హరి హర నాథ తత్వము

సా.శ13వ శతాబ్దంలో జీవించిన తిక్కన నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ది మహారాజు కొలువులో మంత్రిగా పనిచేసారు. నన్నయ రాయగా మిగిలిన మహాభారతంలోని విరాట పర్వం మొదలు స్వర్గారోహణ పర్వం దాకా పదిహేను పర్వాలు ఆంధ్రీకరణ చేసాడు.ఆ గ్రంథాన్ని హరిహరనాదుడికి అంకితం చేసి, శైవ వైష్ణవ మత సామరస్యానికి దోహదం చేసాడు.

హరిహరాద్వైత స్థాపన మార్చు

జగత్ కళ్యాణానికై శైవ వైష్ణవ స్పర్ధలను పోగొట్టడానికి హరిహరాద్వైత స్థాపన ద్వారా తిక్కన చేసిన కృషి ఆధ్యాత్మిక లోకానికి అభినవ మార్గాన్ని చూపింది. తిక్కన తన కవిత్వం ద్వారా సమాజంలో పాతుకుపోయిన శివకేశవ భేదాన్ని రుపుమాపాడు.

హరహర రూపము మార్చు

తిక్కన మహాభారత రచనకు శ్రీకారం చుట్టిన ఇష్ట దేవతా స్తుతి పద్యం-

శ్రీయన గౌరినాబరగు చెల్వకు జిత్తము పల్లవింప భ
ద్రాయిత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూ
పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్త జనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్ఠ సిద్ధికిన్

అని రాశాడు. ఇందులో పరతత్వం అనగా పరబ్రహ్మం. అది ఆకారంలేనిది. నిర్గుణం. అయినా హరిహరంబగు రూపము దాల్చింది.ఇది సాకారం.లోక కళ్యాణ మూర్తియై హరి హర రూపం పొందాడు.

హరిహరనాధుని రూపవర్ణన మార్చు

వక్ష స్థలంలో కౌస్తుభం, శిరసుపైన శశిరేఖ, నాభిలో పద్మం, కంఠంలో కాలకూటచ్చాయ, గంగాయమున సంగమం వాలే సితాసిత కాంతి పూరమైన తనువు.హరిహరనదునిలోని వామ భాగం హరిది. దక్షిణ భాగం హరునిది.అర్ధనారీశ్వరుని వలె సర్వేశ్వరుని రూపం హరిహరం.

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు