హసంత ఫెర్నాండో

శ్రీలంకకు చెందిన మాజీ క్రికెటర్

కందగే హసంత రువాన్ కుమార ఫెర్నాండో, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెటర్. రెండు టెస్ట్ మ్యాచ్‌లు, 7 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు. మొరటువాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కళాశాలలో చదువుకున్నాడు.[1]

హసంత ఫెర్నాండో
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కందగే హసంత రువాన్ కుమార ఫెర్నాండో
పుట్టిన తేదీ (1979-10-14) 1979 అక్టోబరు 14 (వయసు 45)
పాణదుర, శ్రీలంక
ఎత్తు5 అ. 10 అం. (178 cమీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 93)2002 నవంబరు 8 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2002 నవంబరు 15 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 110)2002 ఆగస్టు 4 - బంగ్లాదేశ్ తో
చివరి వన్‌డే2006 ఫిబ్రవరి 22 - బంగ్లాదేశ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే
మ్యాచ్‌లు 2 7
చేసిన పరుగులు 38 43
బ్యాటింగు సగటు 9.50 21.50
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 24 23*
వేసిన బంతులు 234 234
వికెట్లు 4 6
బౌలింగు సగటు 27.00 26.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/63 3/12
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 1/–
మూలం: Cricinfo, 2017 ఫిబ్రవరి 23

కందగే హసంత రువాన్ కుమార ఫెర్నాండో 1979, అక్టోబరు 14న శ్రీలంకలోని పాణదురలో జన్మించాడు.

దేశీయ క్రికెట్

మార్చు

2004 ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ 20 టోర్నమెంట్‌లో చిలావ్ మేరియన్స్ క్రికెట్ క్లబ్ తరపున ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[2] 2006లో వైట్‌హేవెన్ క్రికెట్ క్లబ్‌లో ప్రొఫెషనల్‌గా ఉన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

సెబాస్టియనైట్స్ క్రికెట్, అథ్లెటిక్ క్లబ్‌తో గడిపిన ఒక ఫస్ట్-క్లాస్ సీజన్ తర్వాత మూడు సెంచరీలతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. 2003 క్రికెట్ ప్రపంచ కప్‌కు ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌పై తన వన్డే అరంగేట్రం చేసి, అక్కడ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు.

మూలాలు

మార్చు
  1. "Hasantha Fernando". ESPNcricinfo. Retrieved 2023-08-16.
  2. "1st Round, Colombo, Aug 17 2004, Twenty-20 Tournament". ESPN Cricinfo. Retrieved 2023-08-16.

బాహ్య లింకులు

మార్చు