హిందూ కేలండర్
హిందూ కేలండర్ (ఆంగ్లం : Hindu calendar), ప్రాచీన కాలంలో సర్వసాధారణంగా ఉపయోగించబడిన కేలండర్. రానురాను అనేక మార్పులకు లోనై, ప్రస్తుత కేలండర్ రూపుదాల్చింది. భారత జాతీయ కేలండర్గా గుర్తింపు పొందినది. భారత్ లో అనేక ప్రాంతీయ కేలండర్లు వాడుకలో ఉన్నాయి.
చరిత్రసవరించు
ఈ కేలండర్లలో అనేకం వేదాంగ జ్యోతిష్యం నుండి సంగ్రహించబడినవి. క్రీ.పూ. 3వ శతాబ్దంలో సూర్య సిద్ధాంతం నుండి స్థిరీకరింపబడింది. వీటిని సంస్కరించడంలో ఆర్యభట్ట, వరాహమిహిరుడు, భాస్కరుడు మొదలగువారి కృషికూడా ఉంది.