హిప్పీ
హిప్పీ అనేది 1960 దశకం మధ్యకాలంలో అమెరికాలో ప్రారంభమై, ఇతర దేశాలకూ వ్యాపించిన ఒక సంస్కృతి ఉద్యమం.
హిప్పీ ఫ్యాషన్, విలువలు పాప్ మ్యూజిక్, టెలివిజన్, సినిమాలు, సాహిత్యం, ఇంకా ఇతర కళల మీద ప్రభావం చూపించాయి. 1960 దశకం నుంచీ సాధారణ సమాజం హిప్పీలు పాటించిన అనేక పద్ధతులను తమలో కలుపుకున్నారు. హిప్పీలు పాటించిన సర్వమత, సాంస్కృతిక సమానత్వం బహుళ ప్రజాదరణ పొందింది. తూర్పు దేశాల తత్వం, ఆసియా దేశాల ఆధ్యాత్మిక పద్ధతులు చాలా మందికి చేరువయ్యాయి.
చరిత్ర
మార్చు1968 జులైలో టైమ్ మ్యాగజీన్ పత్రిక ప్రచురించిన ఒక కథనం ప్రకారం హిప్పీ సంస్కృతి భావాలకు మూలం, హిందూమతంలో భౌతిక ప్రపంచంపై వ్యామోహాన్ని విడనాడి సన్యాసం స్వీకరించే సాధువుల సంస్కృతి.[1]
గుణగణాలు
మార్చుహిప్పీలు సాంఘిక కట్టుబాట్ల నుంచి దూరంగా జరిగి తమదైన జీవనశైలి అలవరుచుకుని జీవితానికి కొత్త అర్థం వెతుక్కోవాలనుకున్నారు. దీనికోసం వీరు ప్రత్యేకమైన రంగురంగుల దుస్తులు ధరించారు. దీని ద్వారా వారిలో వారు సులభంగా గుర్తు పట్టేవారు. వీరు ఉపయోగించే వాహనాలు కూడా అలాగే ప్రత్యేకంగా ఉండేవి.
ఆధ్యాత్మికత, మతం
మార్చుహిప్పీలు చాలావరకు ప్రముఖ మతాలను విస్మరించి వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బౌద్ధమతం, హిందూమతం, సూఫీ మొదలైనవి వారి ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయి; ఎందుకంటే వాటిలో వారికి స్వేచ్ఛ కనిపించింది.[2]
వారసత్వం
మార్చుహిప్పీ ఉద్యమం వారసత్వం పాశ్చాత్య సమాజంలో ఇంకా కొనసాగుతూ వస్తోంది.[3] సాధారణంగా, అన్ని వయసుల అవివాహిత జంటలు ప్రయాణించడానికి, సాంఘిక కట్టుబాట్లతో సంబంధం లేకుండా కలిసి జీవించడానికి సంకోచించరు. లైంగిక విషయాలకు సంబంధించి స్పష్టత సర్వసాధారణంగా మారింది. స్వలింగ సంపర్కం, ద్విలింగ సంపర్కం, అలాగే తమను తాము వర్గీకరించకూడదని ఎంచుకునే వ్యక్తుల హక్కులు విస్తృతమయ్యాయి. మతపరమైన సాంస్కృతిక వైవిధ్యం ఎక్కువ ఆమోదం పొందింది.[4]
మూలాలు
మార్చు- ↑ "The Hippies", Time, July 7, 1968, retrieved 2007-08-24
- ↑ Goldberg, Danny (October 23, 2011). "In Defense of Hippies". Dissent Magazine Online.
- ↑ Prichard, Evie (June 28, 2007). "We're all hippies now". The Times. London. Archived from the original on 2011-05-14. Retrieved 2010-05-04.
- ↑ Barnia, George (1996), The Index of Leading Spiritual Indicators, Dallas TX: Word Publishing, archived from the original on 2011-01-04, retrieved 2021-09-22