హవా 2019లో విడుదలైన తెలుగు సినిమా. ఫిలిం అండ్ రీల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించాడు. చైతన్య రావు, దివి ప్రసన్న హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 23 ఆగస్టు 2019లో విడుదలైంది.[1]

హవా
(2019 తెలుగు సినిమా)
దర్శకత్వం మహేష్ రెడ్డి
తారాగణం చైతన్య రావు, దివి ప్రసన్న
సంగీతం గిఫ్టన్ ఎలియాస్
ఛాయాగ్రహణం సంతోష్ షనమోంజ్
కూర్పు కార్తీక్ శ్రీనివాస్
నిర్మాణ సంస్థ ఫిలిం అండ్ రీల్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 23 ఆగస్టు 2019
నిడివి 104 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

చార్లీ (చైతన్య రావు) చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి జీవనం కోసం చిన్న చిన్న నేరాలు చేస్తూ పెరుగుతాడు. వీటితో విసిగిపోయిన చార్లీ ఏదైనా పెద్ద క్రైమ్ చేసి సెటిల్ అయిపోవాలని నిర్ణయించుకొని ఆస్ట్రేలియాలోని డార్క్ హార్స్ రైడింగ్ బెట్టింగ్ మాఫియాలోకి అడుగుపెడతాడు. కానీ అప్పటికే అక్కడ పాతుకుపోయి వున్న బిజిలీ భాయ్ (కమల్ కృష్ణ) అనే గ్యాంగ్ స్టార్ నుండి చార్లీకి ప్రాణహాని తలెత్తుతుంది. ఆ క్రిమినల్ గ్యాంగ్స్ బారి నుండి చార్లీ ఎలా తప్పించుకున్నాడు ? మరి చార్లీ తన కలలని నెరవేర్చుకున్నాడా ? లేదా ? అనేది మిగతా సినిమా కధ.[2][3]

నటీనటులుసవరించు

  • చైతన్య రావు
  • దివి ప్రసన్న
  • కమల్ కృష్ణ
  • సందీప్ పగడాల
  • శ్రీజిత్ గంగాధరన్
  • కమలేష్ కొక
  • సురేందర్ రెడ్డి కొంటాడి
  • రామ్ మిట్టకంటి
  • సత్య రెడ్డి
  • అలీ గుల్ ఖాన్
  • రాకేష్ చిట్టి
  • దేశ్ అగర్వాల్
  • భూమిక పటేల్
  • బాబీ ఆషిక
  • ఫర్హాన్
  • జో జోసెఫ్
  • అంజా మేయెర్
  • ఆల్వోన్ జూనియర్
  • విలియమ్ ట్రాన్

సాంకేతిక నిపుణులుసవరించు

  • నిర్మాత‌లు : ఫిలిం అండ్ రీల్ ప్రొడక్షన్స్
  • దర్శకత్వం : మహేష్ రెడ్డి
  • సంగీతం : గిఫ్టన్ ఎలియాస్
  • పాటలు= లక్ష్మి ప్రియాంక
  • సినిమాటోగ్రఫర్ : సంతోష్ షనమోంజ్
  • ఎడిటర్ : కార్తీక్ శ్రీనివాస్


మూలాలుసవరించు

  1. Book My Show (2019). "Hawaa (2019) - Movie | Reviews, Cast & Release Date in hyderabad - BookMyShow". in.bookmyshow.com. Archived from the original on 4 జూలై 2021. Retrieved 4 July 2021.
  2. Telugu Filmnagar (23 August 2019). "Hawaa Telugu Movie Review | Mahesh Reddy". Telugu Filmnagar. Archived from the original on 4 జూలై 2021. Retrieved 4 July 2021.
  3. V6 Velugu, V6 (23 August 2019). "హవా : మూవీ రివ్యూ" (in ఇంగ్లీష్). Archived from the original on 4 జూలై 2021. Retrieved 4 July 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=హవా&oldid=3258585" నుండి వెలికితీశారు