో వాడే ఈ రకం పసుపుని హిందీలో కాలీ హాల్దీ అని పిలుస్తారు. కాలీ అంటే నలుపు ఆని అర్ధం. అందుకే ఈ రకం పసుపుకి నల్లపసుపు అని పేరు వచ్చింది. ఆంగ్లంలో నల్ల పసుపును Black Turmeric అని అంటారు.

నల్లపసుపును నేడు ఆంధ్ర ప్రదేశ్లో చాలా చోట్ల సాగుచేస్తున్నారు. అటవీ శాఖ ప్రకారం ఇది ఒక అరుదైన పసుపు జాతికి చెందిన అంతరించిపోతున్న మొక్క. దీనిని అమ్మడం, కలిగివుండడం, పెంచడం భారత అటవీ చట్టం ప్రకారం నేరం.[5]

రసాయనాలుసవరించు

2008 ఫిబ్రవరిలో గవర్నమెంట్ హోల్కార్ సైన్స్ కాలేజ్, (ఇండోర్, మధ్యప్రదేశ్) వారు బోటనీ డిపార్టుమెంట్ హెడ్ డాక్టర్ సంజయ్ వ్యాస్ అధ్యర్యంలో నల్లపసుపులో ఉన్న రసాయనాలపై పరీక్షలు నిర్వహించారు. ఇండియన్ ఫార్మాకోఫియా ప్రకారం ఫిజికో కెమికల్స్ ను లెక్కించారు. అవి ఇలా ఉన్నాయి. యాష్ కంటంట్ 9.028 %, యాసిడ్ ఇన్ సాల్యుబుల్ యాష్ 4.31 %,లాస్ ఆన్ డైయింగ్ (LOD) 9.944 %, తేమ శాతం 8.8%, వాటర్ సోల్యుబుల్ ఎక్స్ ట్రాక్టివ్స్ 13.68%, ఆల్కహాల్ సోల్యుబుల్ ఎక్స్ ట్రాక్టివ్స్ 6.17%, వాలటైల్ ఆయిల్ 1.8 % .

100 గ్రాముల నల్లపసుపు పొడితో ఫైటో కెమికల్ స్క్రీనింగ్ నిర్వహించగా అందులో కార్బో హైడ్రేట్లు, ప్రొటీన్లు, ఆయిల్స్, ఫాట్స్, స్టెరాయిడ్లు, టెర్పనాయిడ్లు, ఆల్కలాయిడ్లు, గ్లైకోసైడ్లు, టానిన్ లు, ఫినాల్ బయటపడ్డాయి. గ్యాస్ క్రొమాటోగ్రాఫీ, మాస్ స్పెక్ట్రోమెట్రీ ఎనాలసిస్ ప్రకారం వాలటైల్ ఆయిల్ లో 1,8 సినియోల్ (27% -48%), కర్పూరం (14% -28.3%), ఎ.ఆర్.టర్మియోన్ (12.3%) ఉన్నాయి. దుంపల్లో వాలటైల్ ఆయిల్ 1.5% నుండి 1.8% ఉంటుంది.

గిరిజనుల నమ్మకాలు, వాడుకసవరించు

 • నల్లపసుపు దుంపను జేబులో పెట్టుకున్నా, గుమ్మానికి వ్రేలాడదీసినా దుష్టశక్తులు వెళ్ళిపోతాయని, నల్లపసుపు దుంప అమ్మవారి స్వరూపమని భారతదేశంలో చాలా గిరిజనులు నమ్ముతారు. ముఖ్యంగా నల్లపసుపు దుంపను తాంత్రిక విద్యల్లో వాడతారు. వశీకరణ చర్యలకు ఛత్తీస్ గడ్ కేశ్కల్ కొండ ప్రాంతాల్లో తాంత్రికులు నల్ల పసుపును ఆవు మూత్రంతో పేస్టులా చేసి దానిని నుదుటికి కుంకుమ వలె పెట్టుకుంటారు. కంకర్ ప్రాంతపు తాంత్రికులు నల్ల పసుపును ఆవు మూత్రంతో పేస్టులా చేసి దానిని నుదుటికి కుంకుమ వలె పెట్టుకుని దాని చుట్టూరా కొంచెం రక్తాన్ని పెట్టుకుంటారు [6].
 • గిరిజనులు నల్లపసుపు దుంపను నలగ్గొట్టి రసాన్ని పార్శపు నొప్పికి, కడుపులో అపానవాయువులకు, దెబ్బలకు వాడతారు.
 • ఉత్తరాంచల్ చమోలీ జిల్లాలో పెంపుడు జంతువులకు కడుపునొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో నల్ల పసుపు పొడిని కలిపి ఇస్తారు; జ్వరం, గ్యాస్ ఇబ్బంది ఉన్నప్పుడు దుంప రసాన్ని త్రాగిస్తారు, దెబ్బలకు దుంప పేస్టుని వ్రాస్తారు [7].
 • అరుణాచల్ ప్రదేశ్లో అపతానీ జాతి వారు దగ్గు, ఆస్తమా నుండి ఉపశమనం పొందేందుకు రాత్రి వేళ పడుకునే ముందు నల్ల పసుపు దుంపను తింటారు.[8].
 • ఛత్తీస్ గఢ్ -బస్తర్ ప్రాంతాల్లో వరిబీజాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రపరచి నల్లపసుపు పేస్టును వ్రాసి దానిపై తమలపాకులు కడతారు.[9]
 • తూర్పు అరుణాచల్ ప్రదేశ్ లోహిత్ జిల్లాలో ఖంటి గిరిజనులు పాము, తేలు కాట్లకు నల్ల పసుపు పేస్టును గాయానికి పూస్తారు లేదా దుంపల పొడిని నేలవేము (Andrographis Paniculata) గింజలతో నూరి కాటుపై పూస్తారు.[10]

ఔషధ గుణాలుసవరించు

పైల్స్, లెప్రసీ, బ్రాంకటైస్, అస్తమా, కాన్సర్, ఎయిడ్స్, మూర్ఛ, జ్వరాలు, పుండ్లు, సంతానలేమి, సెక్స్ సమస్యలు, మెన్సస్ డిజార్డర్లు, పంటి నొప్పి, వాంతులకు నల్ల పసుపు దుంప ఉపయోగపడుతుంది. అయితే ఆయుర్వేద వైద్యులను సంప్రదించకుండా నల్ల పసుపు దుంపను వాడరాదు.

సాగు, కోతసవరించు

నల్ల పసుపు సాగు, కోత, ఉడకబెట్టడం, ఎండబెట్టడం సాధారణ పసుపు (Curcuma longa) మాదిరిగానే ఉంటుంది. అయితే నల్ల పసుపును ఉడికించే సరికి లోపలి రంగు పోతుంది సాధారణ పసుపు రంగు వస్తుంది.

అపోహసవరించు

నల్లపసుపు దుంపల ఖరీదు కేజీ లక్షల రూపాయలని చాలామందిలో అపోహ ఉంది. కాని ఇంతవరకూ నల్ల పసుపు దుంపలను లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లు గాని, అమ్మినట్లు గాని దాఖలు లేవు.

మూలాలుసవరించు

 1. http://www.plantnames.unimelb.edu.au/Sorting/Curcuma.html
 2. http://www.sarnam.com/haldi.asp
 3. taxonomy of angiosperms By B.P. Pandey పేజీ. 464 [1]
 4. Indian Herbal Remedies By C. P. Khare పేజీ.175 [2]
 5. http://www.hindu.com/2008/08/07/stories/2008080758060300.htm హిందూలో ప్రచురించబడిన వ్యాసం.
 6. http://ecoport.org/ep?SearchType=earticleView&earticleId=943&page=-2
 7. http://nopr.niscair.res.in/bitstream/123456789/9372/1/IJTK%203(4)%20397-406.pdf
 8. http://nopr.niscair.res.in/bitstream/123456789/9769/1/IJTK%209(3)%20432-442.pdf
 9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-11. Retrieved 2012-04-17.
 10. http://nopr.niscair.res.in/bitstream/123456789/7881/1/NPR%206(4)%20334-340.pdf

సంబంధిత లింకులుసవరించు