చౌల్‌ముగ్రిక్ ఆమ్లం

(హిడ్నొకార్పైల్ ఎసిటిక్ ఆసిడ్ నుండి దారిమార్పు చెందింది)

చౌల్‌ముగ్రిక్ ఆమ్లం అనునది ఒక అసంతృప్త కొవ్వు ఆమ్లం.చౌల్‌ముగ్రిక్ ఆమ్లం ఒకద్వింబధాన్ని కలిగివున్న కొవ్వు ఆమ్లం.చౌల్‌ముగ్రిక్ అనుచెట్టు యొక్క విత్తన నూనెలోఆమ్లం గ్లిజరాయిడ్ రూపంలో గుర్తించడం వలన ఈ ఆమ్లం నకు చౌల్‌ముగ్రిక్ ఆమ్లం అనే వాడుక పేరు ఏర్పడినది.[1] చౌల్‌ముగ్రిక్ ఆమ్లాన్ని చాల్‌ముగ్రిక్ ఆమ్లం అనికూడా పలికెదరు.

చౌల్‌ముగ్రిక్ ఆమ్లం
పేర్లు
IUPAC నామము
D-13-(2-Cyclopenten-1-yl)tridecanoic Acid
ఇతర పేర్లు
Hydnocarpylacetic Acid
13-(2-Cyclopenten-1-yl)tridecansäure
C18:1 (Lipid numbers)
ధర్మములు
C18H32O2
మోలార్ ద్రవ్యరాశి 280.44
సాంద్రత 0.9±0.1 g/cm3
ద్రవీభవన స్థానం 59-60°C
బాష్పీభవన స్థానం 408.2±14.0 °C at 760 mmHg
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

ఆమ్ల సమ్మేళ వివరాలు-గుణగణాలు

మార్చు

చౌల్‌ముగ్రిక్ ఆమ్లం 18 కార్బనులను కలిగిన ఒక అసంతృప్త కొవ్వు ఆమ్లం. చౌల్‌ముగ్రిక్ ఆమ్లాన్నిహిడ్నొకార్పైల్ ఎసిటిక్ ఆసిడ్ (hydnocarpylacetic acid) అనికూడా అంటారు.ఆమ్లంలోని అణువులో 18 కార్బన్ పరమాణువులు, 32 హైడ్రోజన్ పరమాణువులు, 2 ఆక్సిజన్ పరమాణువులు వుండును. అణుసంకేత సూత్రం C17H31COOH. అణుభారం 280.55. ఇదిపొడవైన హైడ్రోకార్బన్ శృంఖలం కలిగిన అసంతృప్తకొవ్వు ఆమ్లం. హైడ్రోకార్బన్ శృంఖలం చివర ఒక పంచభుజ వలయాన్నిపొందివుండటం వలన ఇది ఒక సైక్లొపేంటెనిల్ (cyclopentenyl) ఆమ్లం.ఈ ఆమ్లం యొక్క IUPAC శాస్త్రీయ పేరు 13-cyclopent-2-en-1-yl tridecanoic acid[2].

సాధారణ అణు ఫార్ములా;C17H31COOH
వివరణాత్మక అణు ఫార్ములా:C5H7 (CH2) 12COOH

చౌల్‌ముగ్రిక్ ఆమ్లం యొక్క భౌతిక రసాయనిక ధర్మాలు [3]

గుణము విలువల మితి
అణు సంకేత సూత్రం C18H32O2
అణుభారం 280.45
వక్రీభవన సూచిక 1.483[4]
తలతన్యత 38.2±3.0 dyne/cm[4]
సాంద్రత 0.9±0.1 g/cm3[4]
ద్రవీభవన ఉష్ణోగ్రత 68.5 °C
బాష్పీభవన ఉష్ణోగ్రత 408.2±14.0 °C at 760 mmHg[4]
అయోడిన్ విలువ 90.5
ద్రావణీయత ఇథర్, క్లొరోఫారం, ఇథైల్ ఎసిటెట్లలో
మిగతా ఆర్గానిక్ ద్రవాలలో కరుగుతుంది

ఉపయోగాలు

మార్చు

చౌల్‌ముగ్రిక్ ఆమ్లాన్ని ఆల్కహాల్ లతో చర్యకు లోను కావించి ఇథైల్, మిథైల్ ఏస్టరులను ఉత్పాదన చేయుదురు.చౌల్‌ముగ్రిక్ ఆమ్లం యొక్క మిథైల్, ఇథైల్, ఎస్టరులను కుష్టు రోగ నివారణకై ఉపయోగిస్తారు[5]

ఇవికూడా చూడండి

మార్చు
  1. నూనెలు
  2. కొవ్వు ఆమ్లాలు
  3. అసంతృప్త కొవ్వు ఆమ్లం
  4. అడవిబాదం నూనె

బయటి లింకులు

మార్చు
  1. http://www.chemspider.com/Chemical-Structure.65685.html

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. "chaulmoogric acid". merriam-webster.com. Retrieved 2013-12-01.
  2. "chaulmoogric acid". www.ebi.ac.uk/. Retrieved 2013-12-01.
  3. "Chaulmoogric Acid". www.drugfuture.com/. Retrieved 2013-12-01.
  4. 4.0 4.1 4.2 4.3 "Hydnocarpylacetic Acid". chemspider.com/. Retrieved 2013-12-01.
  5. "chaulmoogric acid ethyl ester". chembank.broadinstitute.org/. Retrieved 2013-12-01.