హెచ్.వి.ఆర్. అయ్యంగార్

భారత బ్యాంకర్

హరవు వెంకటనరసింహా వరద రాజ అయ్యంగార్ CIE, ICS (1902 ఆగష్టు 23 [1] [2] – 1978 ఫిబ్రవరి 22) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరవ గవర్నరు. [3] 1957 మార్చి 1 నుండి 1962 ఫిబ్రవరి 28 వరకు అతను పదవిలో ఉన్నాడు.

అతను ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడు. 1926 అక్టోబరు 20 న సేవలో ప్రవేశించాడు. అతను 1941 న్యూ ఇయర్ ఆనర్స్‌లో కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (CIE) గా నియమితుడయ్యాడు. రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా నియమితుడయ్యే ముందు అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా పనిచేశాడు.


అయ్యంగార్ హయాంలో, భారతీయ నాణేల వ్యవస్థ మునుపటి పైసలు, అణాల వ్యవస్థ నుండి ఆధునిక దశాంశ నాణేల వ్యవస్థకు మారింది. అతని పదవీకాలంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా వేరియబుల్ క్యాష్ రిజర్వ్ రేషియో, సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్ లను కూడా ప్రవేశపెట్టారు. 1962లో అయ్యంగార్, భారత ప్రభుత్వం నుండి భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను అందుకున్నాడు. [4] 2002లో అతని జన్మ శతజయంతి సందర్భంగా, 1962 లో పదవీ విరమణ తర్వాత అయ్యంగార్ రాసిన వ్యాసాలతో కూడిన స్నాప్‌షాట్స్ ఆఫ్ హిస్టరీ— త్రూ ది రైటింగ్స్ ఆఫ్ హెచ్‌విఆర్ అయ్యంగార్ అనే పుస్తకాన్ని ఆయన కుమార్తె ఇందిర, అల్లుడు బిపిన్ పటేల్ సంకలనం చేసి సంపాదకత్వం వహించారు. [1] [5]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Glimpses of the past Frontline Issue dated 07 - 20 June 2003
  2. Dr. H V R Iyengar vs Mrs.Indira Bipin Patel on 21 September 2010 India Kanoon Retrieved 28 August 2013
  3. "List of Governors". Reserve Bank of India. Archived from the original on 2008-09-16. Retrieved 2006-12-08.
  4. Padma Vibhushan awardees Archived 2016-03-04 at the Wayback Machine GOI Archives
  5. The Making Of History Of Our Times Financial Express 3 August 2003