హవేలిఘన్‌పూర్ మండలం

తెలంగాణ, మెదక్ జిల్లా లోని మండలం

హవేలిఘన్‌పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2]. దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం మెదక్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం హవేలిఘన్‌పూర్.

హవేలిఘన్‌పూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, హవేలిఘన్‌పూర్ స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, హవేలిఘన్‌పూర్ స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, హవేలిఘన్‌పూర్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్ జిల్లా
మండల కేంద్రం హవేలిఘన్‌పూర్
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 187 km² (72.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 40,902
 - పురుషులు 19,818
 - స్త్రీలు 21,084
పిన్‌కోడ్ 502113

2016 లో ఏర్పడిన మండలం

మార్చు

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు హవేలిఘన్‌పూర్ గ్రామం, మెదక్ జిల్లా, మెదక్ మండలం, మెదక్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉండేది.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మెదక్ మండలం లోని 31 గ్రామాలలో 22 గ్రామాలను విడదీసి, హవేలిఘన్‌పూర్ గ్రామాన్ని (1+21) ఇరువది రెండు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా అదే జిల్లా, అదే రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

గణాంకాలు

మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 187 చ.కి.మీ. కాగా, జనాభా 40,902. జనాభాలో పురుషులు 19,818 కాగా, స్త్రీల సంఖ్య 21,084. మండలంలో 9,327 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. సర్ధానా
  2. రాజ్‌పేట్
  3. బూరుగుపల్లి
  4. నాగాపూర్
  5. తిమ్మాయిపల్లి
  6. అనంతసాగర్
  7. గంగాపూర్
  8. షమ్నాపూర్
  9. బ్యతోల్
  10. లింగాసన్‌పల్లి
  11. హవేలిఘన్‌పూర్
  12. శుక్లాపేట్
  13. తొగిట
  14. శాలిపేట్
  15. బొగడ భూపతిపూర్
  16. ఫరీద్‌పూర్
  17. ముత్తాయిపల్లి
  18. కూచన్‌పల్లి
  19. సేరికూచన్‌పల్లి
  20. ముదుల్‌వాయి
  21. ఔరంగాబాద్

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

మార్చు