హర్జోత్ సింగ్ బైన్స్

హర్జోత్ సింగ్ బైన్స్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆనందపూర్ సాహిబ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2022లో భగవంత్ మాన్ మంత్రివర్గంలో న్యాయ, పర్యాటక శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[2]


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
21 మార్చి 2022
గవర్నరు బన్వారిలాల్ పురోహిత్

శాసనసభ్యుడు
పదవీ కాలం
16 మార్చి 2022 – ప్రస్తుతం
ముందు రానా కాన్వార్ పాల్
నియోజకవర్గం ఆనందపూర్ సాహిబ్

వ్యక్తిగత వివరాలు

జననం 1990 నవంబరు 15
ఆనందపూర్ సాహిబ్, పంజాబ్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
నివాసం గంభీర్ పూర్, ఆనందపూర్ సాహిబ్[1]
పూర్వ విద్యార్థి పంజాబ్ యూనివర్సిటీ
వృత్తి హైకోర్ట్ న్యాయవాది

రాజకీయ జీవితం

మార్చు

హర్జోత్ సింగ్ బైన్స్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సహ్నేవాల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తరువాత ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ యువజన విభాగం అధ్యక్షుడిగా పని చేశాడు.[3] హర్జోత్ సింగ్ బైన్స్ పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఆనందపూర్ సాహిబ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై భగవంత్ మాన్ మంత్రివర్గంలో న్యాయ, పర్యాటక శాఖ మంత్రిగా నియమితుడయ్యాడు.[4]

మూలాలు

మార్చు
  1. "For Harjot Singh Bains, Punjab assembly test is not as easy as 88% in Class 10 | assembly elections | punjab 2017". Hindustan Times. 16 January 2017. Retrieved 2018-12-06.
  2. The Indian Express (20 March 2022). "The playing 11: CM Bhagwant Mann's cabinet ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  3. The Indian Express (26 March 2016). "Nawa Punjab march: 'Writing on the wall, youth will script AAP's victory'" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  4. Tribune India (22 March 2022). "Punjab portfolios announced; CM Mann keeps Home and Vigilance, Cheema gets Finance, Singla Health, Harbhajan Power" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.