స్థితిస్థాపక హద్దులో ఉన్నపుడు ఒక స్ప్రింగులోని సాగుదల ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ సూత్రంస్ప్రింగ్ త్రాసు పనిచేసే నియమానికి ఉపయోగపడుతుంది. ఈ సూత్రమును 17 వ శతాబ్దంలో బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ కనుగొన్నాడు.

హుక్ సూత్రము బరువు పెరిగితే స్ప్రింగ్ సాగుదల కూడా పెరుగునని వివరిస్తుంది.


x అనునది స్ప్రింగు విరామస్థానం నుండి స్థానబ్రంశము(మీటర్లలో);
F అనగా స్ప్రింగు పై పనిచేసే బలము (SI పద్ధతిలో :N or kg·m/s2); ,
k అనగా ఒక స్థిరాంకం.(SI పద్ధతిలో: N/m or kg/s2).
పునఃస్థాపక బలం వ్యతిరేక దిశలో ఉండటం వల్ల స్థానబ్రంశం ఋణాత్మకంగా తీసుకుంటాం.

బరువు

మార్చు

బరువు లేదా భారము (ఆంగ్లం Weight) ఒక రకమైన కొలమానము. భౌతిక శాస్త్రం ప్రకారం, ఒక వస్తువు పై గల గురుత్వాకర్షణ బలమును "భారము" లేదా "బరువు"అందురు. వస్తువు బరువు దాని ద్రవ్యరాశి, గురుత్వ త్వరణం ల లబ్ధానికి సమానము. 'm' ద్రవ్యరాశి గాను, 'g' గురుత్వ త్వరణం గల వస్తువుకు కలిగే భారం W=mg అవుతుంది. ఇది ప్రదేశాన్ని బట్టి మారుతుంది. ఒక కిలోగ్రాం ద్రవ్యరాశి గల వస్తువు భారం భూమిపై సాధారణంగా 9.8 న్యూటన్లు ఉంటుంది. భారం అనగా వస్తువుపై గల గురుత్వాకర్షణ బలం కావున దీని ప్రమాణాలు బలం ప్రమాణాలతో సమానంగా ఉంటుంది. భారమునకు దిశ ఉంటుంది కావున భారం సదిశ రాశి దీనిని స్ప్రింగ్ త్రాసుతో కొలుస్తారు.

యివి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు