హార్డా జంట రైలు ప్రమాదాలు

Harda twin train derailment
పటం
వివరాలు
తేదీ
4 ఆగష్టు 2015, 23:30 IST
స్థానంకురావన్ దగ్గర, హార్డా జిల్లా, మధ్య ప్రదేశ్, భారత దేశము
భౌగోళికాంశాలు22°13′24″N 76°55′50″E / 22.22320°N 76.93053°E / 22.22320; 76.93053
దేశంIndia
రైలు మర్గముఖాండ్వా - ఇటార్సీ రైలు మార్గము
ఆపరేటర్భారతీయ రైల్వేలు
ప్రమాద రకంపట్టాలు తప్పింది
కారణంట్రాక్ బెడ్ కొట్టుకు పోయింది
గణాంకాలు
రైళ్ళురెండు
మరణాలు31
గాయపడినవారు~100
2015 ఆగష్టు 4 న, రెండు ప్రయాణీకుల రైళ్లు; ముంబై నుంచి వారణాసి వెళుతున్న కామయాని ఎక్స్‌ప్రెస్‌కు చెందిన చివరి ఐదు బోగీలు రాత్రి 11.45 గంటలకు వంతెనపై పట్టాలు తప్పి మాచక్ నదిలో పడిపోయాయి, ఇదే సమయంలో జబల్‌పూర్‌నుంచి ముంబై వెళుతున్న జనతా ఎక్స్‌ప్రెస్ ఇంజిన్, బోగీలు కూడా ఇదే ప్రాంతంలో పట్టాలు తప్పాయి. మధ్యప్రదేశ్ లోని హర్దాకు 20 కిలోమీటర్ల (20 మైళ్ళు) దూరంలో కురావన్, బృంగి రైల్వే స్టేషన్ల సమీపంలో రైళ్ళు పట్టాలు తప్పాయి. కనీసం 31 మంది మరణించారు, 100 మంది గాయపడ్డారని ప్రాథమిక అంచానా. [1][2]

ప్రమాదం

మార్చు

కామయాని ఎక్స్‌ప్రెస్‌, వారణాసికి వెళుతున్న రైలు డౌన్ లైన్‌లోకి వచ్చింది, మాచక్ నదికి సమీపంలో ఉన్న ఒక కల్వర్టు వరదలుతో (కమెన్ తీవ్ర తుఫాను కారణంగా) నీట మునిగింది, దీని వలన ట్రాక్ ఎలైన్‌మెంట్ తప్పుగా మారిపోయింది. ఈ పరిస్థితిలో కొన్ని కోచ్‌లు నదిలో మునిగిపోయాయి, కొన్ని భోగీలు అప్ లైన్ మార్గాన్ని అడ్డుకోవడం జరిగింది. ఇదే ప్రాంతం దగ్గరలోనే జనతా ఎక్స్‌ప్రెస్‌ కూడా పట్టాలు తప్పింది. కనీసం 31 మంది మరణించారు, 100 మంది గాయపడ్డారు. నదిలో కొందరు ప్రయాణీకులు కొట్టుకుపోయారు. స్థానికులు కాపాడినా, చాలా మంది కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. [3][4][5][6] కామయాని ఎక్స్‌ప్రెస్‌ ఇంజన్‌తో పాటుగా దాని యొక్క ఆరు కోచ్‌లు ప్లస్ జనతా ఎక్స్‌ప్రెస్‌ యొక్క నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి.[7] మొదటి రైలు పట్టాలు తప్పడానికి ముందు పది నిమిషాల ముందు రైలు సురక్షితంగా వంతెనను దాటింది. నిమిషాల వ్యవధిలో నదీ స్థాయి అసాధారణంగా అధికం కావడం, వరదలు క్రమంగా ట్రాక్‌ను విధ్వంసం చేయడం, ఫలితంగా ట్రాక్ మునిగిపోవడం జరిగి పోయాయి. జనతా ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్ బ్రేక్లను వేసి రైలును ఆపేందుకు ప్రయత్నం చేసాడు, కాని రైలు మాత్రం పట్టాలు తప్పింది. [7][8]

సహాయం

మార్చు

సహాయకులు రాత్రంతా గాయపడిన వారిని రక్షించటం, మృతదేహాల కోసం శోధించటం చేసారు. 300 మందికి పైగా ప్రజలు రక్షించబడ్డారు. ఘటన గురించి తెలిసిన వెంటనే వైద్యులు, సహాయ సిబ్బందితో కూడిన ప్రత్యేక రైలు ఘటనా స్థలానికి బయల్దేరింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన రెస్క్యూ జట్ల రావడం కొంత ఆలస్యం అయ్యింది. అతికష్టం మీద ఘటనా స్థలానికి చేరుకున్న సహాయ సిబ్బంది హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో స్థానిక నివాసితులు ప్రారంభంలో సహాయపడ్డారు. [9] ఆగష్టు 5 ఉదయం కల్లా, ప్రమాదంలో పాడైపోయిన రెండు రైళ్ళు తొలగించబడ్డాయి, చనిపోయిన వారి శరీరాలను స్వాధీనం చేసుకున్నారు. చీకటి, వర్షపునీటి కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అయితే సాధ్యమైనంత స్థాయిలో సహాయ చర్యలు అందించేందుకు ఆదేశించానని, మరో మూడు ప్రత్యేక రైళ్లు కూడా ఘటనా స్థలానికి బయల్దేరాయని రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు తన ట్విటర్‌లో పేర్కొన్నాడు. [10]ముంబై, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ల నుండి ప్రయాణించే 25 రైళ్ళు నిలిపివేయబడ్డాయి, దారి మళ్ళించ బడ్డాయి. ముఖ్యంగా పొరుగున ఉన్న రాజస్థాన్ నుండి వెళ్లిపోయాయి లేదా మళ్లించబడ్డాయి. [9]

ఇన్వెస్టిగేషన్

మార్చు

సెంట్రల్ రైల్వే జోన్ లోని రైల్వే భద్రతా కమిషనర్ ప్రమాదం గురించి విచారణను ప్రారంభించాడు. [11]

ఇవికూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "29 killed in Harda twin train derailment". The Hindu. Archived from the original on 2019-11-10. Retrieved 2018-05-09.
  2. "Kamayani and Janata Express train accidents". IBN. Archived from the original on 2016-03-04. Retrieved 2018-05-09.
  3. "20 dead after MP twin train derailment". Hindustan Times. Archived from the original on 2015-09-07. Retrieved 2018-05-09.
  4. "India train crash: multiple deaths as two express services derail at bridge". the Guardian. Retrieved 5 August 2015.
  5. "Indian trains derailed by flash flood in Madhya Pradesh – BBC News". Retrieved 5 August 2015.
  6. "Sudden flash flood may have caused accident". Hindustan Times. Archived from the original on 2015-09-07. Retrieved 2018-05-09.
  7. 7.0 7.1 "Washout of Track Led to Derailment of Two Trains: Railway Minister Suresh Prabhu". Retrieved 5 August 2015.
  8. "Suresh Prabhu calls Harda derailment a natural calamity; officials feel warning signs ignored". Archived from the original on 13 సెప్టెంబరు 2016. Retrieved 5 August 2015.
  9. 9.0 9.1 "Dozens Still Missing In Harda Train Tragedy, 300 Rescued". Retrieved 5 August 2015.
  10. "Indian trains in deadly derailment in Madhya Pradesh". BBC News. Retrieved 5 August 2015.
  11. "Flooding of tracks caused derailment, says A K Mittal, Chairman, Railway Boa". The Indian Express. Retrieved 5 August 2015.