హిందు ఇతర మత బేధాలు

హిందూ మతము, ఇస్లాం, క్రైస్తవ మతము అనే మూడు మతాల మధ్యనున్న కొన్ని ప్రధాన భేదాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

ముఖ్య భేదాలు మార్చు

విషయంహైందవంక్రైస్తవంఇస్లాం
* పుట్టుక:ఇది చాలా కాలం నుంచీ ఉన్న ధర్మం కాబట్టే దీనిని సనాతన ధర్మం అని అంటారు. దీనిని ఒక ప్రత్యేక వ్యక్తి స్థాపించిన దాఖలాలు ఏవీ లేవు. అన్నింటికంటే ప్రాచీనమైన ఋగ్వేదం శాతవాహణ శక పూ . 1500 కాలానికి ఇప్పటి రూపుదిద్దుకొన్నదని కొందరు పరిశోధకుల అంచనా [1]. .ఈ మతం ప్రవక్త యేసు క్రీస్తు పేరు మీదుగా స్థాపించబడింది.ఈ మతం ప్రవక్త మహమ్మద్ చే స్థాపించబడింది
* మూలం:నాలుగు వేదాలు దీని మూలం. వేదం అంటే తెలుసుకోతగింది. అందుకే ఈ మతాన్ని వైదిక మతం అని పిలవాలి. ఈ వేదాల సారమే గీత, ఇది భగవానుడు కృష్ణుడిచే చెప్పబడింది కాబట్టి దీనిని భగవద్గీత అని అంటారు. ఇదే హిందువుల పవిత్ర గ్రంథం. ఇవి కాకుండా హిందువులకి 18 పురాణాలు, వేదాలకి భాష్యాలైన ఉపనిషత్తులు ఉన్నాయి. బైబిల్ మూలగ్రంథం. ఇది కొన్ని గ్రంథాల సమాహారం. దీనిలో క్రొత్త, పాత అని రెండు విభాగాలు ఉన్నాయి. ఇందులో క్రొత్త నిబంధనక్రీస్తు కాలానికి చెందినది. (సా.శ.. మొదటి శతాబ్ది) ఖురాన్ మూలగ్రంథం. ఇది మహమ్మద్ ప్రవక్తచేత వెలువరించబడింది. మహమ్మదు ప్రవక్తకు ఖురాన్ దివ్య సందేశం వెల్లడి అయిన కాలం సా.శ.. 610 నుండి మొదలయ్యింది.
* విగ్రహారాధన:ఈ మతంలో భగవంతున్ని సగుణ రూపంలోనూ (ఆకారంతో), నిర్గుణ రూపంలోనూ (నిరాకారం) పూజిస్తారు. మనిషికి ఆకారం ఉంది కనుక భగవంతున్ని ఆకారంలో పూజించటం సులువు. భక్తులు విగ్రహం ద్వారా భగవంతున్ని పూజిస్తారు కాని విగ్రహాన్ని కాదు. భారతదేశంలో ఉన్న ఆలయాలలో చాలా వరకు విగ్రహాలు వెలిసినవి లేదా ఋషులచే ప్రతిష్ఠింపబడినవని ప్రగఢ విశ్వాశం. ఈ విగ్రహాలు ఆయా దేవతల నిజస్వరూపాలని బట్టి ఉంటాయి తప్ప వూహాజనితం కావు.

ఉదాహరణకి చిదంబరంలోని ఆలయంలో ఈశ్వరుణ్ణి వ్యక్తిగా, లింగ రూపంలో, అవ్యక్త రూపంలో పూజిస్తారు.

కొంతమంది క్రీస్తు, మేరీ మాత విగ్రహాలను పూజిస్తారు. కొంతమంది విగ్రహారాధన చేయరుముస్లింలు సంపూర్ణంగా విగ్రహారాధనకు వ్యతిరేకం, సమాధులను అరాదిస్తారు ఇదికూడ ఒక రకంగా విగ్రహరాదనే
* ఆత్మ:మనం మన శరీరం కాదు, ఈ శరీరం కేవలం ఒక వస్త్రం లాంటిది. ఆత్మకి చావు లేదు, పుట్టుక కూడా లేదు. ఒక వస్త్రం వదిలి ఇంకొక వస్త్రం వేసుకున్నట్టే, ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ గురించి భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో బాగా విశదీకరించాడు. ఆత్మ కొత్త శరీరం ద్వారా లోకానికి తిరిగి రావడమే పునర్జన్మ అంటారు.

గీతలో ఇలా చెప్పబడింది.[2] ఒక వస్త్రం పాడవగానే ఇంకొక వస్త్రం ఎలా ధరిస్తామో అలాగే జీవుడు ఒక శరీరం పాడవగానే ఇంకొక శరీరం ధరిస్తాడు
.[3] పుట్టిన వాడు మరణించక తప్పదు అలాగే మరణించినవాడు తిరిగి జన్మించకా తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి చింతించుట అనవసరం.

ఆత్మ అనే వాడుక ఉంది కాని అది పుట్టుక మరణం లేనిదని నమ్మరు. అలాగే పునర్జన్మని కూడా నమ్మరు.ఆత్మ అనే వాడుక ఉంది కాని అది పుట్టుక మరణం లేనిదని నమ్మరు. అలాగే పునర్జన్మని కూడా నమ్మరు.
* మోక్షం:పునర్జన్మ లేకుండా భగవంతునిలో ఐక్యం కావడమే మోక్షం. ఇదే మనిషి యొక్క పరమ లక్ష్యమని భగవద్గీతలో చెప్పబడంది.ఇలాంటిదేమీ లేదుఇలాంటిదేమీ లేదు
* స్వర్గం:మనిషి చేసిన మంచి పనులకు స్వర్గంలో సుఖాలని అనుభవిస్తాడు, అనుభవించిన తరువాత మరల జన్మిస్తాడు. స్వరానికి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు అనేది పదవి పేరు, ప్రతి మన్వంతరానికి కొత్త ఇంద్రుడు నియమంచబడతాడు. ఉదాహరణకి వామనుని అవతారంలో పాతాళానికి తొక్కబడిన బలి చక్రవర్తి తరువాతి మన్వంతరంలో ఇంద్రుడిగా ఉంటాడని విష్ణువు వరం ఇస్తాడు. ఇది భాగవతంలో ఉంది. స్వర్గంలో భగవంతుడుటాడని నమ్ముతారు, దేవతలు (ఏంజల్స్) ఉంటారని నమ్ముతారు.స్వర్గంలో భగవంతుడుటాడని నమ్ముతారు, దేవతలు (ఏంజల్స్) ఉంటారని నమ్ముతారు.
* నరకం:జీవి చేసిన చెడ్డ పనులకు నరకంలో ఇంకొక దేహం ద్వారా కష్టాలని అనుభవిస్తాడు, అనుభవించిన తరువాత మరల ఏదో ఒక రూపంలో మరల జన్మిస్తాడు. నరకానికి అధిపతి యముడు. ఇతడు సూర్యుని కుమారుడు. నరకం కూడా భగవంతుని ఆజ్ఞ ప్రకారమే సృష్టించబడింది, నడుపబడుతుంది. పాపులంతా నరకానికి వెళ్తారు. షైతానుతో పాటు వాడిని వెంబడించిన దూతలు కూడా నరకంలో యుగయుగాల పాటు శిక్ష అనుభవిస్తారు. నరకం మీద పూర్తి అధికారం ఉన్నవాడు యెహోవా దేవుడే.పాపులంతా నరకానికి వెళ్తారు కాని నరకం షైతాను అధినంలో ఉంటుంది, నరకం షైతాను ఆజ్ఞ ప్రకారం నడువబడుతుంది.
* త్రిమూర్తి/త్రిశక్తి తత్వం:భగవంతుని మూడు తత్వాలైన సృష్టి, స్థ్తితి, లయ రూపాలుగా బ్రహ్మ, విష్ణు, శంకరుణ్ణి పూజిస్తారు.అలాగే భగవంతుని శక్తి రూపాలుగా సరస్వతి, లక్ష్మి, పార్వతిలను పూజిస్తారుకొంత మంది సర్వసృష్టి కర్త యైన దేవుడు లేదా యెహోవా, క్రీస్తు, పవిత్రాత్మలను త్రితత్వంగా భావిస్తారు. కొంత మంది నమ్మరు. త్రితత్వాన్ని నమ్మరు. ఒక్కడే భగవంతుడని నమ్ముతారు.

ఇవి కూడచూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Oberlies (1998:155) gives an estimate of 1100 BC for the youngest hymns in book 10. Estimates for a terminus post quem of the earliest hymns are far more uncertain. Oberlies (p. 158) based on 'cumulative evidence' sets wide range of 1700–1100
  2. వాసాంసి జీర్ణాణి యధా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని
    తధా శరీరాయ విహాయ జీర్ణాని నవ్యాని సంయాతి నవాని దేహి
  3. జాతస్య హి ధ్రువో మ్రత్యు: ధ్రువం జన్మ మృతస్యచ తస్మాత్ పరిహార్యార్ధే న త్వం శోచితు మర్హసి

వనరులు మార్చు

బయటి లింకులు మార్చు