హవాయి పడమర పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపాల సమూహం. ఈ ద్వీప సమూహం ఆగస్టు 21, 1959న అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 50వ రాష్ట్రం అయ్యింది. ఈ ద్వీప సమూహం 21°18′41″ రేఖాంశం, 157°47′47″ అక్షాంశాలపై ఉంది. అమెరికా ప్రధాన భూభాగానికి హవాయి 3,700 కిలోమీటర్ల దూరంలో ఉంది. 19వ శతాబ్దంలో హవాయిని శాండ్విచ్ ద్వీపాలని కూడా వ్యవహరించేవారు.

హవాయి స్థానాన్ని చూపించే భౌగోళిక పటం
హవాయి మ్యాప్
దస్త్రం:Kauai04.jpg
"నా పాలి" తీరం, కౌవియా

భౌగోళిక పరిస్థితి మార్చు

భూగోళం అంతటికీ అత్యంత సుదీర్ఘమయిన ద్వీప సమూహం హవాయి. ఈ ద్వీప సమూహంలో ఎనిమిది ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీప సమూహం మొత్తం పొడవు 2400 కిలోమీటర్లు. కిలియా అగ్నిపర్వతపు లావా ప్రవాహాల వలన ఈ ద్వీపాల వైశాల్యం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఈస్టర్ ద్వీపాన్ని మినహాయిస్తే ప్రధాన భూభాగాలకు అత్యంత దూరంగా ఉన్న ద్వీపం ఇది. తనలోని ప్రత్యేక భౌగోళిక స్థితిగతుల వలన వైవిధ్యభరితమయిన వృక్ష, జీవజాతులకు హవాయి నెలవయ్యింది.

చరిత్ర మార్చు

ఇక్కడ లభ్యమయిన పురాతన వస్తువులనుండి ఈ ద్వీపాలలో మనుషులు 11వ శతాబ్దం నుండి నివాసమున్నరనడానికి ఆధారాలు లభిస్తున్నాయి. పోలినేషియన్ నాగరికతకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నివాసమున్నారనడానికి కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఐరోపా దేశస్థులకు ఈ ద్వీపాల గురించి 1778లో బ్రిటీషు నావికుడు జేమ్స్ కుక్ పర్యటనల వలన పరిచయం అయ్యింది. కానీ అంతకన్నా ముందరే స్పెయిన్ వారు ఇక్కడకు వచ్చారన్న వాదన ఉంది.

చిత్ర మాలిక మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=హవాయి&oldid=3426210" నుండి వెలికితీశారు