జోక్, కామెడీ, సంతోషకరమైన స్థితి వంటివి లేకుండా శారీరక కదలికల ద్వారా నవ్వడం అనే ప్రక్రియే హాస్య యోగా.[1]

చేయు పద్దతిసవరించు

ఈ ప్రక్రియ మానసిక ఒత్తిడి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. సహజంగా కానీ, కృత్రిమంగా కానీ, నటించడం ద్వారా కానీ - ఏ విధంగా నవ్వినా మానవ మెదడు తేడా పసిగట్టదు, ఎలా నవ్వినా మెదడు ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఈ ఎండార్ఫిన్లు ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ కలిగిస్తాయి. ఈ పరిశోధన ఫలితాల ఆధారంగా 1995లో ముంబైకి చెందిన వైద్యుడు మదన్ కటారియా హాస్య యోగా ప్రక్రియను రూపొందించారు.[2] వాణిజ్యపరమైన ప్రచారం లేకుండానే 100 దేశాలకు పైగా ఈ ప్రక్రియ విస్తరించింది. లాఫింగ్ క్లబ్ లు, హాస్య యోగా శిక్షకులు హాస్య యోగాను మరింత ప్రాచుర్యంలోకి తీసుకువస్తున్నారు.

మూలాలుసవరించు

  1. హాస్య యోగా చేయి బాగా - సాక్షి పత్రిక వ్యాసం
  2. కటారియా, మదన్ (2002). లాఫ్ ఫర్ నో రీజన్ (in ఆంగ్లం). ముంబై: మాధురీ ఇంటర్నేషనల్. ISBN 978-81-87529-01-9.{{cite book}}: CS1 maint: unrecognized language (link)