హాజరా

(హాజిరా నుండి దారిమార్పు చెందింది)


హాజరా : ఇస్మాయీల్ తల్లి. ఇబ్రాహీం భార్య. ఇబ్రాహీం ఇష్మాయిల్ హాజరా లను ఎడారిలో వదిలేస్తాడు. అల్లాహ్ హాజరా (హాగరు) ప్రార్థన విని నీళ్ళ ఊటను పుట్టిస్తాడు. అదే జమ్ జమ్ బావి గా స్థిరపడింది. ఈమె సంతానం నుండే అరబ్బులు మహమ్మదు ప్రవక్త జన్మించారు. క్రైస్తవులు ఈమెను హాగరు అంటారు. ఇబ్రాహీం పెద్దభార్య సారాహ్ గొడ్రాలు అయ్యి పిల్లలు కలగకపోతే ఈమెతో పిల్లల్ల్ని కనమని అబ్రాహాం ను కోరుతుంది. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన జేష్ఠ పుత్రుడైన ఇస్మాయీల్ ను, సతీమణి అయిన హజ్రత్ హాజిరా అలైహిస్సలాం ను కాబా ఎగువ భాగాన వదలివెళ్లిన తర్వాత ఉన్న ఆ కాసిన్ని ఖర్జూరాలు, నీళ్ళూ అయిపోయాయి. ఏ ప్రాణి నివసించని ఆ రాతి నేలలో తీవ్రమయిన దాహంతో నాలుక పీక్కుపోయింది. చివరికి పసికందుని తాపించేందుకు పాలు కూడా లేకుండా ఇంకిపోయాయి. ఏం చేయాలో, ఎలా దాహం తీర్చుకోవాలో, ఏ విధంగా బాలుడ్ని రక్షించుకోవాలో తోచని అయోమయ స్థితిలో పడిఉన్నారు హజ్రత్ హాజిరా అలైహిస్సలాం.


అయినా తాను నిరాశ చెందలేదు. నిస్పృహకు లోనవ్వలేదు. తమ వంతు కృషి ప్రారంభించారు. ఒకసారి సఫా కొండపైకి ఎక్కి చూస్తే, మరోసారి మర్వా కొండపైకెక్కి ‘నీళ్ళు లభించే మార్గం దొరక్కపోతుందా!’ అని ఎదురు చూపులు చూస్తున్నారు. ఇలా సఫా నుండి మర్వా వరకు, మర్వా నుండి సఫా వరకు ఏడు సార్లు దౌడు తీశారు హజ్రత్ హాజిరా అలైహిస్సలాం చివరికి మర్వా కొండపై ఉండగా ఏదో అలికిడి ...! ఏమై ఉంటుందా...!! అని బాల ఇస్మాయీల్ వద్దకు చేరుకున్నారు. పసికందు మండుటెండల్లో భరించలేని ఆకలితో అల్లాడిపోతున్నాడు పాపం! అప్పుడే దైవదూత ప్రత్యక్షమై తన రెక్కలతో నేలలో రాజేయంగా చుక్క నీరు కూడా లభ్యం కాని ఆ నల్లరాతి నేల నుండి జలనిధి పెల్లుబికింది. హజ్రత్ హాజిరా అలైహిస్సలాం గారు ముందు బాల ఇస్మాయీల్ దాహాన్ని తీర్చి తర్వాత తానూ దాహం తీర్చుకున్నారు. తన అన్వేషణ ఫలించినందుకు, తన శ్రమకు మించిన వరాన్ని అల్లాహ్ అనుగ్రహించినందుకు దైవానికి మనసారా కృతజ్ఞతాభివందనలు తెలుపుకున్నారు.


జమ్ జమ్ పేరు ఎలా పడింది?

ఆ పిదప పారే ఆ జలనిధిని చూసి “ఇది ఇలానే పారుతూ ఉంటే అతి తొందరగా అంతమైపోతుంద”ని భావించి, దాని చుట్టూ మట్టితో గట్టు వేస్తూ ఈ జలనిధిని ఎలాగైనా కాపాడుకోవాలన్న తీవ్ర తపనతో ఆమె నోట అప్రయత్నంగా వెలువడిన అమృత వాక్కు ‘జమ్ జమ్’ (అంటే అప్పటి భాషలో ఆగిపో, ఆగిపో అని అర్ధం). ఆ చిన్నపాటి గట్టులో ఆ మహత్తర జలనిధిని ఆపే శక్తి లేకపోయినా ఆమె నోట అపూర్వ విశ్వాసంతో వెలువడిన పలుకు మహిమతో ఆ జలం జలనిధిగా ఓ చోట నిలిచిపోయింది. అదే జమ్ జమ్ బావిగా ప్రసిద్ధి చెందింది.


ఓ సందర్భాన దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ ఇస్మాయీల్ తల్లిని కరుణించుగాక! ఆమె గనక ఈ జలనిధికి గట్టు వేసి ఆపి ఉండకపోతే ప్రళయం వరకూ జమ్ జమ్ జలం పారే సెలయేరయ్యేది.”


జమ్ జమ్ జల నిధి

జమ్ జమ్ బావి స్వర్గపు సెలయేర్లలోని ఓ సెలయేరు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కా కోసం చేసిన దుఆ తర్వాత అల్లాహ్ అనుగ్రహించి ప్రసాదించిన తొలి బహుమతి ఈ జలం. మక్కా అంతటి పవిత్ర నగరం ఉనికిలోకి రావడానికి, జనవాహినితో, దైవదాసుల రాకపోకలతో అలరారడానికి కారణమయ్యింది ఈ మహత్తర జలం. కొన్ని వేల సంవత్సరాలుగా లభ్యమవుతున్న అల్లాహ్ ఏకైక మహిమ ఈ జలం. ఇహలోకంలో దైవ సూచనల్లోని ఓ సూచన ఈ జలం. ఇక్కడికి వచ్చే ప్రతీ యాచకుడు, ప్రతీ బాటసారి తనివితీరా సేవించే అద్భుత ద్రవం ఈ జలం. ఇంతటి మధురమైన నీరు లోకంలో మరో చోట లేదు. ఈ నీటిలో గొప్ప శుభం ఉంది. అది త్రాగే ప్రతీ వారికి ప్రాప్తమవుతుంది. పరిశుద్ధాత్మ అయిన దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా ఉనికిలోకి వచ్చిన అనంత జల సంపద ఈ జమ్ జమ్. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వారి హృదయం పలుమార్లు ఈ పవిత్ర జలంతో కడగబడింది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం నుండి అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం వరకు వచ్చిన ప్రవక్తలందరూ త్రాగాలని తహతహలాడిన జలం జమ్ జమ్. ఏ జలానికీ లేని ప్రత్యేకత ఈ జలానికి ఏమిటంటే – ఇది ఆకలి గొన్న వ్యక్తి ఆకలిని తీరుస్తుంది, రోగాన్ని నయం చేస్తుంది, తలనొప్పి, కడుపునొప్పికి ఇది దివ్య ఔషధం. ఈ జలం వల్ల కoటి చూపు మెరుగవుతుంది. అందుకే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ప్రవచించారు: “మావు జమ్ జమ్ లిమా షరిబ లహూ” (ఏ సదుద్దేశంతో జమ్ జమ్ త్రాగుతారో వారి ఆ ఉద్దేశం సిద్ధిస్తుంది).


జమ్ జమ్ విశేషాలు

ఈ జలాన్ని కడుపు నిండా త్రాగటం విశ్వాసానికి చిహ్నం. కాపట్యానికి విరుగుడు. ఇది పుణ్యాత్ముల కోసం మహోన్నత పానీయం. బంధు మిత్రుల కోసం గొప్ప బహుమానం. అతిథుల అతిథ్యం కోసం అద్వితీయ ద్రవ పదార్థం. శరీరానికి శక్తినీ, హాయినీ ఇచ్చే అద్భుత వరప్రసాదం. ఎంత వాడినా అది తరగదు. దాదాపు నాలుగు వేల సంవత్సరాల నుండి ఈ జలం ఇలానే నిర్విరామంగా పెల్లుబుకుతూనే ఉంది. ప్రస్తుతం యావత్ ప్రపంచంలో అతి ప్రాచీనమైన బావి ఇదేనన్న నానుడీ ఉంది.


జమ్ జమ్ సేవించే సున్నత్ విధానం

జమ్ జమ్ జలాన్ని సేవించే సున్నత్ విధానం; ఈ జలాన్ని కుడి చేత్తో బిస్మిల్లాహ్ అని త్రాగాలి. ఈ శుభప్రదమైన జలాన్ని నిలబడి త్రాగటం ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వారి సంప్రదాయం. తనివితీరా ఈ జలాన్ని త్రాగాలి. త్రాగే ముందు మంచి సంకల్పం చేసుకొని మరీ త్రాగాలి. త్రాగిన తరువాత కృతజ్ఞతగా ‘అల్ హందులిల్లాహ్’ అనాలి. ఈ జలాన్ని కనీసం మూడు శ్వాసల్లో త్రాగాలి. ఈ జలాన్ని సేవించిన పిదప ఇహపరాల సాఫల్యం, సౌభాగ్యం, శుభం కోసం దుఆ చేయాలి. ఆ సమయంలో చేసే ఏ మంచి దుఆ అయినా స్వికరించబడుతుంది.


జమ్ జమ్ జలం త్రాగే ఓ సౌభాగ్యవంతుడా!

శుభాకాంక్షలు!!

"https://te.wikipedia.org/w/index.php?title=హాజరా&oldid=2951735" నుండి వెలికితీశారు