టైమ్ (పత్రిక)
టైమ్ ఒక అమెరికన్ వార్తా పత్రిక, వెబ్‌సైటు. ఇది అమెరికాలోని న్యూయార్కు నగరం నుంచి ప్రచురించబడుతోంది. ఇది కొన్ని దశాబ్దాల పాటు వారపత్రికగా ఉంది. మార్చి 2020 నుంచి పక్ష పత్రికగా రూపుదిద్దుకుంది. ఇది మొట్టమొదటి సారిగా మార్చి 3, 1923 న న్యూయార్కు నగరంలో ప్రచురింపబడింది. ఈ పత్రికను చాలా రోజులపాటు దాని ప్రభావవంతమైన వ్యవస్థాపకుడు హెన్రీ లూస్ నడిపాడు. దీని యూరోపియన్ సంచిక (టైమ్ యూరోప్, అంతకుముందు టైమ్ అట్లాంటిక్) లండన్ నుంచి ప్రచురించబడుతూ మధ్యప్రాచ్యం, ఆఫ్రికాను కవర్ చేస్తుండగా 2003 నుంచి లాటిన్ అమెరికాను కూడా కవర్ చేస్తోంది. దీని ఆసియా విభాగం (టైమ్ ఆసియా) హాంగ్‌కాంగ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది.[2] సిడ్నీ కేంద్రంగా పనిచేసే సౌత్ పసిఫిక్ సంచిక ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, పసిఫిక్ దీవుల్లోని వార్తలు సేకరించి ప్రచురిస్తుంది.
![]() | |
ఎడిటర్ ఇన్ చీఫ్ | ఎడ్వర్డ్ ఫెల్సెంథాల్ |
---|---|
వర్గాలు | వార్తా పత్రిక |
తరచుదనం | వార పత్రిక(1923–2020); పక్ష పత్రిక(2020–) శుక్రవారం |
మొత్తం కాపీలు (2020) | 1.6 million[1] |
మొదటి సంచిక | మార్చి 3, 1923 |
సంస్థ | టైమ్ ఇంక్ (1923–1990; 2014–2018) వార్నర్ మీడియా (1990–2014) మెరెడిత్ కార్పొరేషన్ (2018) టైమ్ USA, LLC. (మార్క్ బెనియాఫ్) (2018–ప్రస్తుతం) |
దేశం | అమెరికా |
కేంద్రస్థానం | న్యూయార్క్ నగరం |
భాష | అమెరికన్ ఇంగ్లీషు |
ISSN | 0040-781X |
OCLC | 1311479 |
2012 లో ఈ పత్రికకు 33 లక్షల సర్క్యులేషన్ తో అమెరికాలో 11వ స్థానంలో ఉంది. పీపుల్ మ్యాగజీన్ తర్వాత అత్యధిక సర్క్యులేషన్ కలిగిన రెండో వార పత్రిక ఇది.
గతంలో ఈ పత్రికను న్యూయార్క్ సిటీ కేంద్రంగా పనిచేసే టైమ్ ఇంక్ ప్రచురించేది. నవంబర్ 2018 నుండి టైమ్ USA, LLC ద్వారా ప్రచురించబడుతోంది. దీనిని మార్క్ బెనియాఫ్ యాజమాన్యం మెరెడిత్ కార్పొరేషన్ నుండి కొనుగోలు చేసింది.
చరిత్రసవరించు
మార్చి 3, 1923 లో ఈ పత్రిక ప్రారంభం నుంచి ఈ పత్రిక న్యూయార్క్ కేంద్రంగా ప్రచురించబడుతూ వస్తోంది. బ్రైటన్ హేడెన్, హెన్రీ లూస్ ఈ పత్రిక ప్రచురణ కర్తలు. ఇది అమెరికాలో మొట్టమొదటి వార వార్తా పత్రిక.[3]
శైలిసవరించు
మైల్‌స్టోన్స్ విభాగంలో ప్రముఖ వ్యక్తుల పుట్టిన రోజులు, మరణ తేదీలు, వివాహం, విడాకులు లాంటివి ప్రచురిస్తుంది. 1967 వరకు ఇవి చాలా సంక్షిప్తంగా ఒక ఫార్ములాను అనుసరించి ఉండేవి. 1927 నుంచి ఈ పత్రిక ముఖ చిత్రం మీద ఎరుపు రంగు బోర్డరు ప్రస్ఫుటంగా కనిపించేది. 2007 నుంచి ఈ డిజైన్ కొంచెం మారింది.
మూలాలుసవరించు
- ↑ "Consumer Magazines". Alliance for Audited Media. Archived from the original on January 23, 2017. Retrieved October 6, 2016.
- ↑ "Time Asia (Hong Kong) Limited - Buying Office, Service Company, Distributor from Hong Kong | HKTDC". www.hktdc.com. Retrieved January 14, 2020.
- ↑ "History of Time". Time. Archived from the original on March 4, 2005.