హింగోలి జిల్లా
మహారాష్ట్ర లోని జిల్లా
హింగోలీ (हिंगोली), మహారాష్ట్రలో ఒక జిల్లా. ఈ జిల్లా పాలనాకేంద్రం హింగోలీ పట్టణం. జిల్లా వైశాల్యం4,526 చ.కి.మీ. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 9,87,160. అందులో పట్టణ నగరవాసులు 15.60%. [1]. ప్రస్తుతం హింగోలి జిల్లా పరిధిలో ఉన్న ప్రాతం 1956లో బొంబాయి రాష్ట్రంలో భాగమైనది. 1960లో మహారాష్ట్ర రాష్ట్రంలో పర్భణీ జిల్లాలో భాగంగా ఉంది. 1999, మే 1న పర్భణీ జిల్లా నుండి హింగోలి జిల్లాను ఏర్పాటుచేశారు.
హింగోలీ జిల్లా
हिंगोली जिल्हा | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | ఔరంగాబాదు డివిజన్ |
ముఖ్య పట్టణం | హింగోలీ |
మండలాలు | 1. హింగోలీ, 2. కాలమ్నూరి, 3. సేన్‌గావ్, 4. ఔందా, 5. బాస్మత్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | హింగోలీ |
• శాసనసభ నియోజకవర్గాలు | 3 |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,526 కి.మీ2 (1,747 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 9,87,160 |
• జనసాంద్రత | 220/కి.మీ2 (560/చ. మై.) |
• Urban | 15.60 |
Website | అధికారిక జాలస్థలి |
జిల్లాను రెండు ఉప డివిజన్లు, మొత్తం ఐదు తాలూకాలుగా వ్యవస్థీకరించారు. హింగోలి సబ్ డివిజన్లో హింగోలి, కాలమ్నూరి, సేన్‌గావ్ తాలూకాలున్నాయి. అలాగే, బాస్మత్ సబ్ డివిజన్లో ఔందా, బాస్మత్ తాలూకాలున్నాయి. జిల్లాలో మూడు విధానసభా నియోజకవర్గాలున్నాయి. అవి బాస్మత్, కాలమ్నూరి, హింగోలి. ఈ మూడు నియోజకవర్గాలు హింగోలి లోక్‌సభ నియోజకవర్గంలో భాగమై ఉన్నాయి.[1]
ఇతర విశేషాలు
మార్చు- జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగనాధ లింగం హింగోలీ జిల్లాలో ఉంది.
మూలాలు
మార్చు- ↑ "Districtwise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 2010-03-18. Retrieved 2009-03-24.
బయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో Hingoli districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.