హరదనహళ్లి దేవెగౌడ రేవన్న (జననం 17 డిసెంబర్ 1957) కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు కర్ణాటక రాష్ట్రంలోని శాసనసభ సభ్యుడు, హసన్ జిల్లాలోని హోలెనరసిపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కర్ణాటక శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. [2] హెచ్ డి రేవణ్ణ జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి చెందిన వాడు. [3] రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణపై 20 ఏళ్ల యువకుడు తన తల్లి ని కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2024 ఏప్రిల్‌లో హెచ్‌డి రేవణ్ణపై కిడ్నాప్ కేసు నమోదైంది.

హెచ్.డి రేవణ్ణ
హెచ్‌.డి రేవణ్ణ


కర్ణాటక ప్రజా పనుల శాఖ మంత్రి
పదవీ కాలం
2018 జూన్ 6 [1] – 2019 జూలై 23
ముందు హెచ్.సి. మహాదేవప్ప
తరువాత గోవింద్ కర్జొల్
నియోజకవర్గం హోలెనరసిపూర్ శాసనసభ నియోజకవర్గం

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 డిసెంబర్ 11– 1999 జూన్ 12
2004 జూన్ 14 - ప్రస్తుతం
ముందు పుట్టు స్వామి గౌడ
నియోజకవర్గం హోలెనరసిపూర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1957-12-17) 1957 డిసెంబరు 17 (వయసు 66)
మైసూరు , కర్ణాటక భారతదేశం
రాజకీయ పార్టీ జనతాదళ్ (సెక్యులర్)
సంతానం 2, ప్రజ్వల్ రేవణ్ణ, సూరజ్ రేవణ్ణ

వ్యక్తిగత జీవితం

మార్చు

హెచ్ డి రేవణ్ణ భారత మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ చానమ్మ దంపతులకు జన్మించాడు. ‌హెచ్‌డి కుమారస్వామికి అన్నయ్య. హెచ్ డి రేవణ్ణ భవానీ రేవణ్ణను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సూరజ్, ప్రజ్వల్ ఉన్నారు. [3] ప్రజ్వల్ రేవణ్ణ 2019లో హాసన్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

రాజకీయ జీవితం

మార్చు

1994లో హెచ్ డి రేవణ్ణ హోలెనరసిపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి కర్ణాటక శాసనసభ కు ఎన్నికయ్యారు . హెచ్ డి రేవణ్ణ 1999లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు, 2004 ఎన్నికలలో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యాడు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచి ధరమ్ సింగ్, హెచ్‌డి కుమారస్వామి ప్రభుత్వాలలో విద్యుత్ శాఖ ప్రజాపనుల శాఖ మంత్రిగా పని చేశాడు. [3] హెచ్‌డీ రేవణ్ణ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్)కి 9 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా పనిచేశాడు. [3] 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హోలెనరసిపూర్ నుంచి హెచ్‌డీ రేవణ్ణ 92,713 ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. [4]

మూలాలు

మార్చు
  1. "Karnataka: CM Kumaraswamy's brother HD Revanna, Congress's DK Shivakumar take oath as ministers". Scroll.in. Retrieved 15 June 2021.
  2. "Holenarasipur Election Result 2018 Live: Holenarasipur Assembly Elections Results (Vidhan Sabha Polls Result)".
  3. 3.0 3.1 3.2 3.3 "H.D. Revanna". Janata Dal (Secular) Official Website. Archived from the original on 1 October 2015. Retrieved 28 October 2015.
  4. "HD Revanna, Holenarasipur constituency Karnataka election result 2018 LIVE updates: Deve Gowda's son wins". 14 May 2018.