సారాహ్ : ప్రవక్త ఇబ్రాహీం భార్య ఇస్ హాక్ (ఇస్సాకు) తల్లి. ఇబ్రాహీంను ఇస్మాయీల్, హాజరా లను ఎడారిలో వదిలేసి రమ్మని చెబుతుంది. ఈమె సంతానం నుండే యూదులు ఏసుక్రీస్తు జన్మించారు. ముస్లిములు ఈమెను సారాహ్ అంటారు. ఈమె మొదట గొడ్రాలు అయ్యి పిల్లలు కలగకపోతే తన దాసి అయిన హాజరాను ఇబ్రాహీంతో పెళ్ళాడమని కోరి, ఇబ్రాహీం వంశాన్ని కనమని కోరుతుంది.

ఇబ్రాహీం మస్జిద్ లో సారాహ్ సమాధి.

సారా మొదటి పేరు సారయి (అనగా రాజకుమారి లేదా తగాదాకోరు). సారయి పేరు సారాగా మారినది. సారయి పేరుకి పరిపాలకురాలు, రాణి అని అర్థం. బైబిల్ ప్రకారం ప్రభుఫు ఆమెను దీవించి ఆమె నుండి అనేక జాతులను, రాజులను ఉధ్భవించేలా చేశారు. అబ్రహాము బహు జాతులకు తండ్రి. అయితే సారా బహుజాతులకు, రాజులకు జన్మనిచ్చింది. ఈ కోవలోనే మెస్సయ్యా పుట్టారు.

కుటుంబ నేపథ్యం, జీవితం

మార్చు

సారా జన్మస్తలం కల్దీయుల నగరం. ఉన్నత కుటుంబంలో తెరాకు జన్మించారు, అబ్రహాముకి చెల్లెలు. తన భర్త కంటే సారా 10 సంవత్సరాలు చిన్నది. సారా అందగత్తె, ఆమెకు అన్ని సంపదలు ఉన్నా, సంతానం కలుగలేదు. గొడ్రాలుగా చాలా బాధను అనుభవించింది. కానీ, ఆమెకు వయస్సు మల్లిననూ దేవుడు కరుణించి సంతానం కలిగించారు. 90 వ యేట సారాకు ఈసాకు పుట్టినందుకు సంతోష పడింది.

ఇవీ చూడండి

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సారాహ్&oldid=2951691" నుండి వెలికితీశారు